Devil Movie Day 1 Collections : నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా, నిర్మాతగా సత్తా చాటుతున్నాడు. ఆరంభంలో కమర్షియల్ సినిమాలు చేసిన అతడు.. కొంత కాలంగా ప్రయోగాలు చేస్తున్నాడు. ఇప్పుడు కల్యాణ్ రామ్ ‘డెవిల్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి టాక్ పాజిటివ్‌గానే వచ్చినా రెస్పాన్స్ మాత్రం ఆశించినట్లుగా రావట్లేదు. డిసెంబర్ 29న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం తొలి రోజు రూ.4.92 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. ఈ వివరాలని అభిషేక్ పిక్చర్స్ అధికారికంగా వెల్లడించింది. హిస్టారికల్ బ్లాక్‍బాస్టర్ అంటూ ఓ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఇండియాలోనే డెవిల్ మూవీ తొలి రోజు రూ.3.10 కోట్ల నెట్ కలెక్షన్ల రాబట్టిందని ట్రేడ్ నిపుణులు చెప్పుకొచ్చారు.
కల్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘డెవిల్’ మూవీకి మొదటి రోజు ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. అయితే, రెండో రోజు అంతంత మాత్రంగానే కలెక్షన్లు సాధించింది. దీంతో రెండో రోజు ఈ చిత్రం తెలుగులో రూ. 1.70 కోట్లు షేర్ వసూలు చేసింది. వరల్డ్ వైడ్‌గా రూ. 2.20 కోట్లు రాబట్టింది. కల్యాణ్‌రామ్ గత సినిమా బింబిసార తొలిరోజు రూ.9 కోట్ల వరకు వసూళ్లను సొంతం చేసుకోగా.. ఆ సినిమా దరిదాపుల్లోకి కూడా డెవిల్ నిలవకపోవడం విశేషం. ఇక సలార్ లాంటి మాస్ మసాలా మూవీకి జనాలు ఎక్కువగా వెళుతుండడంతో ఆ సినిమా కలెక్షన్లు డెవిల్ సినిమా డే 1 కలెక్షన్స్ పై ఇంపాక్ట్ చూపినట్టు చెబుతున్నారు.

ఇక డెవిల్ చిత్రంలో బ్రిటిష్ నాటి సీక్రెట్ ఏజెంట్‌గా మెప్పించాడు. సినిమాలో కళ్యాణ్ రామ్ పర్‌ఫార్మెన్స్‌కి మంచి మార్కులు పడ్డాయి. . ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై దేవాంన్ష్ నామా సమర్పణలో అభిషేక్ నామా నిర్మించారు. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని ఇచ్చాడు. దీనిలో మాళవిక నాయర్, అజయ్, సత్య కీలక పాత్రలు పోషించారు.డెవిల్ ఒక స్పై థ్రిల్లర్ కాగా, మూవీ చాలా మంది ప్రేక్షకులకి మంచి వినోదమే పంచింది. రానున్న రోజులలో ఈ మూవీ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.