Kalyan Dhev : మెగాస్టార్ చిరంజీవి చిన్నకూతురు శ్రీజ విడాకులతో ఎక్కువగా వార్తలలో నిలుస్తున్న విషయం తెలిసిందే. మొదట శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ భామ కొద్ది రోజులకి అతని నుండి విడాకులు తీసుకొని సింగిల్ గా ఉంది. అయితే కొన్నాళ్ల తర్వాత చిరంజీవి తన కూతురుకి కుటుంబ సభ్యులలో ఒకరితో పెళ్లి చేశాడు. కొన్నాళ్లు వీరి వైవాహిక జీవితం బాగానే ఉన్నా ఎందుకో మధ్యలో బ్రేకులు పడ్డాయి. శ్రీజ, నవిష్కలకు ఓ కుమార్తె ఉండగా, ఇటీవవల తన కుమార్తె నవిష్కతో ఉన్న ఫోటోలు షేర్ చేసిన కల్యాణ్.. వారంలో నేను ఎంతో ఆనందంగా గడిపే నాలుగు ఇవే అంటూ క్యాప్షన్ ఇచ్చారు. మాములుగా దంపతులు విడాకులు తీసుకున్నప్పుడు.. లేదా కోర్టులో హియరింగ్స్ జరుగుతున్నప్పుడు ఫ్యామిలీ కోర్టు ఇలాంటి రూల్స్ పాస్ చేస్తూ ఉంటుంది.
వాదోపవాదనలు విని.. పిల్లలు ఎవరి వద్ద ఉండాలి.. వారిని తల్లి లేదా తండ్రి ఎప్పుడు కలవాలి.. ఎన్ని గంటలు వారితో ఉండాలి అని నిర్ణయిస్తుంది. కల్యాణ్ దేవ్ పోస్ట్‌ను బట్టి అతడు నవిష్కతో వారానికి 4 గంటలు మాత్రమే గడుపుతున్నట్లు అర్థమైంది. తొలుత శ్రీజ తన సామాజిక మాధ్యమాల నుంచి కళ్యాణ్ దేవ్ నేమ్ రిమూవ్ చేయడంతో.. వీరిద్దరి డివోర్స్ వదంతలు వ్యాపించాయి. ఆ తర్వాతి కాలంలో మెగా ఫ్యామిలీ ఈవెంట్స్‌లో కల్యాణ్ దేవ్ లేకుండానే శ్రీజ కనిపించడంతో విడాకుల వార్తలకు మరింత బలం చేకూరింది. శ్రీజతో డిఫరెన్స్‌స్ అనేే విషయం బయటకు వచ్చాక.. కళ్యాణ్ దేవ్ హీరోగా చేసిన 2 మూవీస్ సూపర్ మచ్చి, కిన్నెరసాని విడుదల అయ్యాయి. ఆ సినిమా దారుణమైన ఫ్లాప్ అయింది.

శ్రీజ వద్దే పెరుగుతున్న నవిష్క అప్పుడప్పుడు తండ్రి కళ్యాణ్ దేవ్ ని కలుస్తుంది. నవిష్క ఎప్పుడు వచ్చినా… ఆ ఫోటోలు కళ్యాణ్ దేవ్ సోషల్ మీడియాలో పెడతాడు. తాజాగా దీపావళి పండక్కి నవిష్క తండ్రి కళ్యాణ్ దేవ్ వద్దకు వచ్చింది. పట్టుబట్టల్లో సిద్ధం చేసి కూతురితో దీపావళి జరుపుకున్నాడు కళ్యాణ్ దేవ్. తల్లి శ్రీజ లేకుండానే నవిష్క దీపావళి చేసుకుంది. నవిష్క, కళ్యాణ్ దేవ్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. శ్రీజకు దూరమయ్యాక కళ్యాణ్ దేవ్ సినిమాలు చేయడం లేదు. మెగా ఫ్యామిలీ సపోర్ట్ కోల్పోవడంతో కళ్యాణ్ దేవ్ చిత్రాలను ఎవరూ పట్టించుకోవడం లేదు.