JioTV Premium Plans : ప్రముఖ టెలికం సంచలనం రిలయన్స్ జియో.. తన అనుబంధ జియో టీవీ సబ్ స్క్రైబర్ల కోసం అద్భుతమైన ‘టీవీ ప్రీమియం’ ప్లాన్లు తీసుకు వచ్చింది.ఇలాంటి ప్లాన్ తీసుకు రావడం ఇదే మొదటి సారి అని చెప్పొచ్చు. ఈ ప్లాన్ ప్రకారం ఒకేసారి 14 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ వాడుకోవచ్చు.మూడు ‘జియో టీవీ ప్రీమియం ప్లాన్ ల విషయానికి వస్తే.. ధర రూ. 398, రూ. 1,198, రూ. 4,498 ప్లాన్లుగా ఉన్నాయిఇ. ఈ ప్లాన్లు వేర్వేరు వాలిడిటీలతో వస్తాయి. మీరు మీ అవసరానికి అనుగుణంగా ఏదైనా ప్లాన్‌ని ఎంచుకోవచ్చు. 28 రోజులు, 84 రోజులు, ఏడాది గడువునకు వేర్వేరు ప్లాన్లు ప్రకటించింది. నెలవారీ, మూడు నెలలు, వార్షిక ప్లాన్స్ రూ.398 నుంచి ప్రారంభం కానున్నాయి.
జియో టీవీ ప్రీమియం ప్లాన్‌లతో రీఛార్జ్ చేసుకుంటే… జియో సినిమా ప్రీమియం, డిస్నీప్లస్ హాట్‌స్టార్, జీ5, సోనీలివ్, అమెజాన్ ప్రైమ్ వీడియో, లయన్స్‌గేట్ ప్లే, డిస్కవరీ ప్లస్, డాక్యుబే, సన్‌నెక్స్‌ట్, హొయ్‌చొయ్, ప్లానెట్ మరాఠీ, చౌపల్, ఎపిక్‌వన్ వంటి 14 ఓటీటీ సర్వీసులకు యాక్సెస్ పొందుతారు. రూ. 398 ప్లాన్‌లో 12 ఓటీటీ యాప్‌ల ఉచిత సబ్‌స్క్రిప్షన్ పొందుతారు. రూ. 1,198, రూ. 4,498 ప్లాన్‌లతో 14 ఓటీటీ యాప్‌ల ఉచిత సబ్‌స్క్రిప్షన్ లభించనుంది. రూ.398 ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు కాగా, రూ.1,198 ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులుగానూ, 365 రోజుల వ్యాలిడిటీతో రూ.4,498గా ఉంది. ఇక్కడ విశేషం ఏంటంటే ప్రతి ప్లాన్‌లో కస్టమర్లు రోజుకు 2 జీబీ డేటాను కూడా పొందుతారు. 100 ఎస్ఎంఎస్, అన్‌లిమిటెడ్ కాల్స్ అందిస్తాయి.
జియోటీవీ ప్రీమియం ప్లాన్‌లతో రీఛార్జ్ చేయడం ద్వారా అనేక విభిన్న ఓటీటీ యాప్స్ సబ్‌స్క్రిప్షన్‌ను కొనుగోలు చేసే అవసరం ఇక ఉండదు. జియో టీవీ యాప్‌కి సైన్ ఇన్ చేయడం ద్వారా, ఓటీటీ యాప్స్ కోసం ప్రత్యేక లాగిన్‌లు, పాస్‌వర్డ్‌లను సృష్టించడం, గుర్తుంచుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. మీరు ఒకే చోట నుంచి విభిన్న యాప్‌ల కంటెంట్‌ను వీక్షించే ఛాన్స్ ఉంటుంది. రూ. 4,498 ప్లాన్ తీసుకున్న తర్వాత మీరు సింగిల్ క్లిక్ కస్టమర్ కేర్ కాల్ బ్యాక్ సౌకర్యం కూడా పొందుతారు. ఈ ప్లాన్ చెల్లింపును ఈఎంఐ ద్వారా కూడా చేయవచ్చు. జియో యూజర్లకు ఇప్పటికే జియో టీవీ, జియో సినిమాలాంటి ఆ సంస్థకు చెందిన యాప్స్ ఫ్రీయాక్సెస్ ఉండగా.. తాజా ప్లాన్స్ ప్రముఖ ఓటీటీల సబ్‌స్క్రిప్షన్లు కూడా అందిస్తుండడం విశేషం.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…