Dhootha OTT : అక్కినేని హీరో నాగ చైతన్య చాలా రోజుల నుండి సినిమాల చేస్తున్నా కూడా మంచి కమర్షియల్ హిట్ అందుకోలేదు. చేసే ప్రతి సినిమాని ఎంతో డెడికేషన్‌తో చేస్తున్నా కూడా ఎందుకు హిట్ దక్కడం లేదు. అయితే ఇప్పుడు నాగ చైతన్య డిజిటల్ మీడియాలోకి అడుగుపెడుతున్నాడు. ‘ధూత’ అనే సూపర్ నేచురల్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఓటీటీ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాడు. ఈ సిరీస్ గురించి ఇప్పటికే ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల నవంబర్ 23న చైతూ పుట్టినరోజు సందర్భంగా ఈ సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేయగా, ఇది ప్రతి ఒక్కరిని అలరించింది.
తొలిసారి చైతూ వెబ్ సిరీస్ చేయడంతో ధూతను చూసేందుకు అక్కినేని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. డిసెంబర్ 1న థియేటర్లోకి రణ్ బీర్ కపూర్ యానిమల్ ల్ రానుండగా, దీనికి పోటీగా ధూత అనే వెబ్ సిరీస్ పోటీ పడడం విశేషం. అయితే ధూత గురించి దర్శకుడు విక్రమ్ కుమార్ తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు తెలియజేశారు. ధూత ఆలోచన ఎప్పటినుంచో ఉంది. నాగ చైతన్య గారికి చెప్పాను. ఆయనకి చాలా నచ్చంది. తర్వాత స్క్రీన్ ప్లే చేశాను. ఇది పెద్ద సవాల్. రైటింగ్ ప్రాసెస్ ని చాలా ఎంజాయ్ చేశాను. జర్నలిస్ట్ నేపథ్యంలో జరుగుతుంది. ధూత ఆలోచనకు ఎనిమిది ఎపిసోడ్లని హోల్డ్ చేసే బలం ఉంది. ధూత దాదాపు 240 దేశాల్లో ప్రసారం కానుంది. ధూత నాచురల్ జానర్ కాబట్టి ఈ రేంజ్‌లో విడుదల చేస్తున్నాం అని దర్శకుడు అన్నారు.

మనం’ చేసిన సమయంలోనే చైతుకి ఓ హారర్ కథ చెప్పగా, ‘హారర్ కథలు వద్దురా నాకు భయం అని అన్నారు. అయితే ‘దూత’ కథ మాత్రం తనకి చాలా నచ్చడంతో ఇప్పుడు మీ ముందుకు ఇలా వస్తుంది. చైతూ ఎప్పుడు గడ్డంతో ఉంటారు. అయితే ధూతలో క్లీన్ షేవ్ తో కనిపిస్తారు.ఆయన ఇందులో క్లీన్ షేవ్ లో కనిపిస్తా అని చెబుతూ లుక్ ఎలా ఉంటుందో అని అడిగారు. అలా ఒక ఫోటో పంపించారు. క్లీన్ షేవ్, మీసంలో చాలా అద్భుతంగా కనిపించారు. అదే లుక్ ని ఫిక్స్ అయ్యాం అని విక్రమ్ కుమార్ తెలియజేశారు.