Hanuman Story : బాలనటుడిగా కెరియర్ ప్రారంభించి పాతిక సినిమాలకు పైగా చిత్రాల్లో చేసిన చిచ్చర పిడుగు తేజ సజ్జ ఇప్పుడు హీరోగా మారి వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని అలరించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఆయన యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హనుమాన్ అనే చిత్రం చేశాడు.ఈ సినిమాతో ప్రేక్షకులని పలకరించేందుకు సిద్ధమయ్యాడు. సంక్రాంతికి సందడి చేయనున్న ఈ మూవీలో అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే వినయ్ రాయ్, రాజ్ దీపక్ శెట్టి, వెన్నెల కిషోర్, సత్య, గెటప్ శ్రీనులు కూడా ఈ సినిమాలో కనిపించి సందడి చేయనున్నారు.
చిత్రంలో హనుమాన్‌గా తేజ కనిపిస్తాడని కొందరు లేదు లేదు చిరంజీవి కనిపిస్తాడని మరి కొందరు అంటున్నారు. ఇదొక 3డీ మూవీ అని, రామాయణంలో ఒక భాగమని అనేక పుకార్లు పుట్టిస్తున్నారు. ఈ క్రమంలో దర్శకుడు ప్రశాంత్ మూవీకి సంబంధించి జరుగుతున్న ప్రచారాలపై క్లారిటీ ఇచ్చాడు. చిత్రంలో తేజ ఓ సాధారణ వ్యక్తే. అతనికి హనుమాన్ సూపర్ పవర్స్ వస్తాయి. ఆ శక్తితో అతడు అంజనాద్రి అనే గ్రామంతోపాటు విలన్ల బారి నుంచి ప్రపంచాన్ని ఎలా రక్షిస్తాడు అనేది కథ అని చెప్పుకొచ్చాడు. నా ప్రతి సూపర్ హీరో స్టోరీల్లో ఓ దేవుడి ప్రస్తావన ఉంటుంది.

తర్వత అధీరా అనే చిత్రం రానుండగా ఇందులో మూడో సినిమా హీరోయిన్ ప్రధాన పాత్రగా ఉంటుంది అని ప్రశాంత్ వర్మ తెలిపాడు. దేవుడి పాత్రలే సూపర్ హీరోలుగా మొత్తం 12 సినిమాలను అతడు ప్లాన్ చేసినట్టు చెప్పుకొచ్చాడు. హను-మాన్ తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్‌తో సహా పలు భారతీయ భాషల్లో పాన్ వరల్డ్ విడుదల కానుంది. మన హనుమంతుడిని మించిన సూపర్ మాన్ మరొకరు ప్రపంచంలో లేరని ఈ సినిమాతో చూపించబోతున్నాడు ప్రశాంత్ వర్మ. కచ్చితంగా పిల్లలకు కుటుంబాలకు ఈ సినిమా బాగా నచ్చుతుందని గట్టి నమ్మకంతో ఉన్నాడు ప్రశాంత్. చూడాలి మరి సంక్రాంతి బరిలో ఈ మూవీ ఎంతగా తట్టుకుంటుంది అనేది.