Chiranjeevi : వెలుగుల పండుగ దీపావళి సందర్భంగా మెగా హీరో రామ్‌చరణ్ – ఉపాసన దంపతులు తమ ఇంట్లో గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. క్లింకార పుట్టిన తర్వాత తొలి దీపావళి కావడంతో ఈ పార్టీని భారీ ఎత్తునే చేశారు. ఈ వేడుకలకు మెగా, అల్లు కుటుంబాలతోపాటు టాలీవుడ్ స్టార్ మహేశ్ బాబు, ఎన్టీఆర్, వెంటకేశ్ తమ కుటుంబాలతో వేడుకలకు హాజరై సందడి చేశారు. జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్, విక్టరీ వెంకటేష్ కలిసి దిగిన పిక్ బయటకు వచ్చింది. అలానే చిరు, వెంకీ, నాగ్ కలిసి దిగిన ఫొటో కూడా అందరిని ఆకర్షించింది. బన్నీ, వెంకటేష్ పిక్ కూడా వైరల్ అయింది.
మరోవైపు హీరోల సతీమణులు కూడా కలిసి ఫోటోలు దిగగా ఈ పిక్స్ నెట్టింట తెగ హల్‌చల్ చేశాయి. ఇక తాజాగా చిరంజీవికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. పార్టీలో తన క్రేజీ డ్యాన్స్‌తో అతిథులను ఆకట్టుకున్నారు మెగాస్టార్ చిరు. ప్రముఖ ఇండియన్ ర్యాప్ గాయని రాజకుమారి ‘జవాన్’ చిత్రంలోని టైటిల్ సాంగ్ ఆలపిస్తుండగా.. చిరు తనదైన స్టైల్లో స్టెప్పులేసి అలరించారు. తనయుడు ప్రోత్సహించగా చిరంజీవి యంగ్ జనరేషన్‌కు ఏ మాత్రం తగ్గకుండా ఫుల్ జోష్‌తో డ్యాన్స్ చేయడం హైలైట్ అయింది. ఇప్పుడు చిరు చేసిన డ్యాన్స్‌కి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన మెగా అభిమానులు చిరు డ్యాన్స్‌కు ఫిదా కాకుండా ఉండలేకపోతున్నారు.

దీపావళి పర్వదినం సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీలో టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన భార్య ప్రణతీతో కలిసి ఈ పార్టీలో మెరిశారు. అదేవిధంగా మరోస్టార్ జంట మహేశ్ బాబు -నమ్రత కలిసి సంది చేశారు. పార్టీకి సంబంధించిన ఫొటోలను నమ్రత సోషల్ మీడియాలో పోస్టు చేయగా, ఆ పిక్స్ తెగ వైరల్ అయ్యాయి. ఇక ఇదిలా ఉంటే ఇటీవలి కాలంలో చిరంజీవి చిత్రాలు అభిమానులకు వందశాతం ఉత్సాహపరచలేదు అనే చెప్పాలి. ఒకపక్క ఆయన వయస్సు హీరోలు అయినా రజినీకాంత్, కమల్ హాసన్, బాలకృష్ణ సూపర్ హిట్లతో దూసుకుపోతూ ఉంటే.. చిరంజీవి మాత్రం రొటీన్ కథలతో ఫ్యాన్స్‌ని నిరాశపరిచాడు. ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో సినిమా చేస్తుండగా, ఈ సినిమాతో మంచి హిట్ తన ఖాతాలో వేసుకోవాలని అనుకుంటున్నాడు.
#Chiranjeevi and #RamCharan on Jawan title track #SRK𓃵 🔥 pic.twitter.com/BcOMRkGw7P
— vikram era (@sidsh122) November 14, 2023