Guppedantha Manasu December 21st Episode : అక్కడ ఉన్న అడ్రస్ కి వసుధారా వెళ్తుంది. శైలేంద్ర ని చూసి షాక్ అవుతుంది. ఏంటి షాక్ అయ్యావా..? ఊహించి ఉండవు కదా అని అంటాడు. బ్రెస్ లెట్ ని పంపించింది నువ్వేనా అని అంటుంది. ఇంకా అందులో డౌట్ ఏముంది..? రిషి ని చూసినట్లే ఉందా..? బాగా గుర్తుకు వస్తున్నాడా..? రిషి విషయంలో ఏవేవో అనుమానాలు పెంచుకున్నారు కదా? మీరు ముగ్గురు చాలా తెలివిగా అనుకుంటున్నారు కదా? రిషి ఉన్నాడా లేడా అనే అనుమానం కూడా ఉంది కదా..? అందుకే మీకు నమ్మకం కలగడం కోసం ఇది తీసుకొచ్చాను. ఇప్పటికైనా నమ్ముతావా అని అంటాడు.
రిషి ఎక్కడున్నాడని అడుగుతుంది. అంత సింపుల్గా ఎలా చెప్తానని శైలేంద్ర అంటాడు. ఎండి సీట్ కావాలని అంటాడు, అసలు నువ్వు మనిషివేనా అని అడుగుతుంది. నేను మృగాన్ని అందుకే వాడు నా తమ్ముడైన వాడి గురించి పట్టించుకోను. నాకు ఎండి సీట్ కావాలని చెప్తున్నా, నీకు రిషి కావాలి. తొందరగా నిర్ణయం తీసుకోకుండా మీనమేషాలు లెక్కిస్తున్నావు. ఒకటి కావాలని అనుకుంటే, ఇంకొకటి వదులుకోవాలి కదా అని శైలేంద్ర అంటాడు.
నీకు రిషి కావాలంటే ఎండి సీటు వదిలేయని చెప్తాడు రిషి. సార్ ఎక్కడ ఉన్నారో ఏం చేసావో చెప్పమని కోపంగా వసుధారా అడుగుతుంది. నేను అడిగింది చేయడం తప్ప నీకు ఇంకో దారి లేదు అని అంటాడు. నేను అడిగింది చేయకపోతే రేపు ఆ బ్రేస్లెట్ పెట్టుకున్న చేయి కూడా రావచ్చు అని అంటాడు. దీంతో వసుధారా కోపంగా శైలేంద్ర కాలర్ పట్టుకుంటుంది. ఆవేశం వద్దు ఆవేశపడితే నీకే కష్టమని అంటాడు. ఎండి సీట్ ఇస్తావా ఏదో ఒకటి త్వరగా చెప్పు లేకపోతే రిషి ప్రాణాలని కోల్పోతాడు అని అంటాడు.
రిషి నా దగ్గర ఉన్నాడని, నీకు చెప్తే బాబాయ్ కి చెప్పావ్. ఆయన వచ్చి రచ్చ రచ్చ చేసాడు. ఇప్పుడు బ్రేస్లెట్ పంపించండి. విషయం చెప్తే, రిషి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అని వార్నింగ్ ఇస్తాడు. వసుధార మౌనంగా ఉండిపోతుంది. కాలేజ్ లో బోర్డు మెంబర్స్ ఇంకా వసుధారా రాలేదు ఏంటి అని మహేంద్రని నిలదీస్తూ ఉంటారు. మహేంద్ర సర్దు చెప్తాడు. ఎండి పదవిలో ఉండి, ఇలా ఉంటే ఏంటి అని అందరూ అడుగుతూ ఉంటారు. వసుధారా ఇలా చేసింది ఏంటని ఫణీంద్ర అంటాడు. ఏదో జరుగుతోందని, ఏం జరిగిందో తెలుసుకుంటానని మహేంద్ర వెళ్ళిపోతాడు.
ఏం జరిగింది..? బోర్డ్ మీటింగ్ కి ఎందుకు రాలేదని మహేంద్ర అడుగుతాడు. రిషి కోసం వెళ్లినట్లు వసుధారా చెప్తుంది. వెంటనే శైలేంద్ర ఇచ్చిన వార్నింగ్ గుర్తుకు వచ్చి, విషయం చెప్పకుండా మౌనంగా ఉంటుంది. మీటింగ్ అయ్యాక వెళ్లేవాళ్ళం కదా..? రేపు బోర్డు మీటింగ్ ఏర్పాటు చేయండి. ఒక నిర్ణయం తీసుకోబోతున్నానని అంటుంది. ఏం నిర్ణయం అని అంటాడు. నన్ను అడగద్దు అని అంటుంది వసుధారా. శైలేంద్ర కి ఫోన్ చేసి బోర్డు మీటింగ్ కి రమ్మని చెప్తుంది.
నిర్ణయం తీసుకున్నా అంటే, తీసుకున్నానని అంటుంది. ఏం నిర్ణయం అని అడుగుతాడు. మీరు దేనికోసం అయితే అరాచకాలు చేస్తున్నారో, అదే దక్కుతుందని అంటుంది. శైలేంద్ర భూషణ్ ఎండి అవుబోతున్నాడని సంబరపడిపోతాడు. రిషి సార్ ఎక్కడ ఉన్నారో చెప్పాలి. ఆయన్ని అప్పగించాలి. సార్ కి ఏం జరిగినా నేను ఊరుకోను అని వసుధార అంటుంది. రిషి సార్ పనిమీద వెళ్లారని నోటీస్ ఇచ్చాను కదా అది అబద్ధం. నిజానికి రిషి సార్ కనపడట్లేదు. సార్ కనిపించడం లేదు అంటే అల్లకల్లోలం ఏర్పడుతుందని, మహేంద్ర ఫణింద్ర సార్ కి చెప్పి ఈ నిర్ణయం తీసుకున్నానని అంటుంది.
ఎందుకు కనపడలేదు సార్ అని బోర్డు మెంబర్స్ అడుగుతారు. శైలేంద్ర హాస్పిటల్ లో ఉన్నప్పటినుండి కనిపించట్లేదు అని చెప్తుంది. శైలేంద్ర టెన్షన్ పడతాడు. రిషి సార్ కనిపించకపోవడంతో, ఎండి పదవి మీద నేను శ్రద్ధ చూపలేకపోతున్నాను. అందుకే ఎండి పదవి నుండి తప్పుకుంటున్నానని అంటుంది. ఏంటి వసుధారా నువ్వు ఎండి సీటు వదలడం ఏంటని మహేంద్ర కోపంగా అడుగుతాడు. తన నిర్ణయాన్ని వద్దని చెప్పొద్దని అంటుంది. ఏమైందని అడుగుతాడు ఏం జరగలేదని చెప్తుంది. మహేంద్ర కోపంగా శైలేంద్ర వైపు చూసి లేదు ఏదో జరిగింది అదేంటని అడుగుతాడు. ఇక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…