Guppedantha Manasu December 1st Episode : వాయిస్ క్లిప్ విన్న తర్వాత శైలేంద్ర అని అందరూ గుర్తుపడతారు. శైలేంద్ర ఎక్కడున్నాడని ఫణీంద్రని అడుగుతాడు ముకుల్. శైలేంద్ర, ధరణి ని ట్రిప్ కి పంపించాను అని చెప్తాడు. ఫణింద్ర తో పాటు, ముకుల్ ఫోన్ చేసినా శైలేంద్ర ఫోన్ లిఫ్ట్ చేయడు. దేవయాని కూడా శైలేంద్ర ని హెచ్చరించడానికి ఫోన్ చేస్తుంది. తన ఫోన్ పోలీసులు ట్రాప్ చేశాడన్న అనుమానం ఉందని శైలేంద్ర ఫోన్ లిఫ్ట్ చేయడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు అని టెన్షన్ పడుతుంది.
ముకుల్ కి మహేంద్ర అన్ని నిజాలు చెప్పాడని అనుకుని శైలేంద్ర భయంతో వణికి పోతాడు. ఇంటి నుండి ఫోన్ రావడంతో ఎక్కువ భయం కలుగుతుంది. ముకుల్ సాక్ష్యంగా చూపించిన ఆడియో క్లిప్ లో అన్నయ్య వాయిస్ విని రిషి ఎమోషనల్ అయిపోతాడు. బాధపడతాడు. మీ అన్నయ్య గురించి మీకు తెలిస్తే తట్టుకోలేరు. ఇన్నాళ్లు సైలెంట్ గా నేను ఉండిపోయాను ఈరోజు అన్ని విషయాలు బయటపడడం ఖాయమని వసుధారా అనుకుంటుంది. అన్నయ్య నన్ను సొంత తమ్ముడిలా ప్రేమగా చూసుకున్నాడు అని చెప్తాడు. అమ్మని కూడా గౌరవించేవాడని రిషి అంటాడు.
జగతిని తాను మేడం అని పిలిస్తే, అమ్మ అని పిలవమని చెప్పేవాడని, రిషి ఎమోషనల్ అయిపోతాడు. అలాంటి అన్నయ్య అమ్మని చంపేశాడా..? అమ్మ దూరం కావడానికి అన్నయ్య కారణమా అని రిషి బాధపడతాడు. అన్నయ్యకి అమ్మని చంపాల్సిన అవసరం ఏముంది..? నమ్మలేకపోతున్నానని వసుధారతో రిషి అంటాడు. నాకు తెలిసిన అన్నయ్యని నమ్మాలా, కళ్ళ ముందు ఉన్న సాక్షాన్ని నమ్మాలా అని వసుధారని అడుగుతాడు. ఇంతలో
ముకుల్ పిలుస్తాడు.

దాంతో వసుధార చెప్పాలనుకున్నది ఆగిపోతుంది. ఫణింద్ర, మహేంద్ర ఫోన్ నుండి కాల్ చేస్తే శైలేంద్ర లిఫ్ట్ చేయడం లేదని రిషితో ముకుల్ చెప్తాడు. తర్వాత దేవయానిని పిలిచి శైలేంద్ర కి ఫోన్ చేయమంటాడు. కానీ ఆమె తడబడుతూ సమాధానం చెప్పడంతో ఫోన్ తీసుకుంటాడు ముకుల్. అప్పటికే ఆమె చాలా సార్లు శైలేంద్ర కి ఫోన్ చేసినట్లుగా కనపడుతుంది. ఇన్నిసార్లు ఎందుకు ఫోన్ చేశారని దేవయానిని అడుగుతాడు. శైలేంద్ర ని ఇక్కడికి పిలవడానికి ఫోన్ చేశానని అబద్ధం ఆడుతుంది. తర్వాత అందరి ఫోన్ లని తీసుకుంటాడు ముకుల్. ఫణింద్ర కోపంతో ఊగిపోతాడు. నిజంగా అన్నయ్య ఇదంతా చేశాడా అని పెదనాన్నతో రిషి అంటాడు.
నమ్మినా నమ్మకపోయినా కనిపిస్తున్న సాక్షాలని కాదనలేము అని చెప్పి శైలేంద్ర ని ఇరికిస్తుంది వసుధారా. శైలేంద్ర దుర్మార్గుడు అని నిరూపించే సాక్షాల కోసమే ఇన్నాళ్లు ఎదురు చూసారని మహేంద్ర అనుకుంటాడు. దేవయాని ఫోన్ కి శైలేంద్ర మొబైల్ నుండి ఫోన్ వస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేయమని ముకుల్ అంటాడు. అక్కడినుండి ఇంకో వ్యక్తి మాట్లాడుతాడు. శైలేంద్ర, ధరణి ఇద్దరు గాయాలతో హాస్పిటల్లో ఉన్నారని చెబుతారు. దేవయాని ఫణీంద్ర కంగారు పడిపోతారు.
హాస్పిటల్ లో ధరణి కన్నీళ్లు పెట్టుకుంటూ కనపడుతుంది. నా కొడుకు ఎక్కడ, అతడికి ఏమైంది అని అడుగుతుంది. శైలేంద్ర ఐసియు లో ఉంటాడు. డాక్టర్లు ట్రీట్మెంట్ ఇస్తారు. ముగ్గురు రౌడీలు వచ్చి, కళ్ళముందే కత్తులతో పొడిచారని చెప్తుంది ధరణి. మహేంద్ర అనుమానపడతాడు. వాళ్ళు మన ఫ్యామిలీ మీద పగ పట్టి ఉంటారు. సైలేంద్ర కోసం మాటు వేసి ఒంటరిగా ఉన్న సమయంలో అటాక్ చేశారని దేవయాని కన్నీళ్లు పెట్టుకుంటుంది.
ఇది శైలేంద్ర డ్రామా అని కనిపెడుతుంది. నా గుండె ఆగిపోయేలా ఉందని, ఎమోషనల్ అవుతుంది. శైలేంద్ర మారిపోయిన సమయంలో ఇలా జరగడం ఏంటి అని భర్త ఫణింద్ర తో చెప్తూ దేవయాని బాధపడుతుంది. హాస్పిటల్లో రిషి కనపడడు. రిషి కోసం వసుధారా వెతుకుతుంటుంది. రిషి మెసేజ్ పంపిస్తాడు. ఒక చిన్న పని ఉండి బయటికి వెళ్లినట్లు మెసేజ్ పంపుతాడు. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.