Guppedantha Manasu November 7th Episode : రిషి, వసుధారని విష్ కాలేజ్ ప్రిన్సిపల్ ఆహ్వానిస్తాడు. కాలేజీ అభ్యున్నతికి పాటుపడిన ఇద్దరినీ కూడా, సన్మానించాలని అనుకుంటాడు. ఆ సన్మాన వేడుకని నిర్వహించే బాధ్యతని, పాండియన్ చేపడతాడు. రిషి ప్రిన్సిపల్ రిక్వెస్ట్ ని అంగీకరిస్తాడు. వసుధారా, రిషి కాలేజీ కి వెళ్లడానికి రెడీ అవుతారు. మహేంద్రని రమ్మని అంటారు రిషి, వసుధార. ఎంత బతిమిలాడినా, మహేంద్ర వెళ్లడానికి ఒప్పుకోడు. తను తాగుతానని భయంతోనే విష్ కాలేజ్ కి రమ్మని అడుగుతున్నారు కదా అని రిషి ని అడుగుతాడు మహేంద్ర.
మీ మాటలు వెనక అనుమానంతో పాటు ప్రేమ, భయం కూడా ఉన్నాయని తెలుసు నాకు అని అంటాడు. కాలేజీ నుండి మీరు తిరిగి వచ్చేవరకు, తాగనని మహేంద్ర మాట ఇస్తాడు. మేము విష్ కాలేజ్ కి వెళ్తున్నాం. కాబట్టి, మీరు డిబిఎస్టి కాలేజీకి వెళ్లగలరానని వసుధార అడుగుతుంది. వెళ్ళనని, అక్కడికి వెళితే జగతి జ్ఞాపకాలు గుర్తొస్తాయని, అవన్నీ చూస్తూ అక్కడే ఉండలేను అని చెప్తాడు మహేంద్ర. తండ్రిని బలవంతం పెట్టద్దని వసుధార తో రిషి అంటాడు. కాలేజీకి వెళ్లడానికి ముందే, జగతిని షూట్ చేసిన ప్లేస్ కి వెళ్దామని చెప్తాడు.
రిషి వసు ఇద్దరు ఆ ప్లేస్ కి చేరుకోవడానికి ముందు ముకుల్, పాండియన్ అక్కడికి వస్తారు. జగతిని ఎలా షూట్ చేశారో ముకుల్ కి, పాండియన్ చెప్తాడు. తర్వాత రిషి, వసుధార అక్కడికి వస్తారు. జగతి చనిపోయిన రోజు తానే అమ్మని ఇక్కడికి రమ్మన్నానని, మేము మాట్లాడుకుంటుండగా వసుధార వచ్చిందని, ఇక్కడ ఉండడం ప్రమాదకరం అని హెచ్చరించిందని, ముకుల్ కి చెప్తాడు రిషి. ఆ టైంలోనే తనని షూట్ చేయడానికి ఎవరో ట్రై చేశారని, కానీ బుల్లెట్ తనకి తగలకుండా అమ్మ అడ్డుగా నిలబడడంతో, ఆమె ప్రాణాలు పోయాయని చెప్తాడు.
ముకుల్ ఇన్వెస్టిగేషన్ తెలుసుకోవడానికి అతని అసిస్టెంట్ కి డబ్బు ఇస్తాడు శైలేంద్ర. ఇన్వెస్టిగేషన్ వివరాలను ఎప్పటికప్పుడు చెప్పాలని చెప్తాడు. ముకుల్ ప్రతి కదలికని గమనించి, నాకు చెప్పాలని అంటాడు. జగతిని చంపిన కేసుకు సంబంధించి, ప్రతీ క్లూ ని మట్టిలో కలిపేసానని, పట్టుకోవడం సాధ్యం కాదని శైలేంద్ర అనుకుంటాడు. ఈరోజు కాకపోయినా రేపైనా ఆ క్రిమినల్ దొరుకుతాడు. ఏదో ఒక తప్పు చేస్తాడు అని ముకుల్ రిషితో అంటాడు.

రిషి వసు కి విష్ కాలేజ్ స్టాఫ్ స్టూడెంట్స్ గ్రాండ్ గా వెల్కమ్ చెప్తారు. ఇద్దరూ కూడా మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారని పొగుడుతారు. ఒకే పూలదండని వేస్తారు. అక్కడికి ఏంజెల్ వస్తుంది. రిషి వసుధారాలని జంటగా చూసి షాక్ అవుతుంది. తనకి చేసిన మోసాన్ని తట్టుకోలేక పోతుంది. అక్కడే నిలదీస్తుంది. కానీ విశ్వనాథం ఆమెని వారిస్తాడు. రిషి దగ్గరికి వచ్చిన ఏంజెల్ థాంక్స్ నీ భార్యని చూపించినందుకు అని వ్యంగ్యంగా అంటుంది. ప్రిన్సిపల్ తో పాటు స్టాఫ్ వెళ్ళిపోయాక రిషి వసుధరాలని విశ్వనాథం వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేస్తాడు.
వెయిట్ చేస్తూ ఉంటానని, వారితో కోపంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఏంజెల్. విశ్వనాథం ఇంటికి అనుపమ వస్తుంది. ఇల్లు గురించి మొత్తం తెలిసిన దానిలా మేడ మీదకి వెళ్ళిపోతుంది. విశ్వనాథం ఇంట్లో లేరని పనిమనిషి చెప్పినా కూడా, అనుపమ అసలు పట్టించుకోదు. ఇంట్లో తన రూమ్ కీస్ ఎక్కడ ఉన్నాయో నాకు తెలుసు అని పనిమనిషికి సమాధానం చెప్తుంది. ఏంటి ఇంత స్వతంత్రంగా ఆమె వెళ్తోంది అని పనిమనిషి ఆలోచిస్తుంది. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.