Jr NTR And Ram Charan : టాలీవుడ్ టాప్ హీరోలలో ఎన్టీఆర్, రామ్ చరణ్ తప్పక ఉంటారు. ఈ ఇద్దరు హీరోలు క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. చరణ్, ఎన్టీఆర్ మంచి ఫ్రెండ్స్ కావడంతో ఆ కాంబో మంచిగా కుదరడం, చిత్రం కూడా సూపర్ హిట్ కావడం జరిగింది. అయితే ఈ సినిమాతో రామ్ చరణ్, ఎన్టీఆర్ స్థాయి అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. ఈ క్రమంలో వీరి క్రేజ్‌ని సినిమా మేకర్స్ తెగ వాడేసుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం అఖిల్ నటించిన ఏజెంట్ చిత్రంతో రామ్ చరణ్ ధృవతో ఏదో కనెక్షన్ ఉన్నట్టు ప్రచారం చేసి రామ్ చరణ్ క్రేజ్‌ని వాడుకున్నారు.ఇక ఇప్పుడు ఎన్టీఆర్ క్రేజ్‌ని వాడుకున్నట్టు తెలుస్తుంది.
బాలీవుడ్ చిత్రం టైగర్ 3 యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మాణంలో రూపొందుతుంది. ఈ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ పేరుతో ఈ చిత్రాలు తెరకెక్కిస్తోంది. భవిష్యత్తులో టైగర్, పఠాన్, వార్ చిత్రాలని కలుపుతూ భారీ చిత్రాలు చేసే ఆలోచనలో ఉంది. అయితే షారూఖ్ నటించిన పఠౄన్‌లో సల్మాన్ గెస్ట్ రోల్ పోషించాడు. ఇక ఇప్పుడు టైగర్ 3లో షారుఖ్ తో పాటు హృతిక్ కూడా కాసేపు సందడి చేస్తాడని ప్రచారం జరుగుతుంది. అయితే వార్ 2 చిత్రంలో ఎన్టీఆర్ కూడా నటించబోతున్న నేపథ్యంలో టైగర్ 3 చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా నటించనున్నాడని బాలీవుడ్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. రామ్ చరణ్ లాగా ఎన్టీఆర్ ని కూడా టైగర్ 3కి తెలుగులో పబ్లిసిటీ కోసం వాడేస్తున్నారా అనే అనుమానాలు ఇప్పుడు అందరిలో మెదులుతున్నాయి.
ఈ విషయంపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనవసరంగా తమ హీరో ఇమేజ్ ఎందుకు వాడుకుంటున్నారని ఫైర్ అవుతున్నారు. కొద్ది రోజుల క్రితం లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన లియో చిత్రంలో రాంచరణ్ కూడా భాగం కాబోతున్నారని.. లియో చిత్రంలో రాంచరణ్ క్లైమాక్స్ లో ఎంట్రీ ఇవ్వడం ఖాయం అంటూ పెద్ద ఎత్తున ప్రచారాలు జరిగాయి కాని అలాంటిదేమి జరగేలేదు. అయితే ముఖ్యంగా తెలుగులో తమ సినిమా ప్రమోషన్ కోసం రామ్ చరణ్, ఎన్టీఆర్ పేర్లని తెగ వాడేస్తున్నారని కొందరు చెప్పుకొస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…