Kalki 2898AD On OTT : ప్రభాస్, దీపికా పదుకునె, అమితాబ్ బచ్చన్, కమల హాసన్ లు ప్రధాన పాత్రల్లో నటించిన కల్కి 2898ఏడీ మూవీ ఎట్టకేలకు డిజిటల్ ప్లాట్‌ఫాంలోకి వచ్చేసింది. ఇన్ని రోజుల పాటు థియేటర్లలో రన్ అయిన ఈ మూవీని ఇక ప్రేక్షకులు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయవచ్చు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ఇప్పటి వరకు ఇండియాలో తెరకెక్కిన అత్యంత భారీ బడ్జెట్ మూవీ కావడం విశేషం. ఈ మూవీని ఏకంగా రూ.600 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. కలెక్షన్ల సునామి సృష్టించింది.
కల్కి 2898 ఏడీ మూవీ ఈ ఏడాది జూన 27న థియేటర్లలో రిలీజ్ అయింది. బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే రీతిలో కలెక్షన్లను వసూలు చేసింది. మొత్తంగా 28 రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా రూ.1100 కోట్లను కలెక్ట్ చేసింది. సైన్స్ ఫిక్షన్, మైథాలజీ మేళవింపుతో వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. పలు భారతీయ భాషల్లోనూ రిలీజ్ చేయడంతో ఈ మూవీ దాదాపుగా అన్ని భాషల్లోనూ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇండియాలోనే ఏకంగా రూ.770 కోట్లను వసూలు చేసింది.

కల్కి 2898 ఏడీ మూవీ ప్రస్తుతం ఓటీటీలోకి వచ్చేసింది. అయితే ఎక్కువ మంది ప్రేక్షకులు ఈ మూవీని చూడాలని చెప్పి దీన్ని రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో రిలీజ్ చేశారు. నెట్ ఫ్లిక్స్‌తోపాటు అమెజాన్ ప్రైమ్ వీడియోలోనూ ఈ మూవీ అందుబాటులో ఉంది. అయితే నెట్ ఫ్లిక్స్‌లో కేవలం హిందీ వెర్షన్ మాత్రమే ఉండగా, అమెజాన్ ప్రైమ్ వీడియోలో తమిళం, తెలుగు, కన్నడ, మళయాళం భాషల్లో కల్కి మూవీని చూడవచ్చు. కల్కి మూవీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోగా దీనికి సీక్వెల్‌ను కూడా రిలీజ్ చేయనున్నారు. అయితే ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ కొనసాగుతుండగా, త్వరలో సీక్వెల్‌పై కూడా ప్రకటన విడుదల చేయనున్నారు.