Hanuman Movie Trailer Review : టాలీవుడ్‌లో ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ. తేజ సజ్జ హీరోగా ఇండియన్ సూపర్ హీరో మూవీగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా టీజర్ ఇప్పటికే రిలీజవ్వగా హనుమాన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాని వరల్డ్ వైడ్ గా శ్రీలంక, చైనా, జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా, స్పెయిన్, జర్మనీ.. ఇలా అనేక కంట్రీస్ లో మొత్తం 11 భాషల్లో రిలీజ్ చేయనున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న హనుమాన్ రిలీజ్ కానుంది.
అంజనాద్రి బ్యాక్ డ్రాప్‌లో ట్రైలర్ మొదలు కాగా, తేజ సజ్జ సహా తన ఫ్యామిలీ అక్కడ ప్రశాంతంగా ఉంటారు. ఇంతలో టెక్నాలజీని ఉపయోగించుకొని సూపర్ పవర్స్ సాధించాలనే కోరికతో విలన్ వినయ్ రాయ్ ప్రయత్నిస్తుంటాడు. అప్పుడే అంజనాద్రిలో ఏదో ఒక శక్తి ఉందని దాంతో ప్రపంచాన్నే జయించొచ్చని తెలుసుకుంటాడు. దీంతో అంజనాద్రిని స్వాధీనం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తాడు. హనుమంతుని శక్తులను పొందిన హీరో తేజ సజ్జ.. ఈ దుష్ట శక్తిని ఎలా వ్యతిరేకించాడు.. ధర్మాన్ని ఎలా రక్షించాడనేదే మిగిలిన కథ.ట్రైలర్‌లో ఒక్కో ఫ్రేమ్ చాలా క్వాలిటీగా విజువల్ వండర్‌లా ఉంది. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సూపర్బ్‌గా ఉంది.
చిరుతపులితో సమానంగా తేజ పరిగెట్టే సీన్.. తాడుతో హెలికాఫ్టర్‌ను కిందకు లాగేసే సన్నివేశాలు, హనుమంతుని భారీ విగ్రహం.. ఈ సీన్లు అన్నీ చూడటానికి గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి.. “కలియుగంలో ధర్మం కోసం పోరాడే ప్రతి ఒక్కరి వెంట హనుమాన్ ఉంటాడు” అనే డైలాగులు కూడా బావున్నాయి. ఇక హిమాలయాల్లో గడ్డ కట్టిన మంచులో తప్పస్సు చేస్తున్న హనుమాన్ కళ్లు తెరిచే లాస్ట్ సీన్ అయితే వేరే లెవల్ అని చెప్పాలి. వీఎఫ్ఎక్స్ సీన్స్ అదిరిపోయాయి. ట్రైలర్ మాత్రం వేరే లెవల్‌లో ఉంది. సినిమా అతి పెద్ద విజయం సాధించడం ఖాయం అని అంటున్నారు. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్, దీపక్ శెట్టి, గెటప్ శ్రీను, సత్య తదితరులు కీలక పాత్రలు పోషించారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…