Jawan Movie OTT Release Date : బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఎంత పాపులర్ ఓ మనకి తెలుసు. ఆయన గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. సౌత్ ఇండియన్ డైరెక్టర్ జవాన్ సినిమాతో, మంచి హిట్ కొట్టేశారు. కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్ గా, ఈ సినిమా తెర మీదకు వచ్చింది. నయనతార షారుక్ సరసన నటించి ఆకట్టుకున్నారు. విజయ్ సేతుపతి ఈ సినిమాలో విలన్ గా కనపడ్డారు. దీపికా పదుకొనే ఈ మూవీ లో మరో కీలక పాత్ర పోషించారు. సెప్టెంబర్ 7న ప్రేక్షకులు ముందు కి, జవాన్ సినిమా వచ్చి, బ్లాక్ బస్టర్ హిట్ అయింది.
బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులతో పాటుగా, భారీ వసూళ్లను రాబట్టింది. జవాన్ ఏకంగా 1100 కోట్ల మేర కలెక్షన్లను రాబట్టింది. షారుక్ యాక్షన్ సీక్వెన్స్, నయనతార, దీపిక నటన, విజయ్ సేతుపతి విలనిజం ఇవన్నీ కూడా సినిమా కి పెద్ద ప్లస్ లు అయ్యాయి. షారుక్ పుట్టినరోజు మీ సందర్భంగా గురువారం, నవంబర్ 2న ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కి రాబోతోంది. నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవ్వబోతోంది.

ఈ నేపథ్యంలో బుధవారం అర్ధరాత్రి నుండే జవాన్ సినిమాని అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. హిందీ తో పాటుగా ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవ్వబోతోంది. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై షారుఖ్ ఖాన్ సతీమణి గౌరీ ఖాన్ ఈ సినిమాని నిర్మించారు.
ప్రియమణి, విజయ్ సేతుపతి, సానియా మల్హోత్రా తదితరులు ఈ సినిమాలో నటించారు. అనిరుద్ సినిమాకి సంగీతం అందించారు. థియేటర్లలో జవాన్ సినిమాని మిస్ అయిన వాళ్ళు, ఓటిటి లో మిస్ అవ్వకుండా చూసేయండి. ఈ బ్లాక్ బస్టర్ సినిమా కచ్చితంగా అందరికీ నచ్చుతుంది.