Jr NTR : టాలీవుడ్ స్టార్ హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. ఆయనకి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ అందిపుచ్చుకున్న ఎన్టీఆర్ దేవర అనే చిత్రంతో బిజీగా ఉన్నాడు.. అయితూ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు మటన్ బిర్యానీ అంటే ఇష్టం కాగా చాలా సందర్భాల్లో తారక్ ఈ విషయాన్ని వెల్లడించారు. బావర్చిలో ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీని ఒక్కడినే తినేస్తానని తారక్ పలు సందర్భాల్లో చెప్పగా, ఈ విషయాలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. అయితే యంగ్ హీరో నాగశౌర్యకు జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎంతో అభిమానం అనే సంగతి తెలిసిందే.
ఎన్టీఆర్, నాగ శౌర్య ఫ్యామిలీ మధ్య మంచి రిలేషన్ షిప్ ఉందటూ ప్రచారాలు కూడా సాగాయి. ఈ క్రమంలో ఎన్టీఆర్ కోసం టాలీవుడ్ హీరో నాగశౌర్య మంచి మటన్ బిర్యానీ పార్సిల్ పంపించారట. నాగశౌర్య ఫ్యామిలీ నుంచి మంచి మటన్ బిర్యాని పార్సిల్ వెళ్ళినట్టుతెలుస్తోంది. నాగ శౌర్య తల్లి ఉషా మూల్పూడి నిర్మాతగా కొనసాగుతున్నారు. ఆమె పలు సినిమాలు కూడా నిర్మించారు. ఉష ముల్పూరీస్ కిచెన్ పేరుతో ఒక రెస్టారెంట్ ను మొదలుపెట్టగా,ఈ రెస్టారెంట్‌కి సెలబ్రిటీలు క్యూ కడుతున్నారు. అయితే తాజాగా ఈ రెస్టారెంట్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ కు మటన్ బిర్యానీ అందింది. నాగశౌర్య తల్లి ఉష ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించారు. వైరల్లీ ఫుడ్ ఇంటర్వ్యూ తర్వాత తమ బిజినెస్ బాగా పెరిగిందని ఆమె అన్నారు.
జూనియర్ ఎన్టీఆర్ డ్రైవర్ మటన్ బిర్యానీని కలెక్ట్ చేసుకున్నారని ఉష వెల్లడించారు. ఎన్టీఆర్ ఆర్డర్ చేయడంతో ఈ యంగ్ హీరో రెస్టారెంట్ నుంచి బిర్యానీ వెళ్లిందట. జూనియర్ ఎన్టీఆర్, నాగశౌర్య కుటుంబాల మధ్య మంచి అనుబంధం కూడా ఉందనే సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే సినిమా హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు నాగశౌర్య.కాగా గత ఏడాది అనుష్క అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వీరి పెళ్లి అయ్యి ఏడాది పూర్తవడంతో మొదటి వెడ్డింగ్ యానివర్సరీ ఇంట్లోనే ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలో ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు నాగ శౌర్య దంపతులు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…