వినోదం

Hanuman Story : హ‌నుమాన్‌పై అనేక పుకార్లు.. క్లారిటీ ఇచ్చిన చిత్ర ద‌ర్శ‌కుడు

Hanuman Story : బాలనటుడిగా కెరియర్ ప్రారంభించి పాతిక సినిమాలకు పైగా చిత్రాల్లో చేసిన చిచ్చర పిడుగు తేజ సజ్జ ఇప్పుడు హీరోగా మారి వైవిధ్య‌మైన సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. తాజాగా ఆయ‌న యంగ్ అండ్ డైనమిక్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హనుమాన్ అనే చిత్రం చేశాడు.ఈ సినిమాతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించేందుకు సిద్ధ‌మ‌య్యాడు. సంక్రాంతికి సంద‌డి చేయ‌నున్న ఈ మూవీలో అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే వినయ్ రాయ్, రాజ్ దీపక్ శెట్టి, వెన్నెల కిషోర్, సత్య, గెటప్ శ్రీనులు కూడా ఈ సినిమాలో కనిపించి సందడి చేయ‌నున్నారు.

చిత్రంలో హ‌నుమాన్‌గా తేజ క‌నిపిస్తాడ‌ని కొంద‌రు లేదు లేదు చిరంజీవి క‌నిపిస్తాడ‌ని మ‌రి కొంద‌రు అంటున్నారు. ఇదొక 3డీ మూవీ అని, రామాయ‌ణంలో ఒక భాగ‌మ‌ని అనేక పుకార్లు పుట్టిస్తున్నారు. ఈ క్ర‌మంలో ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ మూవీకి సంబంధించి జ‌రుగుతున్న ప్రచారాల‌పై క్లారిటీ ఇచ్చాడు. చిత్రంలో తేజ ఓ సాధార‌ణ వ్య‌క్తే. అత‌నికి హ‌నుమాన్ సూప‌ర్ ప‌వ‌ర్స్ వ‌స్తాయి. ఆ శ‌క్తితో అత‌డు అంజ‌నాద్రి అనే గ్రామంతోపాటు విల‌న్ల బారి నుంచి ప్ర‌పంచాన్ని ఎలా ర‌క్షిస్తాడు అనేది క‌థ అని చెప్పుకొచ్చాడు. నా ప్ర‌తి సూప‌ర్ హీరో స్టోరీల్లో ఓ దేవుడి ప్ర‌స్తావ‌న ఉంటుంది.

Hanuman Story

త‌ర్వ‌త అధీరా అనే చిత్రం రానుండ‌గా ఇందులో మూడో సినిమా హీరోయిన్ ప్ర‌ధాన పాత్ర‌గా ఉంటుంది అని ప్ర‌శాంత్ వ‌ర్మ తెలిపాడు. దేవుడి పాత్ర‌లే సూప‌ర్ హీరోలుగా మొత్తం 12 సినిమాల‌ను అత‌డు ప్లాన్ చేసిన‌ట్టు చెప్పుకొచ్చాడు. హను-మాన్ తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్‌తో సహా పలు భారతీయ భాషల్లో పాన్ వరల్డ్‌ విడుదల కానుంది. మన హనుమంతుడిని మించిన సూపర్ మాన్ మరొకరు ప్రపంచంలో లేరని ఈ సినిమాతో చూపించబోతున్నాడు ప్రశాంత్ వర్మ. కచ్చితంగా పిల్లలకు కుటుంబాలకు ఈ సినిమా బాగా నచ్చుతుందని గట్టి నమ్మకంతో ఉన్నాడు ప్ర‌శాంత్. చూడాలి మ‌రి సంక్రాంతి బ‌రిలో ఈ మూవీ ఎంత‌గా త‌ట్టుకుంటుంది అనేది.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM