Chandramukhi 2 TV Premiere : రజనీకాంత్ హీరోగా రూపొందిన చంద్రముఖి చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ మూవీ లో నయన తార హీరోయిన్ గా నటించగా… పి వాసు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో ప్రభు , జ్యోతిక కీలక పాత్రలలో నటించగా … నాజర్ , వడివేలు ఈ మూవీ లో ముఖ్యమైన పాత్రలలో నటించారు. ఈ సినిమాకి సీక్వెల్‌గా టాలెంటెడ్ యాక్టర్ కమ్ కొరియోగ్రాఫర్ రాఘవా లారెన్స్ హీరోగా చంద్రముఖి 2 చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో కంగనా రనౌత్ టైటిల్ రోల్ పోషించింది. పీ వాసు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో సెప్టెంబర్ 28న థియేటర్లలో సందడి చేసింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఇంప్రెస్ చేయలేకపోయింది.
చంద్రముఖి 2 సినిమాకు భారీ కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కలేదు. ఇకపోతే ఆ తర్వాత ఈ సినిమా ఓటీటీ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మాత్రం పరవాలేదు అనే స్థాయిలో ప్రేక్షకులను అలరించింది. ఇక ఇప్పుడు ఈ చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌కి సిద్ధమైంది. చంద్రముఖి 2 తెలుగు వెర్షన్ 2023 డిసెంబర్ 31న సాయంత్రం 6 గంటలకు జెమినీ టీవీలో ప్రీమియర్ కానుండగా.. తమిళ వెర్షన్ 2024 జనవరి 1న సాయంత్రం 06:30 గంటలకు సందడి చేయనుంది. ఇంకేంటి ఈ చిత్రాన్ని థియేటర్లలో మిస్సయిన వారు టీవీలో చూసి ఎంజాయ్ చేయవచ్చు.
సుబాస్కరన్ సమర్పణలో చంద్రముఖి2 చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. చంద్రముఖి 2లో లక్ష్మీమీనన్, మహిమ నంబియార్, రాధికాశరత్‌కుమార్, రావు రమేశ్, రవిమారియా, విఘ్నేశ్, సృష్టి డాంగే, సుభిక్ష, ఐజీ మహేంద్రన్, సాయి అయ్యప్పన్, సురేశ్ మీనన్, శత్రు టీఎం కార్తీక్ కీలక పాత్రల్లో నటించారు. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ బోల్తా కొట్టడంతో కేవలం సుమారు రూ.40కోట్ల కలెక్షన్‍లను మాత్రమే రాబట్టినట్టు సమాచారం. మరి థియేటర్స్,ఓటీటీలో అంతగా అలరించలేకపోయిన
ఈ చిత్రం టీవీ ప్రేక్షకులని ఎంతగా అలరిస్తుందనేది చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…