Guntur Karam : సాధారణంగా హీరోలకి సరిపోయేలా దర్శకులు కథలను సిద్ధం చేస్తూ ఉంటున్న విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో ఏదో కారణాల వలన ఆ కథలని వేరే హీరో రిజెక్ట్ చేయడం, ఆ కథతో ఇంకో హీరో సినిమా చేయడం మనం చూస్తూనే ఉన్నాం. అలా జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ అలా ఎక్కువ హిట్ సినిమాలను వదులుకున్నారు. ఇదిలా ఉంటే సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న గుంటూరు కారం. ఈ సినిమా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాలో గురూజీ మొదట టాలీవుడ్ స్టార్ హీరోను అనుకున్నారట. ఆయన వివిధ కారణాల వలన ఈ సినిమాను రిజెక్ట్ చేశారని తెలుస్తోంది.
గుంటూరు కారం సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకుడు కాగా, ఇప్పటికే వీరి కాంబినేషన్ లో అతడు, ఖలేజా చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు ముచ్చటగా మూడో సారి ఈ కాంబో రిపీట్ అవుతుంది. ఇక ఈ సినిమా మాస్ మసాలా యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమా కోసం ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. చిత్రంలో మహేశ్ బాబు సరసన మొదట పూజా హెగ్డే అనుకున్నారు మేకర్స్. అయితే ఆమె తప్పుకోవడం.. ఈ సినిలో మీనాక్షి చౌదరి, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక తమన్ సంగీతం అందిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది. సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ సినిమాను మొదట ఓ టాలీవుడ్ స్టార్ హీరో చేయాల్సి ఉండేనట. అయితే ఆయన రిజెక్ట్ చేయడం వల్లే ఈ సినిమా మహేశ్ బాబు చేతుల్లోకి వెళ్లిందని తెలుస్తోంది. ఆయన ఎవరో కాదు.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్. గుంటూరు కారం సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు మొదట పవన్ కళ్యాణ్ తో చేయాలి అనుకున్నారట. ఆయనకు కథ కూడా చెప్పారని తెలుస్తోంది. అయితే ఆయన రిజెక్ట్ చేయండ వల్లే మహేశ్ బాబు చేతుల్లోకి వెళ్లిందట. అయిష్టంగానే పవన్ కల్యాణ్ గుంటూరు కారం సినిమాను వదులుకున్నారని తెలుస్తోంది. ఈ న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…