Guppedantha Manasu November 20th Epsiode : జగతి గురించి అనుపమ ఎంక్వయిరీ మొదలు పెట్టింది. శైలేంద్ర చెప్పిన మాటలు విని దేవయాని కంగారుపడుతుంది. జగతి మర్డర్ వెనుక వాళ్ళు ఉన్నామని నిజం అనుపమకి తెలియకుండా ఆమెని డైవర్ట్ చేయాలని అనుకుంటూ ఉంటుంది. రిషి ని రౌడీలు కాల్చబోతుంటే జగతి అడ్డుగా వెళ్లి ప్రాణం తీసుకుందని అనుపమతో దేవయాని చెప్తుంది. ఎండి సీట్ గురించి వసుధార, జగతి మధ్య గొడవలు జరిగాయని వాళ్ళకి సర్ది చెప్పలేక రిషి నలిగిపోయాడని శైలేంద్ర కూడా అబద్ధం చెప్తాడు.
ఎండి సీట్ పై నీకు ఆశ లేదా అని శైలేంద్ర ని అనుపమడుగుతుంది. ఆమె ప్రశ్నకి శైలేంద్ర కంగారు పడతాడు ఎండి సీటు వల్లే జగతికి కష్టాలు మొదలయ్యాయని దేవయాని చెప్తుంది. రిషి, వసుధర వల్లే జగతి చనిపోయిందని, అనుపమని నమ్మించే ప్రయత్నం చేస్తారు శైలేంద్ర, దేవయాని వసుధారపై అనుపమకి అనుమానం కలిగేలా చేస్తే, పని సులువు అవుతుందని అనుకుంటారు. అనుపమ తో పాటుగా, వసుధారా అడ్డు కూడా తొలగిపోతుందని ఫిక్స్ అవుతారు.
జగతి చనిపోయిన వెంటనే వసుధార ఎండీ అయ్యిందని దేవయాని చెప్తుంది. కాలేజీలో స్టూడెంట్‌గా అడుగుపెట్టి ఇప్పుడు ఎండీగా ఎదిగిందని ఇలా ఈ పొజిషన్ లోకి రావడానికి ఎన్నో ఎత్తులు వేసిందని దేవయాని అంటుంది. అలానే, రిషి తాళి కట్టకుండానే వసుధారను భార్యగా స్వీకరించాడని కూడా అంటుంది. జగతిని మాత్రం అమ్మగా అంగీకరించలేదని అనుపమతో చెప్తుంది. అమ్మ అని పిలవకుండా మేడమ్ అని పిలిచేవాడని, దానితో జగతి బాధ పడేది అని కూడా చెప్తుంది. ఇలా అబద్ధాల మీద అబద్ధాలు చెప్తుంది. రిషి, వసుధార ఇద్దరిపై అనుపమలో ద్వేషం పెరిగేలా దేవయాని ట్రై చేస్తుంది. వసుధార కూడా రిషి, జగతిలను ఒక్కటి చేసే ప్రయత్నాలు చెయ్యలేదు అని అంటుంది.

ఇక ఓ వైపు వసుధార కాలేజీ పనుల్లో బిజీగా ఉంటుంది. ఫైల్స్ ని రిషి తెస్తాడు. తలెత్తకుండా పనిలో సీరియస్‌గా వున్నా వసుధార అటెండర్ అనుకొని అతడికి ఆర్డర్స్ వేస్తుంది. రిషి ఫ్యామిలీని కూడా పట్టించుకోమని వసుధారకు సలహా ఇస్తాడు. అటెండర్ అనుకుని సలహాలు ఇవ్వడం నచ్చక వసుధార క్లాస్ ఇస్తూ తల ఎత్తుతుంది. రిషిని చూసి షాక్ అవుతుంది. వసుధారను లీవ్ పెట్టమని అంటాడు. కానీ ఆమె మాత్రం అందుకు ఒప్పుకోదు. రిషిని వర్క్ లో హెల్ప్ చేయమని వసుధార రిక్వెస్ట్ చేస్తుంది. రిషి మాత్రం ఒప్పుకోడు.
పని తొందరగా పూర్తిచేస్తేనే బయటకు వెళ్ధామని వసుధార చెప్తుంది. రిషి అందుకు ఒప్పుకుంటాడు. పని పూర్తయిన తర్వాత రిషికి హ్యాండ్ ఇచ్చి బయటకు రానని అంటుంది. వసుధారకు ధరణి ఫోన్ చేస్తుంది. అనుపమ ఇంటికి వచ్చిన విషయం చెప్తుంది. జగతి గురించి అనుపమతో పాటు శైలేంద్ర, దేవయాని మాట్లాడారని ఆమె చెప్తుంది. మళ్లీ శైలేంద్ర, దేవయాని కలిసి ఏదో కుట్ర చేయబోతున్నారని వసుధార కి అర్ధం అవుతుంది.
శైలేంద్ర, దేవయాని ని కలిసిన అనుపమ మహేంద్ర దగ్గరకు వస్తుంది. ఆమె తన ఇంటికి రావడం చూసి మహేంద్ర షాక్ అయిపోతాడు. సీక్రెట్‌గా అనుపమ ని ఫాలో అవుతాడు శైలేంద్ర. మహేంద్రను కలవడం చూస్తాడు. వాళ్లిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారో చాటుగా వింటాడు.
జగతి గురించి అనుపమకు సమాధానం ఇవ్వడు. దేవయాని చెప్పిన విషయాలన్ని మహేంద్రతో అనుపమ చెప్తుంది. రిషిని తల్లిగా చూడలేదట. ఇరవై ఏళ్లు జగతిని దూరం పెట్టావటా అని అంటుంది. నిన్ను నమ్మి జగతిని నీ చేతిలో పెట్టాను కానీ నువ్వు ఆమె ప్రాణాలను తీశావు అంటుంది. అప్పుడే రిషి, వసుధార ఇంటికి వస్తారు. వారిని చూసి శైలేంద్ర అక్కడ నుండి దాక్కుంటాడు. ఈరోజు ఎపిసోడ్ ఇక్కడితో పూర్తి అవుతుంది.