వినోదం

Devil Movie Day 1 Collections : హిట్ టాక్ ద‌క్కించుకున్న డెవిల్.. ఎంత క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది అంటే..!

Devil Movie Day 1 Collections : నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా, నిర్మాత‌గా స‌త్తా చాటుతున్నాడు. ఆరంభంలో కమర్షియల్ సినిమాలు చేసిన అతడు.. కొంత కాలంగా ప్రయోగాలు చేస్తున్నాడు. ఇప్పుడు కల్యాణ్ రామ్ ‘డెవిల్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి టాక్ పాజిటివ్‌గానే వచ్చినా రెస్పాన్స్ మాత్రం ఆశించినట్లుగా రావట్లేదు. డిసెంబర్ 29న‌ థియేటర్లలోకి వ‌చ్చిన ఈ చిత్రం తొలి రోజు రూ.4.92 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబ‌ట్టింది. ఈ వివ‌రాల‌ని అభిషేక్ పిక్చర్స్ అధికారికంగా వెల్లడించింది. హిస్టారికల్ బ్లాక్‍బాస్టర్ అంటూ ఓ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఇండియాలోనే డెవిల్ మూవీ తొలి రోజు రూ.3.10 కోట్ల నెట్ కలెక్షన్ల రాబట్టిందని ట్రేడ్ నిపుణులు చెప్పుకొచ్చారు.

క‌ల్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘డెవిల్’ మూవీకి మొదటి రోజు ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. అయితే, రెండో రోజు అంతంత మాత్రంగానే కలెక్షన్లు సాధించింది. దీంతో రెండో రోజు ఈ చిత్రం తెలుగులో రూ. 1.70 కోట్లు షేర్ వసూలు చేసింది. వరల్డ్ వైడ్‌గా రూ. 2.20 కోట్లు రాబట్టింది. క‌ల్యాణ్‌రామ్ గ‌త సినిమా బింబిసార తొలిరోజు రూ.9 కోట్ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ను సొంతం చేసుకోగా.. ఆ సినిమా ద‌రిదాపుల్లోకి కూడా డెవిల్ నిల‌వ‌క‌పోవ‌డం విశేషం. ఇక సలార్ లాంటి మాస్ మ‌సాలా మూవీకి జ‌నాలు ఎక్కువ‌గా వెళుతుండడంతో ఆ సినిమా క‌లెక్ష‌న్లు డెవిల్ సినిమా డే 1 కలెక్షన్స్ పై ఇంపాక్ట్ చూపిన‌ట్టు చెబుతున్నారు.

Devil Movie Day 1 Collections

ఇక డెవిల్ చిత్రంలో బ్రిటిష్ నాటి సీక్రెట్ ఏజెంట్‌గా మెప్పించాడు. సినిమాలో క‌ళ్యాణ్ రామ్ ప‌ర్‌ఫార్మెన్స్‌కి మంచి మార్కులు ప‌డ్డాయి. . ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై దేవాంన్ష్ నామా సమర్పణలో అభిషేక్ నామా నిర్మించారు. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని ఇచ్చాడు. దీనిలో మాళవిక నాయర్, అజయ్, సత్య కీలక పాత్రలు పోషించారు.డెవిల్ ఒక స్పై థ్రిల్లర్ కాగా, మూవీ చాలా మంది ప్రేక్ష‌కుల‌కి మంచి వినోద‌మే పంచింది. రానున్న రోజుల‌లో ఈ మూవీ ఎలాంటి సంచ‌ల‌నాలు సృష్టిస్తుందో చూడాలి.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM