Guppedantha Manasu October 18th Episode : ఎండి సీటు శైలేంద్ర కి దక్కకపోవడంతో, దేవయాని నిరాశపడుతుంది. తొందర్లోనే ఎండి సీటుకి వసుధార ని అనర్హులుగా చేస్తానని మాటిస్తాడు శైలేంద్ర. ఇక ఈరోజు ఎపిసోడ్ లో వసుధార ఎండి బాధ్యతల్ని తీసుకుంటుంది. కళ్ళముందే వసుధార ఎండీ సీట్ లో కూర్చోవడం దేవయాని, శైలేంద్ర తట్టుకోలేకపోతుంటారు. రిషి సీట్ లో కూర్చోవడానికి వసుధార మనసు ఒప్పుకోదు. అందుకని రిషి కూర్చున్న చైర్ పక్కనే, ఇంకో కుర్చీ వేసుకుని అందులో ఆమె కూర్చుంటుంది. నేను మీ స్థానంలో మాత్రమే కూర్చున్నాను. మీ చైర్ లో కూర్చోలేను అని అంటుంది వసుధార.
రిషి వసుధార ని ఇబ్బంది పెట్టాలని చూసి, మన దారి తెలియకుండా పోయామని అంటుంది దేవయాని. అలానే, అప్పులు, కష్టాలు ఇలా అడ్డంకులని దాటి వాళ్ళు ఇంకొంచెం బాగుపడుతున్నారని, కొడుకుతో చెప్తుంది. మనం చేయడానికి ఏమీ లేదని, ఆమె నిరాశపడుతుంది. మనం అనుకున్నది దక్కలేనంత మాత్రాన, అన్ని కోల్పోయినట్లు కాదని, తల్లితో అంటాడు. అనుకున్నది మనం సాధిస్తామని, ఎన్నో పాడు ఆలోచనలకు తన బుర్ర నిలయమని తల్లితో అంటాడు శైలేంద్ర. ఎండి సీట్లో వసుధారని చూస్తుంటే, కడుపు మొత్తం రగిలిపోతోందని కొడుకుతో చెప్తుంది దేవయాని.
టెన్షన్ పడక్కర్లేదు. తొందరలోనే ఎండి సీట్ కి వసుధర అర్హురాలు కాదని, తేలిపోతుందని అలా చేస్తానని అంటాడు శైలేంద్ర. రిషి అక్కడికి వస్తాడు. ఎండి సీట్ కి వసుధర అర్హురాలు కాదని ఎవరన్నారో చెప్పమని శైలేంద్ర ని రిషి అడుగుతాడు. రిషి ఎక్కడ వాళ్ళ మాటలు వినేశాడో అని కంగారు పడిపోతారు. వసుధారని ఎండి సీట్లో కూర్చోపెట్టి తప్పు చేశానని అనుకుంటున్నావా అని శైలేంద్రని నిలదీస్తాడు రిషి. వసుధార కి అనుభవం, వయసు తక్కువే అని, రిషితో అంటాడు శైలేంద్ర. ఒకవేళ ఆమె తప్పు చేస్తే, కాలేజీ మరింత పతనం అవుతుందని అంటాడు.
ఆమె వయసులో చిన్నది కానీ కాలేజ్ ని హ్యాండిల్ చేసే కెపాసిటీ, తనకి ఉందని వయసును బట్టి సమర్థతని అంచనా వేయడం, కరెక్ట్ కాదని క్లాస్ తీసుకుంటాడు రిషి. 100% ఆమె ఈ పోస్ట్ కి అర్హురాలు అని చెప్తాడు. అర్హత చూసే, ఆమెని కూర్చో పెట్టానని అంటాడు. ప్లేట్ మారుస్తుంది దేవయాని. ఆమెని పొగుడుతుంది. రిషికి అంత నమ్మకం ఉన్నప్పుడు, అడ్డు చెప్పడం కరెక్ట్ కాదని శైలేంద్ర కి క్లాసు ఇస్తుంది. చాలా టాలెంటెడ్ వసుధార అని ఆమెకి ఒక అవకాశం ఇద్దామని. కొన్నాళ్లు చూస్తే ఆమె అర్హురాలో కాదో తెలిసిపోతుంది అని అంటుంది.
రిషికి శైలేంద్ర సారీ చెప్తాడు. నేను ఏదైనా ఓపెన్ గా మాట్లాడుతానని చెప్తాడు. ఓపెన్ గా మాట్లాడతానని, చాటుగా మాట్లాడటం కరెక్ట్ కాదని, అక్కడే డైరెక్ట్ గా అడిగితే, సమాధానం ఇచ్చేవాడినని, రిషి అంటాడు. వసుధార నా భార్య అనో, ఇంటికి కోడలనో ఎండి బాధ్యతల్ని అప్పగించలేదని, ఆమె అర్హురాలు కాబట్టే కూర్చోబెట్టానని చెప్తాడు రిషి. రిషి వెళ్ళగానే వసుదారా క్యాబిన్ లోకి శైలేంద్ర, దేవయాని వస్తారు. వాళ్ళని చూసి చూడనట్లుగా పనిలో ఉంటుంది వసుధార. కనీసం కూర్చోమని కూడా మమ్మల్ని అడగవా అని వసుధార తో దేవయాని అంటుంది. ఊరికే చీటికీమాటికి రాకూడదని, పని మీద వస్తే బాగుంటుందని వసుధార వాళ్ళకి వార్నింగ్ ఇస్తుంది.
దేవయాని హర్ట్ అవుతుంది. నువ్వు ఒక్కదానివే కాలేజ్ ని చూసుకోలేవని. ఎప్పుడైనా కష్టంగా అనిపిస్తే హెల్ప్ అడగమని, తాను సహాయం చేస్తానని వసుధారకి రిషి చెప్తాడు. దుష్టశక్తులని దూరం చేయడానికి యజ్ఞలు చేస్తారు. కానీ, దుష్టశక్తులే యజ్ఞానికి సహాయం చేస్తానంటే, ఎలా అని ఇద్దరి మీద సెటైర్ వేస్తుంది. మీరు వెళ్లి ఇల్లు చూసుకుంటే బెటర్ అని దేవయానికి చెప్తుంది వసుధార. దేవయాని ఇది నా కాలేజ్. నా కాలేజీలో నేను ఉండకూడద అని అంటుంది. ఉండకూడదని అనడం లేదు కానీ, ఇక్కడ మీరు ఉండాల్సిన అవసరం లేదని చెప్తుంది.
మీ వయసు పెరిగిపోయింది. ఇంట్లో హాయిగా రిలాక్స్ అవ్వండి అని పంచ్ వేస్తుంది. మేడం ఇల్లు చూసుకుంటారు. మీరు, మేడం బాగోగులు చూసుకుంటూ ఉండండి అని శైలేంద్రకి కూడా పంచ్ వేస్తుంది. వసుధార మాటలతో శైలేంద్ర కోపంతో రగిలిపోతాడు. ఎండి సీట్ లో కూర్చునే అర్హత నీకు లేదని, అందరూ అనుకునేలా చేస్తానని, వసుధారతో అంటాడు. నీలాంటి వాళ్ళని, చాలామంది చూశానని, ఏం చేస్తారో చేసుకోండని అంటుంది. జింక కథను చెప్పి. వసుధారని భయపెట్టాలని ప్రయత్నం చేస్తాడు శైలేంద్ర. ఏ సీట్ ని చూసి మురిసిపోతున్నావో, అదే నీకు నష్టం కలిగిస్తుంది అని వార్నింగ్ ఇస్తాడు శైలేంద్ర.
వసుధార శైలేంద్ర మాటల్ని కామెడీగా తీసుకుంటుంది. చాలా పెండింగ్ వర్క్ ఉంది వెళ్ళిపోమని, ఇద్దరినీ బలవంతంగా బయటికి పంపించేస్తుంది. ఇద్దరూ కూడా ఈ అవమానాన్ని తట్టుకో లేక పోతారు. రిషి కోసం ఎదురు చూస్తూ, హాల్లోనే పడుకుంటుంది వసుధార. భార్య నిద్రని చెడగొట్టడం ఇష్టం లేక, వసుధార ని తానే ఎత్తుకొని వచ్చి, మంచం మీద పడుకోబెడతాడు. బెడ్ షీట్ కప్పి, రూమ్ నుండి వెళ్ళబోతాడు. వసుధార నిద్ర లేస్తుంది. రిషి చేసిన సేవలను చూసి కంగారు పడుతుంది.
ఎలా వచ్చాను ఇక్కడికి అని అంటుంది. నేనే తీసుకొచ్చాను అని రిషి అంటాడు. భార్య కి భర్త సేవలు చేయడంలో, తప్పు లేదని రిషి చెప్తాడు. తన మీద ఒక్కసారి కోప్పడమని, కోపంలో కూడా చాలా అందంగా ఉంటావని వసుధారతో రిషి అంటాడు. భర్త మాటలకి వసుధార అలుగుతుంది. అలిగితే కూడా బాగున్నావని, వసుధారని ప్రశంసిస్తాడు. వసుధార, రిషి మాటల్లో ఉండగా, మహేంద్ర రూమ్ నుండి అరుపు వస్తుంది. తండ్రి కి ఏమైందో అని రిషి కంగారుగా వెళ్తాడు. బెడ్ మీద నుండి మహేంద్ర కింద పడి కనిపడతాడు. జగతిని గుర్తు చేసుకుని బాధపడతాడు మహేంద్ర. మహేంద్ర బాధ చూసి రిషి, వసుధార బాగా ఎమోషన్ అవుతారు. ఇక ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది.