Guppedantha Manasu December 4th Episode : శైలేంద్ర ని ఇంటరాగేషన్ చేయడానికి, హాస్పిటల్ కి ముకుల్ వస్తాడు. ఫణింద్ర వద్దని చెప్తాడు. కొడుకుని ఫణింద్ర వెనక్కి వేసుకుని, రావడంతో, ముకుల్ షాక్ అయిపోతాడు. బంధాలు, బంధుత్వాలతో చట్టానికి పని లేదని చెప్తాడు. నిజం, సాక్ష్యమే మాకు ముఖ్యమని అంటాడు. నా కొడుకు తప్పు చేస్తే, మీ కంటే ముందు నేను శిక్షిస్తానని అంటాడు. ఎంత త్వరగా అయితే, అంత త్వరగా ఇన్వెస్టినేషన్ మొదలుపెడితే, దొరుకుతారు లేకపోతే నిందితులు కేసుని పక్క దారి పట్టిస్తారు అని ముకుల్ చెప్తాడు.
శైలేంద్ర హెల్త్ కండిషన్ ని దృష్టిలో పెట్టుకుని, విచారించడానికి కొంత టైం ఇవ్వమని ముక్కుల్ ని రిక్వెస్ట్ చేస్తాడు ఫణింద్ర. దేవయాని ఎమోషనల్ అవుతుంది. రాజు లాగా తిరగాల్సిన వాడివి మంచం మీద పడిపోవడం చూడలేకపోతున్నాను అని, కన్నీళ్లు పెట్టుకుంటుంది. తల్లి పిలుపుతో శైలేంద్ర స్పృహలోకి వస్తాడు. కళ్ళు తెరుస్తాడు శైలేంద్ర. మాట్లాడటానికి కష్టపడతాడు శైలేంద్ర. లేవగానే ఏం జరిగింది, నీ మీద ఎటాక్ ఎవరు చూసారు అని దేవయాని అడుగుతుంది. ఒకేసారి అన్ని ప్రశ్నలు అడిగితే, తాను సమాధానం చెప్పలేనని శైలేంద్ర అంటాడు. పొడిచిన వాడు ఎవడో కాదు మంచి ట్రైనింగ్ తీసుకున్నట్లుగా ఉన్నాడు. కత్తి దిగింది. కానీ ప్రాణం మాత్రం పోలేదు అని అంటాడు. దేవయానికి అర్థం కాదు.
జగతిని చంపిన షూటర్ తో నువ్వు మాట్లాడిన వాయిస్ ముకుల్ కి దొరికిందని కొడుకుతో దేవయాని చెప్తుంది. అందరికీ ఆ వాయిస్ వినిపించాడని, టెన్షన్ పడుతూ కొడుకుతో చెబుతుంది. తర్వాత శైలేంద్ర ని అంతా ఎందుకు జరిగిందని అడిగితే, ఇదంతా నాటకం అని శైలేంద్ర కి చెప్పబోతుండగా ముకుల్ కనపడతాడు. కంగారు పడిపోతాడు. దేవయాని కూడా భయపడిపోతుంది. ఇంటరాగేషన్ అని చావగొడతాడు అని కొడుకుతో అంటుంది. నువ్వే ఏదో ఒకటి చేసి ఆపాలని తల్లిని కోరుతాడు. ఇంటరాగేషన్ చేయడానికి, ముకుల్ ఎదురు చూస్తుంటాడు అని ఒప్పుకోదు. చావు బతుకుల మధ్య ఉంటే ఇంటరాగేషన్ ఎలా చేస్తారని ఫైర్ అవుతుంది. మీ అబ్బాయి జగతి హత్య కేసులో ప్రధాన నిందితుడు అని ముకుల్ అంటాడు.

మిమిక్రీ వాయిస్ ని పట్టుకుని, నా కొడుకుని నిందితుడు అంటారేంటి అని ఎగిరి పడుతుంది. శైలేంద్ర ని ముక్కలు తప్పు పట్టలేదు అని, వాయిస్ అతనిదా కాదా అని క్లారిటీ తీసుకుంటారని అంటున్నారని వసుధారా అంటుంది. శైలేంద్ర హాస్పిటల్ నుండి ఎక్కడికి పారిపోడని కోలుకున్న తర్వాత ఇంటరాగేషన్ చేయమని శైలేంద్ర ని అడ్డుకుంటుంది. రిషి మహేంద్ర అంటే శైలేంద్ర కి ఎంతో ఇష్టమని, అలాంటి వాళ్ళు జగతి ప్రాణాలు ఎలా తీస్తారని అంటుంది.
రిషి ఇక్కడ ఉంటే, మాట్లాడనిచ్చేవాడు కాదు. ఇలాంటి వాళ్ళని ఇక్కడికి రానిచ్చేవాడు కాదని దేవయాని అంటుంది. శైలేంద్ర పరిస్థితి చూసి, అతడు మాట్లాడే స్థితిలో ఉంటేనే ఇంటరాగేషన్ చేస్తానని ముకుల్ చెప్తాడు. ముకుల్ మాట్లాడితే మంచిదని మహేంద్ర వసుధారా ఫణింద్రకి సర్దు చెప్పడంతో ఒప్పుకుంటాడు. శైలేంద్ర రూమ్ లోపలికి వచ్చిన ముకుల్ అతని మెడికల్ రిపోర్ట్స్ని చూస్తాడు. పిలుస్తాడు. స్పృహలో ఉన్నా కూడా లేనట్లు నాటకం ఆడుతాడు. ఎంత పిలిచినా పలకకుండా ఉండిపోతాడు. మహేంద్ర కి నటనని అర్థమవుతుంది ముకుల్ పిలుపుతో స్పృహలకి వచ్చినట్లుగా నటిస్తాడు .శైలేంద్ర కళ్ళు తెరవగానే వాయిస్ వినిపిస్తాడు. ఏదో ఒకటి చేసి ఆపాలని ఫిక్స్ అయిన శైలేంద్ర ఆరోగ్యం విషమించినట్టు నాటకం ఆడుతాడు.
శైలేంద్ర కి ఏమైనా అయితే మీరే ఆ నష్టాన్ని భరిస్తారా అని సీరియస్ అవుతుంది దేవయాని. ఈరోజు కాకపోతే రేపైనా ఇన్వెస్టిగేషన్ చేసి తీరుతానని ముకుల్ అంటాడు. తప్పు చేసిన వాళ్ళు భయపడతారు కానీ ఏ తప్పు చేయని నా కొడుకు నేను భయపడమని చాలెంజ్ చేస్తుంది దేవయాని. దేవయానిని చూసి మహేంద్ర నవ్వుకుంటాడు. ఇంటరాగేషన్ చేస్తే స్పృహా కోల్పోయే ప్రమాదం వుంది డిశ్చార్జ్ అయిన తర్వాత చేయమని డాక్టర్ చెప్తారు.