Guppedantha Manasu November 14th Episode : పూర్వ విద్యార్థుల సమ్మేళనం దగ్గరకు మహేంద్రని రిషి, వసుధార తీసుకెళ్తారు. అక్కడికి వెళ్లాక మహేంద్ర తానెక్కడికి వచ్చానో తెలుసుకుని లోపలకు రానంటాడు. రిషి-వసు సర్దిచెబుతుండగా ఇంతలో అనుపమ అక్కడకు వస్తుంది. మిగిలిన కాలేజీ ఫ్రెండ్స్ వచ్చి మహేంద్రను పార్టీ లోపలికి తీసుకెళ్తారు. ఆ తర్వాత జగతి ఎక్కడ ? ఆమెను ఎందుకు తీసుకురాలేదని రిషిని అడుగుతుంది అనుపమ. జగతి, మహేంద్ర మధ్య గొడవలు ఇంకా సమసిపోలేదా, మీలా వారిద్దరు సంతోషంగా ఉండాలని మీకు అనిపించడం లేదా అని అడుగుతుంది. ఏం వసుధారా మీరిద్దరూ ఎలా సంతోషంగా ఉంటున్నారో మీ అత్తయ్య, మావయ్య కూడా హ్యాపీగా ఉండాలని లేదా అని నిలదీస్తుంది. అమ్మ గురించి మీకో విషయం చెప్పాలని రిషి మొదలుపెడతాడు. ఇంతలో ఫ్రెండ్స్ వచ్చి అనుపమని లోపలకు తీసుకెళ్లిపోతారు. అసలు ఈవిడకు జగతి గురించి ఎలా తెలుసు అనుకుంటారు రిషి, వసు.
సమ్మేళనం ప్రారంభమవుతుంది. అందరూ సంతోషంగా ఉంటారు. జోక్స్ చెప్పుకుంటారు నవ్వుకుంటారు. ఆ తర్వాత అనుపమ స్టేజ్ పై మాట్లాడుతుంది. కాలేజీ రోజులన్నీ కళ్లముందు తిరుగుతున్నాయంటుంది. సరిగ్గా గుర్తులేదు కానీ ఎక్కడో కొటేషన్ చదివాను. నిజమైన స్నేహితులు ఎప్పటికీ విడిపోరు. మనుషులు దూరమైనా మనసులు దగ్గరగా ఉంటాయనే కొటేషన్ చెబుతుంది. నా లైఫ్ లో మీరంతా అలాంటి స్నేహితులే అంటుంది. ఇంతలో స్టేజ్ కింద నుంచి జగతి-మహేంద్ర నీకు క్లోజ్ ఫ్రెండ్స్ కదా అంటారు. అవునన్న అనుపమ ముగ్గురు కలసి చేసిన అల్లరి గురించి, సరదాగా స్పెండ్ చేసిన సమయం గురించి చెబుతుంది. ఆ రోజులు తిరిగొస్తే బావుండును అనిపిస్తోంది, (నువ్వు అనుకున్నట్టే కాలచక్రం వెనక్కు వెళ్లి జగతి బతికి ఉండే బావుండును అనుకుంటాడు మహేంద్ర). అందరూ స్టేజ్ పై మాట్లాడండి అంటుంది.
రిషి-వసుధారకి అనుపమ-జగతి-మహేంద్ర ఫ్రెండ్స్ అని తెలుస్తుంది. ఇంతలో విశ్వనాథం, ఏంజెల్ అక్కడకు వస్తారు. రిషి-వసుధార పలకరించినా ఏంజెల్ చికాకు పడుతుంది. మీరేంటి ఇక్కడ అని వసుధార అడిగితే డాడ్ అంటూ అక్కడకు వస్తుంది అనుపమ. మీరేంటి లేటుగా వచ్చారని అడుగుతుంది. ఆ పిలుపు విని రిషి, మహేంద్రతో పాటు వసుధార ఆశ్చర్యపోతారు. విశ్వనాథం తన తండ్రి అని రిషికి చెబుతుంది అనుపమ. మీకు అనుపమ అనే కూతురు ఉందనే విషయం నాతో ఎప్పుడు చెప్పలేదు ఎందుకని అని విశ్వనాథాన్ని అడుగుతాడు రిషి. నువ్వు మాత్రం నాకు అన్ని చెప్పే చేశావా అంటూ రిషిపై సెటైర్ వేస్తాడు విశ్వనాథం. జగతి, మహేంద్ర, తాను కలిసి చదువుకున్నట్లు విశ్వనాథంతో చెబుతుంది అనుపమ.
పార్టీలో మహేంద్ర మాట్లాడాలని స్నేహితులు బలవంతం చేస్తారు. తాను మాట్లాడలేనని మహేంద్ర ఎంత చెప్పినా స్నేహితులు తన మాటల్ని పట్టించుకోరు. స్నేహం కూడా ప్రేమలో ఒక భాగమేనని తాను నమ్ముతానని మహేంద్ర మొదలుపెట్టి ఏ బంధమైనా మనం ఊహించుకున్నట్లుగా ఉండదని, తొలుత పలచబడి ఆ తర్వాత పూర్తిగా కనుమరుగైపోతుందని మాట్లాడుతాడు. మహేంద్ర మాటలు విని అందరూ షాకవుతారు. జగతి గురించి మాట్లాడాలని స్నేహితులందరూ మహేంద్రను రిక్వెస్ట్ చేస్తారు. కానీ మహేంద్ర మాట్లాడలేకపోతాడు. కన్నీళ్లతో స్టేజ్ దిగి వెళ్లిపోతాడు.
జగతిని ఎందుకు దూరంగా పెడుతున్నావు, నిన్ను నువ్వు ఎందుకు మార్చుకోవడం లేదు అంటూ అనుపమ నిలదీస్తుంది. జగతిని ఎందుకు ఇక్కడికి తీసుకురాలేదని మహేంద్రను నిలదీస్తుంది. ఇంకా ఆమెను ఎందుకు వేధిస్తున్నావు. క్షోభపెడుతున్నామా, వసుధార మధ్యలో కల్పించుకుని సమాధానం చెప్పాలని చూస్తుంది. ఇది మా ముగ్గురికి సంబంధించిన విషయం మీరు ఎవరు జోక్యం చేసుకోవద్దని అనుపమ అంటుంది. జగతిని ఇక్కడికి తీసుకొస్తే ఆమెను చూడాలని, తనతో మాట్లాడాలని ఎంతో ఆశగా ఎదురుచూశానని ఎమోషనల్ అవుతుంది. అనుపమ పదే పదే అడగటంతో జగతి చనిపోయిందనే నిజం బయటపెడుతుంది వసుధార. లేని మనిషిని తీసుకురావడం సాధ్యం కాదని అంటుంది.
జగతి చనిపోయిందన్న మాట విని అనుపమతోపాటు అక్కడే ఉన్న విశ్వనాథం, ఏంజెల్ కూడా షాక్ అవుతారు.
జగతి చనిపోలేదని చెప్పు అంటూ మహేంద్రని గట్టిగా నిలదీస్తుంది. జగతి చనిపోయింది. తను నాకు దూరమైంది అంటూ అనుపమతో అంటాడు మహేంద్ర. దీంతో ఎపిసోడ్ ముగుస్తుంది.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…