Bigg Boss 5 : బుల్లితెర ప్రేక్షకులని అలరిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం నేడు ఫినాలే జరుపుకోనుంది. ఈ కార్యక్రమంలో విజేత ఎవరు, రన్నరప్ ఎవరు.. అనే అంశాలపై ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి. పలు వార్తల నడుమ తాజాగా ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. అనూహ్యంగా బిగ్ బాస్ నుండి రూ. 25 లక్షలు తీసుకొని శ్రీరామ్ తప్పుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
బిగ్ బాస్ సీజన్ 4 ఫైనల్ కి చేరిన సోహైల్ అందరికీ షాకిస్తూ టైటిల్ రేసు నుండి తప్పుకున్న విషయం తెలిసిందే. ఆ సీజన్ లో అభిజిత్, అఖిల్, సోహైల్, అరియానా, హారిక ఫైనల్ లో పోటీపడ్డారు. హారికకు 5వ స్థానం, అరియానాకు 4వ స్థానం దక్కింది. టైటిల్ కోసం అభిజిత్, అఖిల్, సోహైల్ మధ్య పోటీ నెలకొంది. ఆ సమయంలో నాగార్జున రూ. 25 లక్షలు ఆఫర్ చేశారు. ఈ ఆఫర్ ని సోహైల్ తీసుకున్నాడు.
ఈసారి సింగర్ శ్రీరామ్ ఆ ఆఫర్‌ను తీసుకున్నట్లు వినికిడి. సిరి, మానస్ 4,5 స్థానాలతో ఎలిమినేట్ కాగా.. టైటిల్ కోసం సన్నీ, షణ్ముఖ్, శ్రీరామ్ పోటీపడ్డారట. ఈ క్రమంలో నాగార్జున టైటిల్ దక్కుతుందని నమ్మకం లేనివారు ఎవరైనా ఒకరు.. రూ. 25 లక్షలు తీసుకొని రేసు నుండి తప్పుకోవాలని సూచించగా.. శ్రీరామ్ డబ్బులు తీసుకొని టైటిల్ రేసు నుండి తప్పుకున్నట్లు సమాచారం. దీంతో సన్నీ, షణ్ముఖ్ ఫైనల్ కి చేరారు. నేటి గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కి గెస్ట్స్ గా రామ్ చరణ్, అలియా భట్, శ్యామ్ సింగరాయ్ టీమ్ గెస్ట్స్ గా రానున్నట్లు తెలుస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…