Bigg Boss 5 : బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమం మరో వారం రోజులలో ముగియనుంది. శనివారం ఎపిసోడ్‌లో శుక్రవారం జరిగిన కొన్ని గొడవలు చూపిస్తూ ఆ తర్వాత అపాచీ గేమ్ ఆడించారు. ఈ గేమ్‌లో కాజల్ సంచాలకురాలిగా ఫెయిల్ కావడంతో సిరి ఆమెను రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. ఇక నాగార్జున ఎప్పటి మాదిరిగానే హౌస్‌మేట్స్‌తో ఓ ఇంట్రస్టింగ్ గేమ్ ఆడించాడు.
ఈ పద్నాలుగో వారాల్లో సంతోషపెట్టిన క్షణాలతోపాటు, బాధపడ్డ రోజులు, రిగ్రెట్‌గా ఫీలైన సంఘటనలు ప్రతి ఒక్కరికీ ఉండే ఉంటాయని, ఈ జర్నీలో ఏ వారంలో మీకు రిగ్రెట్ ఉందో చెప్పాలన్నాడు నాగ్. మొదటగా కాజల్ మాట్లాడుతూ.. ‘9వ వారంలో జైలు నామినేషన్ జరిగింది. అప్పుడు సన్నీ, మానస్‌ను సేవ్ చేసే అవకాశం ఉన్నప్పటికీ వాళ్లను చేయలేదు. అని చెప్పుకొచ్చింది.
షణ్ను మాట్లాడుతూ.. ‘ఎమోషనల్ కనెక్ట్ పెద్ద రిగ్రెట్. 11వ వారంలో నా వల్ల సిరి తలబాదుకోవడం నచ్చలేదు. 14వ వారం టాప్ 5 గురించి మరీ ఎక్కువగా ఆలోచించాను అని చెప్పుకొచ్చాడు. సన్నీ .. ’12వ వారంలో నేను అగ్రెసివ్ అయి గేమ్ ఆడాను. దీనివల్ల సిరి ఐస్‌బకెట్‌లో నుంచి కాళ్లు తీయకుండా ఆడింది. మరొకటి గిల్టీబోర్డు వేసుకున్నది కూడా మర్చిపోలేను’ అని తెలిపాడు. మానస్.. ‘4వ వారంలో కెప్టెన్సీ కోసం బరువు తగ్గాం, చాలా కష్టపడ్డాం. అప్పుడు సన్నీ, నేను ఇద్దరిలో ఎవరు కెప్టెన్సీకి పోటీపడాలా అని ఆలోచించుకున్నాక సన్నీకి అవకాశమిచ్చాను. నా వల్ల సన్నీకి ఎక్కువ కత్తి పోట్లు పడ్డాయని అన్నాడు.
శ్రీరామ్.. ‘4వ వారంలో ఎవరి వంట వాళ్లు వండుకోవాలి అన్న గొడవ జరిగింది. ఆ తర్వాత నేను చాలా డల్ అయ్యాను. ఎక్కువ తప్పు జరిగిపోయిందా ? నావల్లే ఇంట్లో గొడవలు మొదలయ్యాయా ? అని తెగ ఆలోచించి డిస్టర్బ్ అయ్యాను’ అని పేర్కొన్నాడు. సిరి.. 11వ వారంలో షణ్నుతో గొడవపడి తల బాదుకోవడం తప్పనిపించిందని చెప్పుకొచ్చింది. అనంతరం నాగ్ మరో గేమ్ ఆడించాడు. ఈ పద్నాలుగువారాలను పరిగణనలోకి తీసుకుని ఎవరు హిట్ స్టార్ ? ఎవరు ఫ్లాప్ స్టార్ ? చెప్పాలన్నాడు.
ముందుగా కాజల్.. సన్నీకి హిట్ స్టార్, షణ్నుకి ఫ్లాప్ స్టార్ అన్న ట్యాగ్‌నిచ్చింది. శ్రీరామ్.. సన్నికీ హిట్, కాజల్‌కు ఫ్లాప్ స్టార్ బిరుదునిచ్చాడు. సన్నీ.. మానస్‌కు హిట్, షణ్నుకి ఫ్లాప్ స్టార్ అన్న ట్యాగ్‌నిచ్చాడు. కానీ పద్నాలుగు వారాలను పరిగణనలోకి తీసుకోవాలని నాగ్ గుర్తు చేయగానే ఆ ఫ్లాప్ స్టార్ ట్యాగ్‌ను షణ్నుకి కాకుండా సిరికిచ్చాడు. తర్వాత సిరి.. షణ్నును హిట్, సన్నీని ఫ్లాప్ స్టార్‌గా పేర్కొంది. మానస్.. సన్నీకి హిట్, షణ్నుకు ఫ్లాప్ స్టార్ ట్యాగ్ ఇచ్చాడు. షణ్ముఖ్.. సిరికి హిట్, కాజల్‌కు ఫ్లాప్ స్టార్ బిరుదునిచ్చాడు.
అనంతరం సన్నీని సెకండ్ ఫైనలిస్టుగా ప్రకటించారు. తర్వాత హౌస్‌మేట్స్‌ను మరోసారి 1 నుంచి 6 ర్యాంకుల వరకు నిల్చోమన్నాడు నాగ్. మగవాళ్లు అందరు టాప్ స్థానం మాదే అంటే లేడీస్ ఇద్దరు రెండో స్థానంలో నిలుచున్నారు. అయితే నాగ్ హెచ్చరికలతో ఫస్ట్ ర్యాంక్‌పై వెళ్లి నిలుచుంది సిరి. ఆ తర్వాత శ్రీరామ్, కాజల్, షణ్ముఖ్, సన్నీ, మానస్ తర్వాతి స్థానాలలో నిలుచున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…