Guppedantha Manasu November 28th Episode : రిషి ఎంట్రీ ఇచ్చేసరికి, వాసన్ భయపడి పారిపోవడానికి ట్రై చేస్తాడు. కానీ, రిషి అతన్ని పట్టుకొని బంధిస్తాడు. తర్వాత రోజు చిత్ర కనపడలేదని, ఆమె తల్లిదండ్రులు కాలేజీకి వచ్చి గొడవ చేస్తారు. కిడ్నాప్ చేశారని ఆరోపిస్తారు. చిత్ర తన దగ్గరే ఉందని రిషి అంటాడు. చిత్ర ని తీసుకొని మహేంద్ర వస్తాడు. చిత్ర సూసైడ్ అటెంప్ట్ చేయడానికి వసుధారనే కారణమా అని చిత్ర ని ఎస్సే అడుగుతారు. సాక్ష్యంగా తమకి దొరికిన లెటర్ ని చూపిస్తారు ఆ సంతకం తనదేనని కానీ సూసైడ్ చేసుకోలేదు అని పోలీసులకి చిత్ర చెప్తుంది. ఆ లెటర్ కూడా రాయలేదని చెప్తుంది.
నువ్వు వాసన్ ప్రేమించుకుంటున్నారని తెలిసే వసుధార మిమ్మల్ని బెదిరించిందని, అతను లేనిదే బతకలేనని, నువ్వు ఆత్మహత్యకి ప్రయత్నించావు కదా అని చిత్ర తల్లి ఆమెకి సర్ది చెప్పబోతుంది. మా అమ్మ నాన్నలు అబద్ధం చెబుతున్నారని, చిత్ర చెప్తుంది. ఎస్ఐ కన్ఫ్యూజ్ అవుతాడు. వసుధార తనకి ఎలాంటి వార్నింగ్ ఇవ్వలేదని, తాను సమస్యల్లో ఉన్నానని తెలిసి సేవ్ చేయడానికి మా ఇంటికి వచ్చిందని, వాసన్ నన్ను ఇబ్బంది పెడుతుంటే, వసుధార మేడం సర్ది చెప్పబోయరని చిత్ర చెప్తుంది.
ఉన్నట్టుండి నా నోట్లో నుండి నురగలు వచ్చాయి. కళ్ళు తిరిగి పడిపోయాను. సూసైడ్ అటెంప్ట్ చేయలేదు అని చిత్ర చెప్తుంది. నేను కాదు, వాళ్ళు అబద్ధం చెప్తున్నారు అని తల్లిదండ్రులని చూపిస్తుంది. తల్లిదండ్రులకి అబద్ధం ఆడాల్సిన అవసరం ఏముంది అని పోలీసు అడుగుతాడు. వాళ్లు నా తల్లిదండ్రులు కాదు. బాబాయ్, పిన్ని అని, చిన్నతనం నుండి తనను ఎన్నో కష్టాలు పెట్టారని, ఈసారి ప్రాణాలు తీయాలని చూస్తున్నారని, చిత్ర ఏడుస్తుంది. చిత్రని బెదిరించి, ఆమెతో రిషి, వసుధారా అబద్ధాలు చెప్పిస్తున్నారని. చిత్ర తల్లి అంటుంది.
అసలు ఈ కేసులో వసుధారా కి ఎలాంటి సంబంధం లేదని నిరూపిస్తానని రిషి అంటాడు. వాసన్ ని తీసుకొస్తాడు రిషి. నిన్న రాత్రి చిత్ర ని చంపాలని ఎందుకు హాస్పిటల్ కి వచ్చావని అడుగుతాడు రిషి. చిత్ర ని చంపాలనుకునేది నిజమేనని వాసన్ ఒప్పుకుంటాడు. వాసన్ ని కిడ్నాప్ చేసి, అతనితో రిషి అబద్దం చెప్పిస్తున్నాడని, చిత్ర తల్లి పోలీసులతో చెప్తుంది. చిత్ర ని చంపడానికి వాసన్ తన గ్యాంగ్ తో కలిసి హాస్పిటల్ కి వచ్చిన సీసీటీవీ ఫుటేజ్ ని ఆమెకి చూపిస్తాడు రిషి.
ఎస్ఐ గట్టిగా నీ వెనక ఉన్నది ఎవరు అని అడిగేసరికి నిజం చెప్తాడు వాసన్. ఓ వ్యక్తి తమ దగ్గరికి వచ్చి, అడిగినంత డబ్బు ఇస్తానని చెప్పాడని, వసుధారను ఇక్కడికి రప్పించి ఆమెని సమస్యలులో ఇరికించమని చెప్పాడు అని చెప్తారు. ఈ నాటకంలో, మీ కూతురు చిత్ర చనిపోతుందని ఆ వ్యక్తి ఆమె తల్లిదండ్రులకి చెప్తాడు. చిత్ర కంటే డబ్బు మాకు ముఖ్యమని తల్లిదండ్రులు చెప్పారని వాసన్ అంటాడు.
వీడియో కాల్ ద్వారా ఈ గొడవను చూస్తున్న దేవయాని టెన్షన్ పడుతుంది. సైలేంద్ర పేరుని ఎక్కడ చెప్పేస్తాడో అని కంగారు పడుతుంది. రిషి బెదిరించడంతో వాసన్ ఎమ్మెస్సార్ పేరు చెప్తాడు. దేవయాని టెన్షన్ నుండి రిలీఫ్ అవుతుంది. చిత్ర ని చదివిస్తామని రిషి, వసుధారా మాట ఇస్తారు. ఇకనుండి నీకు అండగా మేము ఉంటామని అంటారు. మీ బాధ్యత అంతా మాదే అని అంటారు. శైలేంద్ర కి దేవయాని ఫోన్ చేసి ప్లాన్ ఫెయిల్ అయిన విషయం చెప్పాలనుకుంటుంది కానీ అతను ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది.