Guppedantha Manasu October 10th Episode : జగతి దూరమైపోవడంతో, ఆ బాధలో మహేంద్ర మందు తాగుతూ ఉంటాడు. అతనిపై దేవయాని సీరియస్ అయిపోతుంది. కుటుంబం పరువు తీస్తున్నావ్, అని కోప్పడుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లోకి వెళ్తే… జగతి దూరమవ్వడంతో మహేంద్ర కోలుకోలేక పోతాడు. కాలేజీ బోర్డు మీటింగ్ నుండి, మధ్యలోనే వెళ్లిపోతాడు. రోడ్డుమీద తాగేసి పడిపోతాడు. మహేంద్ర ఇంటికి రాకపోవడంతో, రిషి బాగా కంగారు పడి వసుధార తో పాటుగా, తండ్రి కోసం వెతుకుతుంటాడు. చివరికి రోడ్డుమీద తండ్రిని చూసి షాక్ అయిపోతాడు.
మీరు తాగడం ఏంటని కూడా బాధపడతాడు. ప్రతిరోజు కూడా జగతి తన పక్కనే ఉండేదని.. ఇప్పుడు దూరం అయిపోయింది. ఫోటోలో చూడాల్సి వస్తోంది అని, కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. మహేంద్ర ని ఇంటికి రమ్మని రిషి, వసుధారా అడుగుతారు. జగతి లేని చోటుకి రానని, అక్కడ ఉండలేనని చెప్తాడు మహేంద్ర. ఆమె జ్ఞాపకాలు తనని వెంటాడుతున్నాయని చెప్తాడు. ఎంత బతిమిలాడినా వినిపించుకోడు. బలవంతంగా తండ్రిని కారులోకి రిషి ఎక్కించి తీసుకెళ్తాడు.
కొడుకు అమ్మ అని పిలవడంతో, జగతి మురిసిపోతుందని.. అలానే, నువ్వు కూడా అత్తయ్య అని పిలిస్తే, ఆనంద పడిందని వసుధారతో మహేంద్ర తనని ఒంటరి చేసి జగతి వెళ్ళిపోయిందని… కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఇంటికి వెళ్ళాక, అక్కడ ఉండలేనని బయటకు వెళ్ళిపోతానని… మహేంద్ర గొడవ చేస్తాడు. కానీ, వీళ్ళిద్దరూ సర్దు చెప్తారు. తమ్ముడు తాగడం చూసి, ఫణింద్ర కూడా షాక్ అయిపోతాడు. ఇంటికి వచ్చిన మహేంద్ర పై దేవయాని సీరియస్ అవుతుంది. కోప్పడుతుంది.
ఆ తరవాత, భార్య మీద ఫణీంద్ర సీరియస్ అవుతాడు. నా తమ్ముడు మందుకి బానిస కాదు. ఎందుకు ఈ రోజు తాగి వచ్చాడో, అర్థం చేసుకోలేవా..? ఇంతటితో ఆపేయమని చెప్తాడు. ఇంకొక మాట మాట్లాడితే, బాగుండదు. నీ బోడి సలహాలు అవసరం లేదని ఫైర్ అవుతాడు. మహేంద్ర ఫణీంద్ర ని ఇబ్బంది పెట్టినందుకు క్షమించమని, కాళ్ళ మీద పడతాడు. జగతి ఎక్కడ అని రిషి ని అడుగుతాడు మహేంద్ర. మేడం వస్తుందని రిషి చెప్తాడు. మేడం ఏంటి..? అలా ఎందుకు పిలుస్తున్నావ్..? అమ్మ అని కొడుకుని కోపగించుకుంటాడు మహేంద్ర.
తండ్రి కన్నీళ్లు చూసి బాధపడతాడు రిషి. పాలు తీసుకోమని తండ్రికి ఇస్తాడు. కానీ, మహేంద్ర తాను తాగాల్సింది పాలు కాదని, మందు బాటిల్ తీస్తాడు. ఎంత చెప్పినా వినడు. జగతి లేదనే బాధని మర్చిపోవాలంటే, మందు తాగడమే పరిష్కారం అని చెప్తాడు. రిషి ని కూడా తాగమని బలవంతం చేస్తాడు. మళ్లీ దేవయాని సీరియస్ అవుతుంది. రిషిని తాగమని కూడా అంటున్నావు..? ఇది నీకు కరెక్ట్ అనిపిస్తుందా అని అంటుంది.
భూషణ్ ఫ్యామిలీ అంటే, సొసైటీలో ఎంతో పేరు ఉంది. నువ్వు ఇలా తాగి, తిరిగితే పరువు పోతుందని అంటుంది. తాగుడు అలవాటు చేసుకుంటే, ఇల్లు, కాలేజీ ఏమైపోతుందని రిషితో చెప్తుంది దేవయాని. ఇకమీదట ఇలా జరగనివ్వద్దని, తన తండ్రితో చెప్తానని రిషి చెప్తాడు. వదిన గారు అని ఒక్కసారిగా మహేంద్ర పైకి లేస్తాడు. దాంతో దేవయాని భయపడి పోతుంది. చేతులు జోడించి దండం పెట్టి, అన్నీ పోగొట్టుకున్నాను. చివరికి నా బాధని పోగొట్టుకోవడానికి తెచ్చుకున్న బాటిల్ కూడా లాగేసుకుంటారా అని అంటాడు.
బాధలన్నిటికీ కారణం నేనే అన్నట్టు, అలా మాట్లాడతావ్ ఏంటి అనే దేవయాని తడబడుతుంది. అన్నీ మీరే చేశారు అని చెప్తాడు. నా మంచి కోసం ఆలోచిస్తున్నానని అంటున్నారు. నా బాధ మొత్తం పోగొట్టి, ఆ పుణ్యం మీరే కట్టుకోండి అని అంటాడు. మహేంద్ర జగతిని తిరిగి తెప్పించమని అంటాడు. లేదంటే, నన్నే జగతి దగ్గరికి పంపించమని అంటాడు. అప్పుడు మీరు, నేను హ్యాపీ అని చెప్తాడు. అలానే, జన్మజన్మలకి రుణపడి ఉంటాను అని, నన్ను చంపేయమని కూడా చెప్తాడు.
దేవయాని మాటల్ని ఆపకపోవడంతో, ఫణింద్ర సీరియస్ అవుతాడు. ఇప్పుడైనా నోరు మూసుకుంటావా…? ఇక్కడి నుండి వెళ్ళిపో అని సీరియస్ అవుతాడు. నేను మహేంద్ర ను బాగు చేద్దామని అనుకుంటే, అందరూ నన్ను తప్పు పడతారేంటంటూ, అక్కడి నుండి దేవయాని వెళ్ళిపోతుంది. జగతి చనిపోయిందని బాధపడి, పనులు, బాధ్యతలు వదిలేస్తే ఎన్నో కష్టాలు పడాలి. మనల్ని నమ్ముకున్న స్టూడెంట్స్, ఎంప్లాయిస్ జీవితాలు ఎటు కాకుండా పోతాయని రిషితో అంటాడు ఫణింద్ర.
ఈ కష్టాలు తొలగిపోవాలంటే, ఎండి సీట్ లో కూర్చోమని రిషి తో అంటాడు. కానీ, రిషి అందుకు ఒప్పుకోడు. ఎవరో కాలేజీని టార్గెట్ చేశారని, వాళ్లకు కుట్రకి జగతి బలైపోయింది. అది ఎవరో తెలుసుకోవాలంటే, నువ్వు కాలేజీకి రావాలని బతిమిలాడతాడు. కాలేజీకి నేను ఎందుకు రావట్లేదో మీకు తెలుసు. నా మీద ఒత్తిడి తీసుకురావద్దు అని రిషి చెప్తాడు. ఆ కారణం గురించి ఆలోచించక్కర్లేదని వసుధార అంటుంది. ఫణింద్ర గారు మినిస్టర్ తో పాటు ఎస్ఐ ని కలిసి సమస్యని పరిష్కరించమని చెప్తుంది. అక్కడితో ఈరోజు సీరియల్ ముగిస్తుంది.