Guppedantha Manasu November 24th Episode : శైలేంద్ర, దేవయాని కలిసి చేస్తున్న కుట్రలకి ఫణింద్ర చెక్ పెట్టేస్తాడు. శైలేంద్ర, ధరణిని కొన్నాళ్లు ట్రిప్ కి పంపించాలని, దేవయానితో చెప్తాడు. తనకే తెలియకుండా, తండ్రి ఫిక్స్ చేసిన సర్ప్రైజ్ టూర్ ప్లాన్ విని ఆశ్చర్యపోతాడు శైలేంద్ర, తండ్రికి ఎదురు చెప్పలేక టూర్ కి వెళ్లడానికి ఒప్పుకుంటాడు. మార్పు రావడం సంతోషమని, నీకు ధరణికి మధ్య ఉన్న ప్రేమ ఇంకా బలపడుతుందని కొడుకుతో చెప్తాడు. కాలేజీలో చిత్రకు ఏదైనా సమస్యను రిషి వసుధార పరిష్కరించడానికి చూస్తారు. ఆమె లవర్ చెప్పిన మాటలు, తమ జీవితాలకి దగ్గరగా ఉండడంతో, నిద్రపోకుండా వాటి గురించే వసుధార ఆలోచిస్తుంది.
వసుధార దగ్గరికి రిషి వస్తాడు. ఏం ఆలోచిస్తున్నావు అని అంటాడు, చిత్ర గురించేనని చెప్తుంది వసుధార. ప్రేమించిన వాళ్ళు దూరమైతే, ఆ బాధ చాలా కష్టంగా ఉంటుంది. ఈ రోజు ఇష్టపడిన వాళ్ళు, రేపు కాదని అనవచ్చు అలా అని, ఎదుటి వాళ్ళ అభిప్రాయాలని మనం కాదనకూడదని, వసుధారతో అంటాడు రిషి. రిషి ప్రపోజ్ ని తాను, రిజెక్ట్ చేసినప్పుడు రిషి కూడా చాలా బాధపడి ఉంటాడని వసుధార అనుకుంటుంది. ఆ విషయమే రిషి ని అడుగుతుంది. అప్పుడు తాను కూడా, చాలా బాధపడినట్లు చెప్తాడు.
నువ్వు నాకు ప్రపోజ్ చేసినప్పుడు, అది కలో, నిజమో అనే భ్రమలో ఉండిపోయాను. నా జీవితంలో అందమైన క్షణాలవని గుర్తు చేసుకుంటాడు రిషి. ప్రపోజల్ ని రిజెక్ట్ చేసిన సంగతి మనసులో పెట్టుకొని నా ప్రేమని ఎక్కడ రిజెక్ట్ చేస్తారో అని, ప్రపోజ్ చేసిన టైంలో భయపడ్డాను అని రిషితో చెప్తుంది వసుధార. నిద్రపోవడానికి వసుధార రెడీ అవుతుంది. ఆ టైం లో చిత్ర నుండి వసుధార కి మెసేజ్ వస్తుంది.
చిత్రకి ఫోన్ చేస్తుంది. వసుధార రిషికి చెప్పకుండా, తానే వెళ్లి చిత్ర ని సేవ్ చేయాలని అనుకుంటుంది. ఆ తర్వాత టిఫిన్ చేసే టైం లో రాత్రి ఎక్కడికి వెళ్ళావ్ అని వసుధారని అడుగుతాడు రిషి. కానీ, వసుధార చెప్పదు. రిషికి అప్పుడే ఎస్ఐ ఫోన్ చేస్తాడు. చిత్ర సూసైడ్ అటెంప్ట్ చేసిందని, చావు బతుకుల మధ్య ఉందని చెప్తాడు. చిత్ర ని చూడటానికి హాస్పిటల్ కి వెళ్తారు రిషి వసుధార. వాళ్లని చిత్ర లవర్ ఆపేస్తాడు. మీ వల్లే నా చిత్ర ఇలా చేసుకుంది అని, మీరు ఎందుకు వచ్చారు వెళ్ళిపొమ్మని అంటాడు.
అతని మీద రిషి, వసుధార మండిపడుతుంది. ఖర్చు గురించి చూడకుండా ఆమెని బతికించమని రిషి డాక్టర్లతో చెప్తాడు. వసుధార బెదిరించడం వలన సూసైడ్ అటెంప్ట్ చేసిందని లవర్ ఆరోపిస్తాడు. అతనికి రిషి వార్నింగ్ ఇస్తాడు. చిత్ర సూసైడ్ అటెంప్ట్ చేయడానికి వసుధార కారణమని కంప్లైంట్ వచ్చిందని ఎస్సై చెప్తాడు. కంప్లైంట్ ఎవరు ఇచ్చారు.
ఏ ఆధారాలతో ఆమెని అరెస్ట్ చేస్తున్నారని ఎస్సైని రిషి అడిగితే, ఆధారాలు ఉన్నాయని చిత్ర సూసైడ్ అటెంప్ట్ చేయడానికి ముందు రాసుకున్న సూసైడ్ నోట్ దొరికిందని రిషి చూపిస్తాడు. చిత్ర లవర్ తో వసుధార మాట్లాడిన వీడియోని కూడా రిషికి చూపిస్తాడు. వసుధార బెదిరించడం వల్లే చిత్ర ఇలా చేసుకుందని, చిత్ర తల్లిదండ్రులు కూడా అంటారు. వాళ్ళ మాటలతో వసుధార షాక్ అయిపోతుంది.