Salaar : టాలీవుడ్ స్టార్ హీరోలలో ప్రభాస్ ఒకరు. ఆయనకి బాహుబలి సినిమాతో ఎంతటి క్రేజ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ చేసిన సినిమాలన్నీ ఫ్లాపులు కావడంతో ఆయన పరిస్థితి ఇప్పుడు దారుణంగా మారింది. ఇప్పుడు ప్రభాస్ హోప్స్ అన్నీ కూడా సలార్‌పైనే పట్టుకున్నాడు. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ‘సలార్స చిత్రాన్ని కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. అయితే, మధ్యలో అనుకోని అవాంతరాలు ఎదురు కావడంతో చిత్రీకరణ సజావుగా సాగలేదు.
క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ‘సలార్’ మూవీకి సంబంధించిన టాకీ పార్టును చిత్ర యూనిట్ ఇటీవలే విజయవంతంగా కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. రెండు భాగాలుగా రాబోతున్న ఈ మూవీలోని ఫస్ట్ పార్ట్ ‘సలార్: సీజ్‌ఫైర్’ పేరుతో విడుదల కానుండగా, ఈ మూవీ ప్రమోషన్ స్పీడ్ పెంచబోతున్నారు. ఈ క్రమంలో డిసెంబర్ 1న ట్రైలర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ఆదివారం (నవంబర్ 12) వెల్లడించారు. దీపావళి రోజు రెబల్ స్టార్ అభిమానులకు ఇది నిజంగా పండగలాంటి వార్తే. డిసెంబర్ 1వ తేదీన సాయంత్రం 7:19 గంటలకు విడుదల చేస్తున్నట్లు మూవీ టీమ్ తాజాగా ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను సైతం తాజాగా వదిలింది. ఇందులో ప్రభాస్ చేతిలో గన్ పట్టుకుని యుద్ధ వీరుడిలా కనిపిస్తున్నాడు. ఒకేసారి కొత్త పోస్టర్‌తో పాటు ట్రైలర్ అప్‌డేట్ రావడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో సహజంగానే సలార్ మూవీపై అంచనాలు ఓ రేంజ్‌లో ఉంటాయి.. అయితే ఈ సినిమా షారుక్ ఖాన్ నటిస్తున్న డంకీ మూవీ రిలీజ్ అవుతున్న రోజే రిలీజ్ కానుండటంతో బాక్సాఫీస్ ద్గగర బిగ్ ఫైట్ ఉండనుండడం ఆసక్తికరంగా ఉంది. మరి డంకీ ప్రభావం సలార్‌పై ఏ రేంజ్‌లో ఉంటుందో అని ఆసక్తికరంగా మారింది.