Guppedantha Manasu November 6th Episode : భర్త కూల్ అవ్వడంతో, వసుధార సంతోషపడుతుంది. ఈ జర్నీ ఆగిపోకూడదని, మన జీవిత ప్రయాణం ఎప్పటికీ, ఇలాగే ఆనందంగా ఉండాలని ఆమె అనుకోవడం అత్యాశే. గమ్యం చేరిన తర్వాత, ఎవరి ప్రయాణమైనా ఆగిపోతుంది. అందుకు మనం అతిథులం కాదు అని ఫిలసాఫికల్ గా రిషి చెప్తాడు. చివరి వరకు నా ప్రయాణం మీతోనే సాగాలి. ఆ ఉద్దేశంతో ఆ మాట అన్నానని వసుధార అంటుంది. స్టూడెంట్స్ కి రిషి క్లాస్ తీసుకుంటాడు. స్టూడెంట్స్ అందరూ పొగడ్తలతో ముంచేస్తారు. ఇకనుండి కాలేజీ కి అన్ని మంచి రోజులే వచ్చాయని పొగుడ్తారు. సీనియర్ లెక్చరర్స్ కూడా వచ్చి, స్టూడెంట్స్ కే క్లాస్ చెప్తారు.
వసుధార దగ్గరికి కాలేజీ లెక్చరర్లు వచ్చి. తమని కాలేజీ నుండి అన్యాయంగా తీసేసారని మీరు తీసుకున్న నిర్ణయం సరైనది కాదు అని అంటారు. తమ స్థానంలో కొత్త లెక్చరర్స్ ఎలా తీసుకుంటారు అని కోప్పడతారు. జీతాలు పెంచదాక కాలేజీకి రానని మీరే అన్నారు కదా. పాఠాలు ఆగిపోతాయి అందుకని కొత్త వాళ్ళని తీసుకున్నామని చెప్తుంది. తమను ఉద్యోగం నుండి తీసివేసినందుకు, యూనియన్ లో కంప్లైంట్ ఇస్తామని కాలేజీ ముందు స్ట్రైక్ చేస్తామని బెదిరిస్తారు లెక్చరర్స్. అప్పుడే రిషి వస్తాడు. మీ దగ్గర తప్పు పెట్టుకుని కాలేజీ యజమానిని ఎలా తప్పు పడతారని వార్నింగ్ ఇస్తాడు.
మీరు అర్దాంతరంగా కాలేజ్ నుండి తప్పుకుంటే అడిగినంత జీతాలని ఎలా ఇస్తారు అని క్వశ్చన్ చేస్తాడు. కొందరు అవసరం కోసం పని చేస్తారు. కొంతమంది ఆశయం కోసం పని చేస్తారు. మొదటి కేటగిరీకి చెందిన వాళ్ళు మీరు అని ఫైర్ అవుతాడు. మీరు ఏ యూనియన్ లో కంప్లైంట్ ఇచ్చిన ప్రాబ్లం ఉండదని లెక్చరర్స్ తో చెప్తాడు రిషి. అతని మాటలతో లెక్చరర్స్ భయపడి పోతారు. మళ్ళీ కాలేజీలో చేరిపోతామని రిక్వెస్ట్ చేస్తారు. ఇప్పుడు జీతాలు పెంచే ప్రసక్తే లేదు. ఏ రోజు పెంచాలి అనుకుంటే ఆ రోజు పెంచుతామని అప్పుడు ఇది మీకు ఓకే అయితే చేరమని అంటాడు.
లెక్చరర్స్ ఒప్పుకుంటారు. రిషి తీసుకున్న నిర్ణయంలో మార్పు చేస్తే మంచిదని వసుధారతో అంటారు లెక్చరర్స్. రిషి మాటే నా మాటని వసు కూడా అంటుంది. అప్పటికి ఇప్పటికీ రిషి కాలేజీకి ఎండి అని అంటుంది. శైలేంద్ర మాటలు విని స్ట్రైక్ చేస్తామని ప్లాన్ చేస్తున్న లెక్చరర్స్ కి రిషి వసుధార గట్టి షాక్ ఇస్తారు. మీ వల్ల సమస్య సాల్వ్ అయిందని రిషి పై ఆమె ప్రశంసలని కురిపిస్తుంది. నేను కాదు నువ్వు గ్రేట్ అని వసుధారపైనే రిషి పొగుడుతాడు.
నువ్వు కూర్చున్న సీట్ పదవి కాదు ప్రాణగండం అని అంటాడు. ఆ సీట్లో నేను ఉన్నాను కాబట్టి నాపై హత్య ప్రయత్నం జరిగాయి. జగతి ఎండి సీట్ చేపట్టినందుకు ఆమె ప్రాణాలను తీశారు. అవన్నీ తెలిసి కూడా నువ్వు అక్కడ కూర్చున్నావు అని మెచ్చుకుంటాడు. నీ గౌరవాన్ని, ఆశయాన్ని నిలబెట్టడం నా బాధ్యత అని అంటాడు. ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ అని కాకుండా ఇద్దరం కలిసే ముందుకు సాగుదాం అని చెప్తాడు. నువ్వు నేను వేరు కాదు. మనిద్దరం ఒకటేనని చెప్తాడు. శైలేంద్ర ప్లాన్ రివర్స్ అవడంతో తట్టుకోలేక పోతాడు. తన బాధను తల్లికి చెప్పుకుంటాడు. రిషి చాలా డేంజర్ అని అంటాడు ఇలాంటి చిన్న ప్లాన్స్ తో రిషి ని ఏం చేయలేమని, కొడుకుతో దేవయాని అంటుంది.
రిషి చాలా మంచివాడని, అదే మంచితనంతో దెబ్బ కొట్టాలని చెప్తుంది. కుట్రలు కుతంత్రాలతో రిషిని ఏం చేయలేమాని శైలేంద్రకు క్లాస్ ఇస్తుంది. ఆవేశంతో ఏదైనా చేస్తే ప్రమాదమని అంటుంది. రిషి వసుధార ని విష్ కాలేజీ ప్రిన్సిపల్ తన కాలేజీకి ఇన్వైట్ చేయాలని అనుకుంటాడు. సన్మానించాలని అనుకుంటారు. పాండ్యా అండ్ బ్యాచ్ కి ప్రిన్సిపల్ బాధ్యతలు అప్పగిస్తారు. ఇదివరకు రిషి సార్ లాగ ఉండట్లేదని ఇదివరకు స్టైల్ లుక్కుతో ప్రత్యక్షణం డిస్టర్బ్ చేసేవాడని వసుధార అంటుంది. ప్రతి సెకండ్ తాను మీ ఊహల్లోనే ఉండదానని అంటుంది.
మీకోసం నా మనసు ఎప్పుడు పరితపించి పోయేదాన్ని అంటుంది. ఎక్కడ ఉన్నా మీ పక్కనే ఉన్నట్లు అనిపించేదని చెప్తోంది. అంత డిస్టర్బ్ చేసినందుకు నేను ఫస్ట్ టైం ఐ లవ్ యు చెప్తే నువ్వు నో చెప్పావు అని అడుగుతాడు. అవన్నీ గుర్తు చెయ్యడని రిషి తో అంటుంది. తర్వాత వసుధార కి రిషి ముద్దు పెట్టబోతాడు కానీ అప్పుడే విష్ కాలేజీ ప్రిన్సిపల్ ఫోన్ చేస్తాడు. ఒక రోజు మా కాలేజీకి రావాలని రిక్వెస్ట్ చేస్తాడు. ప్రిన్సిపల్ చాలా బతిమిలాడటంతో రిషి వసుధార విష్ కాలేజీకి వెళ్లడానికి అంగీకరిస్తారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…