Dark Elbows : కొబ్బరి నూనె వలన, అనేక ఉపయోగాలు ఉన్నాయి. కొబ్బరి నూనె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పైగా, కొబ్బరి నూనె చర్మ ఆరోగ్యానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. కొబ్బరి నూనెతో మనం, వివిధ రకాల ప్రయోజనాలని పొందవచ్చు. కొబ్బరినూనె మసాజ్ చేయడానికి వాడితే, చక్కటి ఉపయోగాలు ఉంటాయి. ముఖంపై, చిన్న మొటిమలు, మచ్చలు వచ్చినా కూడా కొబ్బరి నూనె వాటిని వదిలేస్తుంది. మనం అందానికి ఏవేవో క్రీములు వాడక్కర్లేదు. చాలామంది, రకరకాల క్రీములను, ఫేస్ మాస్కులను వాడుతూ ఉంటారు.
అలా కాకుండా, మనం ఇంటి చిట్కాలతో అందమైన చర్మాన్ని పొందవచ్చు. చర్మం గరుకుగా వున్నా, నల్లగా వున్నా కొబ్బరి నూనె చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కొంతమంది, మోచేతులు బాగా నల్లగా ఉంటాయి. మోచేతులు నల్లగా ఉన్నట్లయితే, ఇలా చేయడం మంచిది. పాలు, పసుపుతో మనం మోచేతుల్ని తెల్లగా మార్చుకోవచ్చు. పాలు, పసుపుని సమాన పరిమాణంలో తీసుకోవాలి. దీనిని మోచేతులకి రాసి, మృదువుగా మర్దన చేయాలి.
పావుగంట తర్వాత కడిగేయాలి. వారానికి రెండు సార్లు ఇలా చేస్తే, మోచేతులు తెల్లగా వస్తాయి. నిమ్మరసం కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. నిమ్మరసం రాస్తే, స్కిన్ తెల్లగా వస్తుంది. నిమ్మ చెక్క పై కొద్దిగా ఉప్పు వేసి, మోచేతులపై రుద్దాలి. ఆ తర్వాత క్లీన్ చేసేసుకోవాలి.
ఇలా చేస్తే, ఈజీగా మోచేతులు తెల్లగా వస్తాయి. కొబ్బరి నూనెలో అర టీ స్పూన్ నిమ్మరసం వేసి, బాగా కలిపి ఈ మిశ్రమాన్ని మోచేతులకు రాసుకుని 15 నుండి 20 నిమిషాల పాటు మర్దన చేయాలి. ఆ తర్వాత టిష్యూ పేపర్ తో తుడిచేయండి. ఇలా చేస్తే, మోచేతుల మీద ఉన్న నలుపు ఈజీగా పోతుంది. చూశారు కదా మోచేతులు నల్లగా ఉన్నట్లయితే ఎలా వదిలించుకోవచ్చు అనేది. ఈసారి ఇలా చేసి మోచేతుల్ని తెల్లగా మార్చుకోండి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…