వినోదం

Vishwnath: విశ్వ‌నాథ్ ఖాకీ దుస్తులు ధ‌రిచ‌డం వెన‌క ఉన్న అస‌లు కార‌ణం ఏంటంటే..!

Vishwnath: తెలుగు దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు క‌ళాతప‌స్వి కె విశ్వ‌నాథ్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ గురువారం రాత్రి అపోలో హాస్పిటల్ లో మరణించిన సంగతి తెలిసిందే.ఈయన మరణ వార్త తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని చెప్పాలి. తెలుగు చిత్ర సీమ‌కి శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం వంటి ఎన్నో అద్భుతమైన సినిమాలుఅందించారు.ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో సుమారు 50 సినిమాలకు పైగా దర్శకత్వం వహించిన విశ్వనాథ్ గారు మరణించడం ఇండస్ట్రీకి తీరని లోటు. ఆయన తీసిన ప్రతి ఒక్క సినిమా ఆణిముత్యంలా ఉంటుందని చాలామంది అంటూ ఉంటారు.

విశ్వ‌నాథ్ తెర‌కెక్కించే ప్రతి సినిమాలో తెలుగుదనం ఉట్టిపడేలా, సాంప్రదాయ పద్ధతులకు ప్రతీకగా ఉంటాయి. సినిమా ఇండస్ట్రీలో చేసిన విశేష సేవలకు గానూ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా ఈయనను వరించింది. ఇదిలా ఉంటే ఈయన చనిపోయాక ఈయన గురించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలోతెగ చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈయన గురించి ఒక ఆసక్తికరమైన ప్రశ్న సోషల్ మీడియాలో హ‌ల్చ‌ల్ చేస్తుంది. విశ్వ‌నాథ్ గారు షూటింగ్ టైంలో ఖాకి దుస్తులు ఎందుకు ధరిస్తారు అనే ప్రశ్న ప్రతి ఒక్కరి మదిలో మెదులుతోంది.

ఇదే ప్రశ్నని ఓ ఇంటర్వ్యూలో విశ్వనాధ్ గారిని అడిగితే.. సినిమా అనేది ఒక ఉద్యోగం లాంటిది.దాన్ని మనం చాలా బాధ్యతగా వహించాలి.దానిని ఒక విధిలాగా తీసుకోవాలని,బాధ్యతగా చూపించాలి. అందుకే నేను ప్రతి సినిమా షూటింగ్లో చాలా బాధ్యతగా యూనిఫామ్ వేసుకుని ఉంటాను అంటూ ఆయన సమాధానం చెప్పుకొచ్చారు. సాధారణంగా సెట్స్ లో పని చేసే లైట్ బాయ్స్, పేయింటర్స్ ఖాకీ రంగు దుస్తులనే వేసుకుంటారు.వారు ఖాకీ షర్ట్ తో పాటు నిక్కర్ వేసుకుంటే, విశ్వ‌నాథ్ మాత్రం ఖాకీ ష‌ర్ట్ ప్యాంట్ వేసుకొని ఇన్‌ష‌ర్ట్ చేసుకునే వారు. ప్రస్తుతం ఈ విషయం తెలిసిన చాలామంది సినిమా విషయంలో ఆయన డెడికేషన్ పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM