Ileana : గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు తన అందచందాలతో పాటు క్యూట్‌నెస్‌తో కుర్రకారు మనసులు దోచుకుంది ఇలియానా. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన ఈ కరెంటు తీగ.. ఆ తర్వాత అద్భుమైన చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.. టాలీవుడ్ స్టార్ అండ్ యంగ్ హీరోల అందరి సరనస నటించిన ఈ ముద్దుగమ్మ రాను రాను కెరీర్ సరిగ్గా మలచుకోలేకపోయింది. ఈ అమ్మడు చివరగా మాస్ మహారాజా రవితేజ సరసన అమర్ అక్బర్ ఆంటోని చిత్రంలో కనిపించింది. కొద్ది రోజుల క్రితం ఇలియానా పెళ్లి మాట చెప్పకుండానే ప్రెగ్నెన్సీ సంగతి చెప్పి పండంటి మగబిడ్డకి జన్మనిచ్చారు.
తన బాబు పేరుని, ఫేసుని రివీల్ చేసిన ఇలియానా.. బాబు తండ్రి ఎవరు అన్న విషయంలో మాత్రం సస్పెన్స్ మెయిన్‌టైన్ చేస్తూ వచ్చింది. అయితే ఈ విషయంలో కొందరు ఇలియానాని ట్రోల్ చేశారు . ఈ నేపథ్యంలో సస్పెన్స్ కి ఇప్పుడు తెరదించారు. తన భర్త ఎవరో అందరికి తెలియజేశారు. రీసెంట్ గా ఇలియానా సోషల్ మీడియా ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అయ్యారు. ఈక్రమంలోనే ఆమె తన భర్త ఎవరో అందరికి తెలియజేశారు. గతంలో ‘డేట్ నైట్’ అంటూ ఒక వ్యక్తితో ఉన్న ఫోటోలను ఈ భామ షేర్ చేసిన విషయం అందరికి తెలిసిందే. అయితే అప్పుడు అతనే తన భర్త అని ఆమె నేరుగా చెప్పలేదు కాని కొంత సస్పెన్స్ అయితే మెయింటైన్ చేసింది.
తాజాగా ఆ వ్యక్తే తన భర్త అని తెలియజేశారు. మీ సింగల్ పేరెంటింగ్ ఎలా ఉంది..? అని ఒక నెటిజెన్ క్యూస్షన్ చేసిన ప్రశ్నకు బదులిస్తూ.. తాను సింగల్ పేరెంట్ కాదని తెలియజేస్తూ తన కొడుకుకి తండ్రి ఎవరు అన్నది తెలియజేశారు. దీంతో ఇలియానా భర్త ఎవరు అన్న క్యూస్షన్ కి ఆన్సర్ దొరికేసినట్లు అయ్యింది. త్వరలోనే మళ్ళీ సినిమాలోకి తిరిగి వస్తానని, ప్రస్తుతం అమ్మగా తన భాద్యతలు నిర్వర్తిస్తున్నట్లు ఇలియానా చెప్పుకొచ్చింది. అమ్మడు చెప్పిన సమాధానలతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. . ఈ సమాధానాలతో ఆమె అభిమానులు కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అయితే ఇలియానా పెళ్లాడిన ఈ వ్యక్తి ఎవరు..? అతను ఏం చేస్తారు..? అనేది మాత్రం ఇప్పటికీ సస్పెన్స్‌గానే ఉంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…