వినోదం

Guppedantha Manasu November 1st Episode : రిషి, వ‌సుధార రొమాంటిక్ డే.. దేవ‌యాని యాక్టింగ్ కి రిషి ఫ్లాట్.. ఆవేశంలో మ‌హేంద్ర.. బాధలో అనుపమ..!

Guppedantha Manasu November 1st Episode : ఎండి సీట్ ని దక్కించుకోవడం కష్టం అని, తిరిగి ఫారన్ వెళ్ళిపోమని, శైలేంద్రతో దేవయాని చెప్తుంది. ఎలాగైనా ఎండి సీట్లో కూర్చుంటారని, అప్పటిదాకా తన ప్రయత్నాలు ఆపనని చెప్తాడు. తమ కల నెరవేరడం కోసం, రిషి కుటుంబంలోని మిగిలిన ప్రాణాలని బలి తీసుకోవాలని, సైలేంద్ర, దేవయాని అనుకుంటారు. వసుధారకి ఇంటి పనిలో సహాయం చేయబోతుంటాడు రిషి. కానీ, వసుధారా వద్దని అంటుంది. ఇలాంటి పనులు చేయకూడదని చెప్తుంది. కానీ రిషి వినకుండా చీర మడత పెట్టబోతాడు.

చేతి నుండి చీరను లాక్కొని వసుదారా పరుగు పెడతాడు. రిషి ఆమెని పట్టుకోవడానికి ట్రై చేస్తాడు కష్టపడి వస్తుదారని పట్టుకుంటాడు. రిషి ఎప్పటికైనా దొరకాల్సిందే అని అంటాడు మీకు దొరకడానికే నేను ఉన్నానని.. రొమాంటిక్ గా వసుధార సమాచారం చెప్తుంది. మరి పారిపోవడం ఎందుకని అడుగుతాడు. అనుకున్న వెంటనే దొరికితే, అందులోకి ఉండదని ఆన్సర్ చెప్తుంది. కావాలనుకున్న దానికోసం కష్టపడాలి అని రిషి అంటాడు. ఈ క్షణం నీకు ఏమనిపిస్తుంది అని వసుధారని అడుగుతాడు రిషి.

ఈ ఫీలింగ్ ని మాటల్లో చెప్పలేనని ఆమె అంటుంది. మనసు మాత్రం గాలిలో తేలుతోందని, అంటుంది. నీ కళ్ళు అందంగా కనిపిస్తున్నాయని, వసుధారని పొగుడుతాడు. కళ్ళు కలవరేకుల్లా ఉన్నాయని చెప్తాడు. రిషి మాటలుకి సిగ్గుపడుతుంది. ఇద్దరు ప్రేమ మైఖంలో మునిగిపోతారు. ముద్దు పెట్టబోతాడు రిషి. కానీ అప్పుడే ఫోన్ మోగుతుంది. వారి రొమాన్స్ కి బ్రేక్ పడుతుంది. దేవయాని వాళ్ళ రొమాన్స్ ని చెడగొడుతుంది.

రిషికి ఫోన్ చేసి లేనిపోని ప్రేమని దేవయాని కురిపిస్తుంది. నేను పరాయి దానిని అయిపోయాను అని డ్రామా మొదలు పెడుతుంది. మిమ్మల్ని తలుచుకుంటూ బతుకుతున్నానని, నువ్వు లేకపోతే ఇంట్లో అసలు ఉండలేకపోతున్నానని అంటుంది. ముద్ద కూడా తినడం లేదని, బాధపడుతున్నట్లు యాక్ట్ చేస్తుంది. తిరిగి తన ఇంటికి వచ్చేయమని అంటుంది. తన వల్ల ఏదైనా తప్పు జరిగితే, క్షమించమని అంటుంది. ఇంట్లో నుండి లగేజీతో పాటుగా పెద్దమ్మ సంతోషాన్ని కూడా తీసుకువెళ్లి పోయావని ఎమోషనల్ గా నటిస్తుంది.

Guppedantha Manasu November 1st Episode

మీరు నా గురించి ఇంతలా ఆలోచించడానికి, నేను పసిపిల్లాడిని కాదని దేవయానికి పంచ్ ఇస్తాడు రిషి. మీ ప్రేమ నాకు ఎప్పటికీ కావాలి అని అంటాడు. కానీ నేను అక్కడికి వస్తే అనుకున్నది జరగదు అమ్మని చంపిన హంతకుడు ఎవరో కనిపెట్టాలి. వాళ్ళు ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నాలు విఫలం అవ్వకూడదు అని అంటాడు. అప్పటిదాకా నువ్వు నా దగ్గరికి రావా, అప్పటిలోగా ఈ పెద్దమ్మ ప్రాణాలలో ఉండలేదని డ్రామా ని మొదలు పెడుతుంది. ఒక్కసారి ఇంటికి రమ్మని రిక్వెస్ట్ చేస్తుంది.

నువ్వు ఇంటికి వచ్చేదాకా, పచ్చి నీళ్ళు కూడా తాగనని అంటుంది. రిషి ఆమె మాటలకి కరిగిపోతాడు త్వరలోనే వస్తానని దేవయానికి మాట ఇస్తాడు. ఎప్పుడు వస్తావు అని రిషి ని అడుగుతుంది. ఎప్పుడు వచ్చేది చెబుతానని రిషి చెప్తాడు. మహేంద్ర ఈ మాటలు వింటాడు దేవయాని ఇంటికి రమ్మని అంటోందా అని రిషి ని అడుగుతాడు. మహేంద్ర అవునని చెప్తా.డు దేవయాని దగ్గరికి వెళ్తున్నావా అని అడుగుతాడు. అవునని అంటాడు. నేను ఒక్కడినే వెళ్తాను. మీరు మాట పడ్డ చోటికి మిమ్మల్ని ఎందుకు తీసుకువెళ్తాను అంటాడు. ఆ సమాధానంతో మహేంద్ర పొంగిపోతాడు.

తల్లిని చంపిన హంతకుడు ఎవరో తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నానని మహేంద్ర తో రిషి చెప్తాడు. ముందు ముందు కొన్ని విషయాలు మిమ్మల్ని అడుగుతానని, వాటికి సమాధానం చెప్పి తీరాలని మహేంద్రతో రిషి చెప్తాడు. నువ్వు ఏమి అడిగినా చెప్తానని, మహేంద్ర అంటాడు. తల్లి ప్రేమ, భార్య అనురాగాన్ని దూరం చేసిన ఆ వెధవల్ని క్షమించే ప్రసక్తే లేదని మహేంద్ర ఆవేశానికి గురవుతాడు. ఒకవేళ శత్రువుల్ని క్షమించాల్సి వస్తే అని రిషి ని వసుధారా అడుగుతుంది. అది పిచ్చి ప్రశ్న అని రిషి అంటాడు. ఈ విషయం తండ్రి మాట అని, అమ్మని చంపిన వారిని క్షమించే ప్రసక్తే లేదని అంటాడు.

ఎమోషనల్ యాక్టింగ్ తో రిషి ని బోల్తా కొట్టించిన దేవయాని శైలేంద్ర మెచ్చుకుంటాడు మహేంద్ర వసుధారలతో కలిసి, రిషి త్వరలోనే ఇంటికి వస్తాడని అప్పుడు వాళ్ళ కదలికలను కనిపెట్టి, ఈ కాలేజ్ అని సొంతం చేసుకుంటానని శైలేంద్ర చెప్తాడు. అనుపమని గుర్తించిన దేవయాని భయపడుతుంది. అనుపమకు నిజాలు తెలిస్తే తప్పకుండా తను ఇక్కడికి వస్తుంది అదే జరిగితే మనం అనుకున్న ప్లాన్ వర్క్ అవుట్ కాదని శైలేంద్ర తో అంటుంది. మహేంద్ర జ్ఞాపకాలతో అనుపమ మునిగిపోతుంది. అప్పుడే అక్కడికి పెద్దమ్మ వస్తుంది. నిన్ను చూస్తుంటే బాధగా ఉందని అంటుంది.

పెద్దమ్మ మాటలతో అనుపమ షాక్ అవుతుంది. ఇంకా ఇలా ఎన్నాళ్ళు ఉంటావని అనుపమని అడుగుతుంది. నా చివరి శ్వాస వరకు అని చెప్తుంది. ఆమె సమాధానం తో పెద్దమ్మ కలవరపడుతుంది. మనుషుల్ని వదులుకున్నంత సులువు కాదు. జ్ఞాపకాలని వదులుకోవడం అని అంటుంది. నా గతం గురించి బయటకు రాలేకపోతున్నాను. నా జీవితం అక్కడే ఆగిపోయిందని అంటుంది అనుపమ. మహేంద్ర జగతికి దూరమై చాలా కాలమైనా వారితో గడిపిన క్షణాల్ని మర్చిపోలేక పోతున్నానని అనుపమ అంటుంది. నువ్వా గతంలోకి మళ్లీ వెళ్లాలని, మళ్ళీ జగతి మహేంద్రా దగ్గరికి వెళ్తేనే నీకు మంచిదని అనుపమకి పెద్దమ్మ చెప్తుంది. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.

Share
Sravya sree

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM