టాలీవుడ్ కి మెగాస్టార్ చిరంజీవి ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికీ చిరు హిట్లతో ఫ్లాప్ లతో సంబంధం లేకుండా దూసుకుపోతున్నాడు. కానీ ఒకప్పుడు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగి ఈ స్థాయికి ఎదిగారు చిరంజీవి. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చి ఇండస్ట్రీని ఏలుతున్న వారిలో మెగాస్టార్ చిరంజీవి మొదటి స్థానంలో ఉంటాడు. తన నటన, డాన్స్ లతో చిరంజీవి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. అయితే చిరంజీవి కెరీర్ ప్రారంభంలో మెగాస్టార్ చిన్న పాత్రలు చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సూపర్ స్టార్ కృష్ణ చిరంజీవిని ఎంతగానో ప్రోత్సహించారు.
కృష్ణ మరియు చిరంజీవి కాంబినేషన్ లో కొత్తల్లుడు, కొత్త పేట రౌడీ లాంటి సినిమాలు వచ్చాయి. అయితే ఈ సినిమాలలో చిరంజీవి చిన్న పాత్రలో నటించారు. 1980లో వీరిద్దరి కాంబినేషన్ లోనే తోడుదొంగలు సినిమా వచ్చింది. ఈ సినిమా మల్టీ స్టారర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆకట్టుకుంది. ఇక ఈ చిత్రం తర్వాత 1983 చిరంజీవి హీరోగా నటించిన ఖైదీ సినిమా విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. ఖైదీ చిత్రంతో చిరంజీవి ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయారు. ఇక ఖైదీ చిత్రంతో చిరంజీవి ఇండస్ట్రీలో ఫుల్ బిజీ అయ్యారు. అదే సమయంలో కృష్ణ ఒకవైపు రాజకీయాలలోను, మరోవైపు సినిమాలను బిజీగా ఉన్నారు.
1999లో చిరంజీవి కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో స్నేహం కోసం చిత్రంలో నటించారు. ఈ చిత్రంలో చిరంజీవికి జోడిగా మీనా హీరోయిన్ గా నటించారు. ఈ చిత్రంలో విజయ్ కుమార్, సుజాత, ప్రకాష్ రాజ్, కోటా శ్రీనివాసరావు, బ్రహ్మానందం, నిర్మలమ్మ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాలో ముఖ్య పాత్ర కోసం మొదటిగా సూపర్ స్టార్ కృష్ణను తీసుకోవాలని నిర్మాతలు భావించారట. స్నేహంకోసం సినిమాలో చిరంజీవి ద్విపాత్రాభినయంలో కనిపించారు. తండ్రి చిరంజీవి పక్కన నటించే స్నేహితుడుగా కృష్ణను తీసుకోవాలనుకున్నారట దర్శక నిర్మాతలు. ఇది సినిమాలో ప్రాముఖ్యత ఉన్న పాత్ర. కాబట్టి ఆ పాత్రలో నటిస్తే అభిమానులు హర్ట్ అవుతారని భావించిన కృష్ణ స్నేహం కోసం సినిమాలో నటించడానికి నో చెప్పారట. ఆ తర్వాత చిరంజీవి స్నేహితుడు పాత్రలో నటుడు విజయ్ కుమార్ ను తీసుకోవటం జరిగింది. ఇద్దరు ప్రాణ స్నేహితులు మధ్య స్నేహం అనేది ఎలా ఉంటుందో అని చూపించే కథాంశంతో ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…