Fukrey 3 OTT Release Date : బాలీవుడ్‌లో వచ్చిన పాపులర్ కామెడీ చిత్రాలలో ఫుక్రే ఒకటి కాగా, ఇప్పటికే రెండు భాగాలుగా వచ్చి మంచి విజయం సాధించిన చిత్రం రీసెంట్‌గా మూడో భాగం ఫుక్రే 3 అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలై మంచి విజయం సాధించి విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకుంది. ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా రూ.130 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇక థియేటర్‌లో అలరించిన ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది.ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రాన్ని స్ట్రీమ్ చేస్తున్నారు.
అమెజాన్ ప్రైమ్ తమ సోషల్ మీడియా వేదికగా ఫుక్రే 3 స్ట్రీమింగ్ అవుతున్న విషయాన్ని తెలియజేశారు. థియేటర్స్‌లో మిస్ అయినవారు ఓటీటీలో ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేయంచ్చు. ఇక ఇక మొదటి రెండు పార్ట్‌లలో లీడ్ రోల్స్ చేసిన రిచా చద్దా , పుల్కిత్ సామ్రాట్ ,వరుణ్ శర్మ , పంకజ్ త్రిపాఠి ఈ చిత్రంలో కూడా ప్రధాన పాత్రలు పోషించారు. మిర్ఘ్‌దీప్ సింగ్ లాంబా ఈ కామెడీ డ్రామాను డైరెక్ట్ చేశాడు. ప్రముఖ డైరెక్టర్ ఫర్హాన్ అక్తర్, రితేష్ సిద్వానీ కలిసి ఎక్సెల్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్ లో ఈ ఫుక్రే 3ని నిర్మించారు.

ఫుక్రే 3 చిత్రం కామెడీతో ఫుల్ కలెక్షన్స్ రాబట్టింది. లాజిక్ లు ఏమి వెతకకుండా జస్ట్ కామెడీని ఎంజాయ్ చేయాలి అంటే ఈ సినిమా చూడొచ్చు… 2 గంటల 30 నిమిషాల సినిమాలో చాలా సీన్స్ హాయిగా నవ్వేలా మెప్పించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా కూడా కుమ్మేస్తూ దూసుకుపోయింది. ఈ సినిమా సినిమా మొదటి రోజు 8.82 కోట్ల నెట్ కలెక్షన్స్ ని, రెండో రోజు 7.81 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకోగా మూడో రోజు మరింత జోరు చూపించి 11.67 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకుని 3 రోజుల్లో ఏకంగా 28.30 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకుంది.షారుక్ ఖాన్ నటించిన జవాన్ మూవీతో కలిసి సెప్టెంబర్ 7న ఈ సినిమా రిలీజ్ చేయాలని అనుకున్నారు. కాని డిసెంబర్ 1కి వాయిదా వేశారు. అనంతరం సెప్టెంబర్ 27న రిలీజ్ కావాల్సిన సలార్ వాయిదా పడటంతో సెప్టెంబర్ 28న చిత్రాన్ని రిలీజ్ చేశారు. మూవీకి మంచి ఆదరణ దక్కింది.