ట్రిపుల్ ఆర్ సినిమా ప్రమోషన్ సమయంలో మీడియాలో ఎక్కువగా కనిపించిన ఎన్టీఆర్ ఆ తర్వాత పెద్దగా కనిపించలేదు అయితే ఆదివారం నాడు తన అన్నయ్య కళ్యాణ్ రామ్ నటించిన ‘అమిగోస్స సినిమా ప్రీ-రిలీజ్ వేడుకకు ముఖ్య అతిధిగా హాజరయ్యాడు. ఆరోగ్యం బాగోలేకపోయిన కూడా అన్నయ్య కోసం ఓపిక చేసుకొని వచ్చాడు. అయితే ఈ వేడుకలో ఎన్టీఆర్ మాట్లాడే ముందు యాంకర్ సుమ అందరికి చెప్పినట్టుగానే ఎన్టీఆర్ కి కూడా ఇంట్రడక్షన్ చెప్పింది. అయితే అది చెప్పడం లో కొంచెం తేడా కొట్టింది,
ఎన్టీఆర్ స్పీచ్‌కి ముందు మాట్లాడేటప్పుడు ఎన్టీఆర్ తన 30వ చిత్రం అప్‌డేట్ ఇస్తారంటూ మాట్లాడింది సుమ. ఆమె అలా మాట్లాడుతున్నప్పుడు ఎన్టీఆర్ సుమ వైపు చాలా సీరియస్‌గా చూశాడు. అయితే పక్కనే ఉన్న కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్‌ని కూల్ చేయటంతో తారక్ సైలెంట్ అయిపోయారు. అయితే తాను మాట్లాడుతున్న సమయంలో ఫ్యాన్స్‌కి ఓ రేంజ్‌లో క్లాస్ పీకారు. ‘‘సినిమా అప్డేట్ కోసం మీ ఆరాటం, తాపత్రయం మాకు అర్థమవుతోంది. దర్శక నిర్మాతలకు ఒత్తిడిని పెంచకండి. దాంతో నష్టం కలుగుతుంది. అప్డేట్ ఉంటే.. ఇంట్లో మా భార్య కంటే మీకే ముందుగా చెబుతాం. ఇప్పుడు మనం ప్రపంచ స్థాయిలో ఉన్నాం.
మంచి సినిమా అందించాలని అనుకుంటాం. మంచి సందర్భం కోసం చూశాం. ఈరోజు మంచి రోజు కాబట్టి చెబుతున్నాను. ఫిబ్రవరిలో సినిమా ను ప్రారంభిస్తాం. మార్చి 20న షూటింగ్ ప్రారంభిస్తాం. 2024 ఏప్రిల్ 5న సినిమాను రిలీజ్ చేస్తాం’’ అన్నారు జూనియర్ ఎన్టీఆర్. ఏదోలా తన సినిమాకి సంబంధించిన అప్‌డేట్ అయితే ఇచ్చడు కాని సుమ ప్రవర్తించిన తీరు మాత్రం ఎన్టీఆర్‌కి చాలా కోపం తెప్పించినట్టు అర్ధమవుతుంది. ప్రస్తుతం సుమపై ఎన్టీఆర్ చూపించిన రియాక్షన్ కి సంబంధించిన ఫొటోలు, వీడియోలు తెగ హల్‌చల్ చేస్తున్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…