వినోదం

Guppedantha Manasu October 14th Episode : ఎండీ సీట్ లో వసుధార.. శైలేంద్రకి ధరణి వార్నింగ్.. ఇకనైనా ఆపేయండంటూ..!

Guppedantha Manasu October 14th Episode : ఎవరూ ఊహించని విధంగా, వసుధారని ఎండి చేశాడు రిషి. కొత్త ఎండి గారిని అందరూ స్వాగతిస్తారని అనుకుంటున్నా.. నా భార్య అని మాత్రమే కాదు. ఈ సీటుకి అర్హురాలు అని కూర్చోబెట్టాను అని రిషి చెప్తాడు. జగతి మేడం దగ్గర, నేర్చుకుంది. ఎప్పుడు ఎలా ఉండాలో తనకి బాగా తెలుసు అని చెప్తాడు రిషి. ఫణీంద్ర ఆ సీట్లో వసుధార ఉంటే, నువ్వు ఉన్నట్టే కదా.. రిషి తనని వెనక ఉండి నడిపిస్తావు కదా అని అంటాడు. రిషి ఎంత సమర్ధుడో వసుధారా కూడా అంతే సమర్థురాలు. శైలేంద్ర గారు మీరు ఏమంటారు అని రిషి అంటాడు. శైలేంద్ర మొక్కుబడిగా ఓకే ఓకే అని చెప్తాడు.

దేవయాని మాత్రం వసుధార ఆడపిల్ల కదా.. ఆ ప్లేస్లో వసుధార కంటే, రిషి కానీ ఇంకెవరైనా కానీ ఉంటే బాగుంటుంది అని చెప్తుంది. మినిస్టర్ అయితే, ఇంతకుముందు కాలేజీ బాధ్యతలని తీసుకున్న జగతి కూడా లేడీ ఏ కదా అని చెప్తారు. పెద్దమ్మా ఇక ఆలోచించాల్సిన అవసరమే లేదు. నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ప్రస్తుతానికి నేను అండగా ఉంటానని చెప్పాను అని ఎండి సీట్ లో కూర్చో పెడతాడు రిషి. రిషి తీసుకున్న నిర్ణయానికి, వసుధార కూడా షాక్ అవుతుంది.

థాంక్యూ ఎండి (మై డార్లింగ్) గారు అని రిషి అంటే, థాంక్యూ ఎంహెచ్ (మై హార్ట్) అని ఇద్దరు మురిసిపోతూ ఉంటారు. ఎంహెచ్ అంటే ఏంటని మినిస్టర్ అడిగితే, మిషన్ ఎడ్యుకేషన్ హెడ్ అని చెప్తుంది. కంగ్రాట్స్ చెప్పేసి మినిస్టర్ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత, అందరూ వెళ్ళిపోతారు. ఎండి గారు మీరు పని చేసుకుంటే, నేను వెళ్తానన్న రిషితో, నన్ను మీరు మనస్ఫూర్తిగా ఇక్కడ కూర్చో పెట్టారా అని అడుగుతుంది. నువ్వు ఈ ప్లేస్ కి కరెక్ట్ అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అని రిషి వసూతో చెప్తాడు.

Guppedantha Manasu October 14th Episode

ఇదివరకు కూడా ఇలాగే సీట్లో కూర్చోబెట్టారు. చాలా ఇబ్బందులు వచ్చాయి. ఇక మీదట అలాంటి రోజు రాకూడదు అని వసు చెప్తుంది. లేదు వసుధార, ఇకమీదట ఈ రిషి ఆవేశాలకి లొంగడు. ఒకసారి ఆవేశపడడం వలనే, నాకు జీవితాన్ని ఇచ్చిన అమ్మని దూరం చేసుకున్నాను అని చెప్తాడు. మళ్లీ ఆవేశంతో, జీవితాన్ని పంచుకునే భార్యను దూరం చేసుకోలేను. ఏం చేసినా నాకోసం అని, నేను అర్థం చేసుకున్నాను. అమ్మ దూరం అవ్వడంతో, ఆవేశం ఎంత అనర్ధమో తెలిసింది అని రిషి అంటాడు.

మీ క్షేమం కోసం దాచిపెట్టడం వలన, ఇలా జరిగిందని వసు అంటుంది. ఇకమీదట మంచి, చెడు ఏవి కూడా దాచిపెట్టను అని వసుధార చెప్తుంది. ఒకవేళ దాచినా, అది నా కోసమే అనుకుంటాను. నాతో పాటుగా, అమ్మ ఆశీర్వాదం కూడా నీకు తోడుగా ఉంటుందని రిషీ చెప్తాడు. ఏం జరిగినా, మీ సమక్షంలో, మీ తోడుతోనే సాధ్యమవుతుందని వసుధారా రిషి తో చెప్తుంది. ఇప్పుడు నువ్వు నా భార్యవి. ఈ మంగళసూత్రం మెడలో నువ్వు వేసుకోలేదు. నేను కట్టాను. వేదమంత్రాల మధ్య రిషిదారల బంధం ఏర్పడిందని అంటాడు.

ఇంటికి వచ్చి, శైలేంద్ర కోట్ ని విసిరి కొడతాడు. వసుధార ఎండి అనే మాటని భరించలేకపోతుంటాడు. ధరణి వచ్చి, కాఫీ తీసుకురావాలా అని అడుగుతుంది. నేను అడిగానా అని, తనమీద మండిపడతాడు. ఎందుకు కోపంగా ఉన్నారని అడిగితే, ఇంకా మండిపడతాడు. నువ్వు తెలివి తక్కువ దద్దమ్మవి. నా బాధను నువ్వు తీర్చలేవు వెళ్ళిపో అని అరుస్తాడు. నాకు తెలివి లేదు అని అనుకుంటున్నారు. కానీ, మీ ప్రతి కదలిక నాకు తెలుసు అని ధరణి అంటుంది.

ఇకపై కుట్రలు ఆపేయండి అని కూడా చెప్తుంది. శైలేంద్ర మాత్రం నేను అనుకున్నది జరిగేదాకా, ఈ ప్రయత్నం ఆగదు అని చెప్తాడు. ఎందుకు ఇంత దిగజారి పోతున్నారు. ఇలాంటి సమయంలో చేయరానిదేమైనా చేస్తే, జరగరానిదేనా జరుగుతుందని భయం ఉంది అని ధరణి అంటుంది. శైలేంద్ర నిన్ను కొట్టడం కాదు చంపేయాలి అని చెప్తాడు. చంపడం మీకు కొత్త ఏం కాదు కదా..? మీరు చేసే నేరాలు-ఘోరాలు చూడలేకపోతున్నా ఇకనైనా సరే రిషి వాళ్ళకి, ఎలాంటి అపాయం తల పెట్టకండి అని చెప్తుంది.

రిషి వాళ్ళు నలుగురికి మంచి చేసేవారు. అలాంటి వారికి చెడు చేయాలని చూడకండి అని చెప్తుంది. నువ్వే కాదు. దేవుడు చెప్పిన వినను. ఏం చేయాలో అదే చేస్తాను. నేను చేస్తుంది యుద్ధం అని అంటాడు శైలేంద్ర. అది యుద్ధం కాదు మోసం, వెన్నుపోటు అని ధరిణి అంటుంది. మృగానికి మెంటల్ ఎక్కితే ఎలా ఉంటుందో తెలుసా..? ఎవరితో అయినా నిజం చెప్తే ఇంట్లో వాళ్లంతా నెత్తుటితో తడిసిపోతారు అని శైలేంద్ర అంటాడు. చిన్న అత్తయ్య వాళ్ళ మీద ప్రేమతో ఆగాను. లేకపోతే నిజం ఎప్పుడో బయట పెట్టే దాన్ని అని చెప్తుంది. నీ స్వార్థం కోసం ఆగిపోయావని, పసుపు కుంకాల కోసం ఆగిపోయావని అంటాడు శైలేంద్ర. జన్మలో వీళ్ళు మారరు. రిషి మనసు కుదుటపడిన తర్వాత, అన్ని నిజాలు చెప్తాను. వాళ్లని కాపాడాల్సిన బాధ్యత నాదే అని అంటుంది ధరణి.

Share
Sravya sree

Recent Posts

ఈ ఫుడ్ తింటే ఊపిరితిత్తులు నెల రోజుల్లో పూర్తి ఆరోగ్యంగా మారుతాయి..!

మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్య‌మైన‌వో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…

Monday, 23 September 2024, 5:22 PM

రోడ్డుపై కుక్క‌లు మిమ్మ‌ల్ని వెంబ‌డిస్తే ఆ స‌మ‌యంలో ఏం చేయాలి అంటే..?

ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మ‌రింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…

Saturday, 21 September 2024, 3:01 PM

క‌లెక్ష‌న్ల‌లో దుమ్ము రేపుతున్న స్త్రీ 2 మూవీ.. బాలీవుడ్ లో ఆల్‌టైమ్ హై రికార్డు..!

సాహో చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న కథానాయిక‌గా న‌టించి అల‌రించిన శ్ర‌ద్ధా క‌పూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో ప‌ల‌క‌రించింది. 2018లో…

Saturday, 21 September 2024, 5:47 AM

జానీ మాస్ట‌ర్ కేసులో అస‌లు ఏం జ‌రుగుతోంది..?

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో ప‌డ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మ‌హిళా…

Friday, 20 September 2024, 9:27 PM

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఇప్పుడు త‌న రిలేష‌న్ ఎలా ఉందో చెప్పిన ఆలీ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇటు రాజ‌కీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…

Friday, 20 September 2024, 9:42 AM

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM