Guppedantha Manasu December 16th Episode : మహేంద్ర నుండి తప్పించుకుని పరిగెడతాడు శైలేంద్ర. శైలేంద్ర ని వెంటాడుతూ హాల్లోకి వచ్చిన మహీంద్రా చంపేస్తానని అంటాడు. ధరణి దేవయాని అడ్డుపడతారు. పక్కకి తోసేస్తాడు. మహేంద్ర గన్ పేలిన సౌండ్ వస్తుంది. ధరణి, దేవయాని గట్టిగా అరుస్తారు. ఇంతలో వచ్చిన అనుపమ, వసుధార శైలేంద్ర ని కాల్చకుండా మహేంద్ర గన్ ని పక్కన పెడతారు. శైలేంద్ర ని ఈవేళ చంపేస్తానని మహేంద్ర ఆవేశంగా అంటాడు. అతనిని చంపి దోషి అవుతావా అని అనుపమ అంటే పరవాలేదు అంటాడు.
వీడు వల్ల నా జీవితం చీకటిగా మారిపోయింది. ఇప్పుడు దోషిని అయినా జైలు పాలు అయినా నాకు అభ్యంతరం లేదంటాడు మహేంద్ర. ఎలాగో అలా నచ్చచెప్పి, బలవంతంగా మహేంద్ర ని బయటకు తీసుకెళ్తారు. ఈరోజు తప్పించుకోవచ్చు. కానీ ఏదో ఒక రోజు నేను నిన్ను చంపేస్తాను అని వార్నింగ్ ఇస్తాడు. ఇంతలో ఫణింద్ర వస్తాడు. వసుధార చీర కొంగు తో గన్ దాచేస్తుంది. ఫణింద్ర ని చూసి, అన్నయ్యని కౌగిలించుకుంటాడు మహేంద్ర.
రిషి జాడ ఇంకా తెలియలేదా, రిషికి ఇలా ఎవరు చేస్తారు..? అది తెలిస్తే చాలు. అది ఎవరో తెలిసిన రోజు నేను వాళ్ళని వదిలి పెట్టాను. నువ్వు ఏం కంగారు పడకు అని ఫణింద్ర అంటాడు. నేను కూడా బాబాయ్ కి అదే చెప్తున్నాను. రిషి ఎక్కడున్నా క్షేమంగానే ఉంటాడు అని అన్నాను. బాబాయి భయపడుతున్నారు అని శైలేంద్ర డ్రామా స్టార్ట్ చేస్తాడు. కొడుకు కనిపించకుంటే, ఏ తండ్రి మనసు బాధపడదు. ఇలాగే ఉంటుందని ఫణీంద్ర అంటాడు.
రిషి విషయంలో చిన్న మామయ్య ఆయన్ని అనుమానిస్తున్నారు అని గన్ పట్టుకుని బెదిరించారు అని అంత చెప్తుంది ధరణి. ఫణీన్ఫ్ద్ర కోపంతో చూస్తాడు. ఏదో మీ తమ్ముడు అని ఊరుకున్నాను లేకుంటే ఏం చేసే దానినో. నాకు ఎందుకు అబద్దం చెప్పాలని చూసావు ముందే నిజం చెప్పొచ్చు కదా..? మహేంద్ర గన్ పట్టుకుని వచ్చాడంటే దీనికోసం ముందు మీకు చాలా చర్యలు జరిగి ఉంటాయి. చిన్న విషయానికి అనుమానానికి అలా రారు కదా నాకు తెలియకుండా చాలా జరుగుతున్నాయని అంటాడు.
నాకు తెలియకుండా చాలా జరుగుతున్నాయని… పేషెంట్ అయి హాస్పిటల్ లో ఉంటే ఏం చేస్తాడు అని దేవయాని అంటుంది. దానికంటే ముందే చేయొచ్చు కదా..? ఏదైనా చేయాలనుకుంటే, హాస్పిటల్ లో ఏంటి అండమాన్ లో ఉండి కూడా ప్లాన్ చేయొచ్చు కదా అని ఫణింద్ర అంటాడు. వాళ్ళు ఏదో కావాలని ఇలా చేస్తున్నారు. శైలేంద్ర మీద కోపంతో చేస్తున్నారు. అన్నదమ్ములు ఉన్న ఇల్లు కురుక్షేత్రమే అని దేవయాని అంటుంది. మహేంద్ర రిషి అలా ఆలోచించే వాళ్ళు కాదు.
ఎందుకు అంత గట్టిగా అనుమానిస్తున్నారు అని ఫణింద్ర అంటాడు. వీళ్లు అంటే అనుకుందాం. మరి ముకుల్ ఎందుకు అనుమానిస్తున్నాడు..? జగతి విషయంలో వీడు వాయిస్ అయితే వచ్చింది. అది ఎలా వచ్చింది అని ఫణింద్ర అంటాడు. అమ్మ ముకుల్ కంటే డాడ్ ఎక్కువ ఇన్వెస్టిగేట్ చేసేలా ఉన్నాడు. ఎస్కేప్ అవ్వాలని మనసులో శైలేంద్ర అనుకుంటాడు.
కడుపునొప్పి వచ్చినట్లు నాటకం ఆడుతాడు. దాంతో శైలేంద్రని దేవయాని తీసుకెళ్తుంది కాసేపటికి జరిగిందంతా ఆలోచించిన శైలేంద్ర ధరణి రెండుసార్లు కాపాడవు థాంక్స్ అంటూ మళ్ళీ డ్రామా స్టార్ట్ చేశాడు. ఎవరు చంపారనుకుంటున్నావ్ అని అడుగుతాడు. మీరే చేశారని అనుకుంటున్నట్లుగా సైలెంట్ గా ఉండిపోతుంది ధరణి. దానికి నువ్వు అనుకున్నది నిజమే నువ్వు ఏది అనుకుంటే అదే అని శైలేంద్ర అని, సరే కానీ రిషి గురించి తెలిస్తే నాకు కచ్చితంగా చెప్పు అంటాడు. తర్వాత కాఫీ తీసుకు రమ్మని పంపిస్తాడు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…