అందం, అభినయంతో పాటు తన నాట్యంతోను ఎంతో మంది ప్రేక్షకుల మనసులని కొల్లగొట్టిన అలనాటి నటి భానుప్రియ. నాట్యంలో కెమెరాకి సైతం దొరకని ఆమె వేగం గుర్తొస్తుంది. ఆ మధ్య కేరక్టర్ ఆర్టిస్టుగా కూడా చేసిన భానుప్రియ ఈ మధ్య కాలంలో మాత్రం సినిమాలలో పెద్దగా కనిపించడం లేదు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ లాంటివారు అగ్ర హీరోలుగా కొనసాగుతున్న సమయంలో చాలా మంది హీరోయిన్స్ తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి తనదైన నటనతో అగ్ర హీరోయిన్ గా గుర్తింపు పొందగా అలాంటి వాళ్ళలో రాధిక, రాధ, విజయశాంతి , భానుప్రియ లాంటి వారు ఉన్నారు.
సినిమాల్లో మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న భానుప్రియ వెంకటేష్ తో కె విశ్వనాథ్ గారు తీసిన స్వర్ణకమలం సినిమాలో హీరోయిన్ గా నటించి ఆ సినిమాలో తను చేసిన క్లాసికల్ డాన్స్ కి మంచి పేరు ప్రఖ్యాతలు పొందింది..ఒక విధంగా చెప్పాలంటే ఆ సినిమా మొత్తం భానుప్రియ గారి పాత్ర మీద ఆధారపడి ఉంటుంది అలాంటి పాత్రలో అలవోకగా నటించి మంచి మార్కులు కొట్టేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.”మావారు చనిపోయినప్పటి నుంచి మెమరీ లాస్ అయ్యాను. డైలాగ్స్ కూడా గుర్తుండటం లేదు. డాన్స్ కి సంబంధించిన ముద్రలు కూడా గుర్తుండటం లేదు. అందువల్లనే డాన్స్ స్కూల్ పెట్టాలనే ఆలోచనను కూడా విరమించుకున్నాను అని చెప్పుకొచ్చింది.
ప్రస్తుతానికి అందుకు సంబంధించి మెడిసిన్స్ తీసుకుంటున్నాను అని భానుప్రియ అన్నారు. ఇక మావారు చనిపోవడానికి ముందు నేను .. ఆయన విడిపోయినట్టుగా వార్తలు వచ్చాయి. వాటిలో ఎంతమాత్రం నిజం లేదు. ఆయన ఇక్కడికి వస్తుండేవారు .. నేను అక్కడికి వెళుతూ ఉండేదానిని. విడివిడిగా ఉండేవారమనేది పుకారు మాత్రమే. ప్రస్తుతం మా అమ్మాయి అభినయం లండన్ లో చదువుతోంది. తనకి సినిమాల వైపు వచ్చే ఆలోచన లేదు అంటూ భానుప్రియ చెప్పుకొచ్చింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…