Deepavali Movie OTT Release : కొన్ని సినిమాలలో స్టార్లు హీరోలు నటించకపోయిన, భారీ బడ్జెట్లు పెట్టకపోయిన.. పేరున్న దర్శకులు అవసరం లేకపోయిన.. కంటెంట్ కరెక్ట్ గా ఉంటే చాలు.. కటౌట్ నిలబడి పోతుంది. అలాంటి సినిమానే దీపావళి. రా వెంకట్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా నవంబర్ 11న థియేటర్లలో రిలీజ్ అయి మంచి విజయం సాధించింది. రియలిస్టిక్ ఎమోషన్స్‌తో తెరకెక్కిన దీపావళి సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రానికి పలు ఇంటర్‌నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో అవార్డులు కూడా దక్కాయి. డిసెంబర్ 15 నుంచి ఆహా ఓటీటీలో దీపావళి మూవీ స్ట్రీమింగ్ కానుంది.
తమిళంలో కిడా పేరుతో రిలీజైన ఈ చిత్రం ఇంటర్‌నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(ఇఫీ)లో ఇండియన్ పనోరమ విభాగంలో స్క్రీనింగ్‌కు ఎంపికైంది. మెల్‌బోర్న్, జాగరణ్‌తో పాటు పలు ఇంటర్‌నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో అవార్డులను గెలుచుకొని అందరి ప్రశంసలు అందుకుంది. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ , శ్రీ స్రవంతి మూవీస్ అధినేత ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన తొలి తమిళ సినిమా కు తెలుగు డబ్బింగ్ మూవీ ఇది. తమిళంలో రవికిషోర్ నటించిన కిడ కు తెలుగు అనువాదంగా దీపావళిని రూపొందించారు. చిత్ర కథ విషయానికి వస్తే.. శీనయ్య అనే పెద్దాయన ఓ గ్రామంలో ఉంటాడు..ఆయన కూతురు, అల్లుడు అల్లుడు ప్రమాదంలో మరణిస్తారు. అప్పటి నుంచి మనవడు గణేష్ ని అల్లారు ముద్దుగా ఆ పెద్దవాళ్లు పెంచుకుంటారు.

మనవడు అంటే ప్రేమ ఉన్నప్పటికీ..చాలా పేద కుటుంబం కావడంతో అడిగినది కొని ఇవ్వలేని పరిస్థితి శీనయ్యకి ఏర్పడుతుంది. అయితే దీపావళి పండక్కి మనవడు కొత్త డ్రస్ కొని ఇవ్వమని అడుగగా, ఎలాగైనా సరే డ్రస్ కొనాలి ని, తన మనవడి కోరిక తీర్చాలని బంధుమిత్రులను బ్రతిమలాడగా.. ఎక్కడా డబ్బు పుట్టదు. సరిగ్గా అదేటైమ్ లో .. దేవుడికి మోక్కిన మేకను అమ్మేయాలని నిర్ణియించుకుంటాడు. అయితే దేవుడి మేక కావడంతో.. ఎవరూ కొనరు.ఓ వ్యక్తి మాత్రం కొనడానికి వచ్చిన, అదే సమయంలో మేక తప్పించుకుంటుంది. మరి ఆ తర్వాత మేక దొరికిందా.. సీనయ్య పరిస్థితులు మారాయా అనేది మిగతా కథ.