వినోదం

Guppedantha Manasu November 4th Episode : అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన రిషి.. మళ్లీ ధరణి ఇరికించేసింది.. మహేంద్ర కోసం అనుపమ రాబోతోందా..?

Guppedantha Manasu November 4th Episode : శైలేంద్ర మీద పంచులు వేస్తుంది ధరణి. ఈ పరిస్థితి వస్తుందని తెలిసే, తలనొప్పి టాబ్లెట్లు తీసుకువచ్చాను అని వస్తుంది. మాట్లాడకుండా చూడమని మావయ్య గారు చెప్పారు. కానీ, అలా జరగట్లేదు కాబట్టి, కొంచెం మాట్లాడుకోండి అని చెప్పి ధరణి వెళ్ళిపోతుంది. ఏంటి మమ్మీ దీనికి భయం లేకుండా పోతోంది అని శైలేంద్ర అంటాడు. దేవయాని పలకదు. మమ్మీ అని గట్టిగా పిలిస్తే, అప్పుడు దేవయాని చూస్తుంది. ఆ కొత్త ఆఫీసర్ ముకుల్ కళ్ళు డేగ కళ్ళులా ఉన్నాయి. వట్టిగానే మనుషుల్ని పసికట్టేలా ఉన్నాడు.

రిషికి మన గురించి తెలిసిందా..? ఒకవేళ తెలిస్తే, అని దేవయాని అంటే, అతనికి తెలిసే ఛాన్స్ లేదు మమ్మీ అని అంటాడు. అతనిని నేను చూసుకుంటాను భయపడకు అని శైలేంద్ర అంటాడు. నేను భయపడేది ముకుల్ కి కాదు రిషికి. పెద్దమ్మ అని కూడా చూడడు, నిజం తెలిస్తే మనల్ని చంపేస్తాడు అని దేవయాని భయపడుతుంది. ముకుల్ బ్యాక్ గ్రౌండ్ ఏంటి వంటి విషయాలు నేను తెలుసుకుంటాను అని శైలేంద్ర అంటాడు. మరో వైపు పెద్దమ్మ ఇంటికి వెళ్లావుగా ఏమైంది అని అడుగుతాడు మహేంద్ర.

పర్సనల్స్ మాట్లాడడానికి వెళ్లలేదు. అమ్మ కేసు విషయం గురించి, స్పెషల్ ఆఫీసర్ ముకుల్ కి పరిచయం చేద్దామని, కేసు గురించి సపోర్ట్ చేయాల్సిందని చెప్పి వచ్చాను. ముకుల్ ఎవరో కాదు అమ్మ స్టూడెంట్ అని చెప్తాడు రిషి ముకుల్ ని మీరు కూడా, ఒకసారి కలవండి అంటాడు. టీ కి పిలుస్తాను అని రిషి అంటే, ఓకే నాకు తెలిసినవి కూడా చెప్తాను అని మహేంద్ర అంటాడు. ముకుల్ కచ్చితంగా అమ్మని హత్య చేసిన వాళ్ళని పట్టుకుంటాడని చెప్తాడు. వాడు ఎవడైనా, ఎంతటి వాడైనా వదిలిపెట్టను. మీ ముందే శిక్షిస్తాను అని రిషి చెప్తాడు.

ఈ విధంగా అయినా సర్ ముందడుగు వేశారు మావయ్య. ఈసారి వాళ్ళ బండారం బయటపడుతుంది అని వసుధార అంటుంది. రిషి వేసే ప్రతి అడుగు, వాళ్ళ పతనానికి దారితీస్తుంది అంటాడు మహేంద్ర. మహేంద్ర కాల్ కోసం అనుపమ ట్రై చేస్తుంది. జగతి గురించి నువ్వు తప్ప ఇంకెవరు చెబుతారు, పేర్లు రాసుకున్నచోట ఒక్కడే వచ్చాడంటే ఒంటరిగా ఉన్నారని తెలుస్తోంది అని అనుపమ అనుకుంటుంది. ఈలోగా పెద్దమ్మ వస్తుంది ఏ నిర్ణయం తీసుకున్నావు అని అడుగుతుంది. నా సంతోషం వెతుక్కుంటూ వెళ్తాను మహేంద్రని కలుస్తాను. కొత్త జీవితాన్ని మొదలు పెడతాను అని అనుపమంటుంది.

Guppedantha Manasu November 4th Episode

అనుపమ అలా చెప్పడంతో పెద్దగా సంతోషిస్తుంది. మన తప్పులకి తల్లిదండ్రులు ని నిందించకూడదు. అయినా వాళ్ళ విషయంలో కఠినంగా ఉండకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కన్న బంధాన్ని దూరం చేసుకోకు, వాళ్ళని కూడా కలువు అని చెప్తుంది. అలానే అని అనుపమ హగ్ చేసుకుంటుంది. ఇంకో వైపు చూస్తే వసుధార సార్ రెడీనా అని అడుగుతుంది. ఐదు నిమిషాలు అని గది లోపల ఉన్న రిషి అంటాడు. రిషి ఎంతకీ రాకపోవడంతో, డోర్ కి పేపర్ అంటించి వెళ్ళిపోతుంది.

రిషి బయటికి వచ్చేసరికి వసుండదు వెయిటింగ్ ఆల్వేస్ ఫర్ యు అని రాసి ఉన్న పేపర్ చదువుతాడు. వసుధారా కి మెసేజ్ పెడతాడు. ఇద్దరూ సరదాగా వాదించుకుంటారు. హాల్లో కూర్చుని ముకుల్ గురించి దేవయాని, శైలేద్రా ఆలోచించుకుంటూ ఉంటారు. ఇందులో వచ్చిన ఫణింద్ర లేటుగా ఎందుకు పడుకుంటున్నావు అని అడుగుతాడు దేవయానిని. ఆయన కూడా లేటుగా పడుకున్నాడని ధరణి అంటుంది. మళ్లీ ఇరికించిందని మనసులో శైలేంద్ర అనుకుంటాడు.

అసలు రిషి వస్తే ఏమో అనుకున్నాను. కానీ ఆఫీసర్ వస్తారని అనుకోలేదు. మహేంద్ర అలా తాగడం వల్ల, ఇలా జరిగిందని దేవయాని అంటుంది. నువ్వు వాళ్ళని ఎప్పటికీ అర్థం చేసుకోలేవు. ఇలాంటివి చేస్తే, నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. ధరణి పిలిచి థాంక్స్ అని అంటుంది. నువ్వు ఎందుకు థాంక్స్ చెప్పావో అర్థమైంది. ఇంట్లో నీ పరిస్థితి నా పరిస్థితి ఒకటే. మనం మారనంతవరకు పరిస్థితి మారదు అని అంటాడు. వీళ్లు మాట్లాడుకోకుండా ఉంటే నాకు మనశ్శాంతిగా ఉంటుందని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ధరణి కూడా వెళ్ళిపోతుంది.

మమ్మీ నువ్వు టెన్షన్ లో ఏదేదో మాట్లాడుతున్నావు అని ఫైర్ అవుతాడు. ఇలానే చేస్తే డాడ్ కూడా, వాళ్ళ దగ్గరికి వెళ్లిపోతాడు. ఇంకోవైపు సార్ నిజంగానే ఫీల్ అయినట్టున్నారు వెయిటింగ్ ఫర్ యు అని రాసినందుకు బాధపడుతున్నారేమో.. సార్ కి సెల్ప్ రెస్పెక్ట్ ఎక్కువ. ఇలా వచ్చేయడం కరెక్ట్ కాదని వెనక్కి వెళ్తుంది వసుధారా. ఇంతలో రిషి వస్తాడు. మీటింగ్ ఉందని త్వరగా వచ్చేసాను మళ్ళీ వచ్చేయడం కరెక్ట్ కాదని వెనక్కి రావాలని అనుకున్నాను అని వసుధార అంటుంది. ఇలానే ఉంటే ఇంకా లేటవుతుంది పదా అని రిషి అంటాడు. ఇద్దరు కారులో కూర్చుంటారు. అక్కడితో ఈ రోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.

Share
Sravya sree

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM