కమెడీయన్ నుండి నిర్మాతగా మారిన బండ్ల గణేష్ కొద్ది రోజుల పాటు రాజకీయాలలో ఉన్నారు. ఆ తర్వాత రాజకీయాలకు కూడా స్వస్తి పలికి ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. అయితే పవన్ భక్తుడిగా చెప్పుకునే బండ్ల గణేష్ అప్పుడప్పుడు వివాదాస్పద కామెంట్స్ తో వార్తలలో నిలుస్తూ ఉంటాడు. అయితే బండ్ల గణేష్ నేరుగానే పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయడంతో ఫ్యాన్స రెచ్చిపోయారు. రీసెంట్‌గా పవన్ కళ్యాణ్ అన్ స్టాపబుల్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలయ్య గబ్బర్ సింగ్ మూవీ రెమ్యూనరేషన్ గురించి అడిగారు.
నిర్మాతగా ఉన్న బండ్ల గణేష్ రెమ్యూనరేషన్ ఎంత ఇచ్చాడని అడగగా, దానికి పవన్ ”నేను అనుకున్నంత ఇవ్వలేదు తాను ఇవ్వాలనుకున్నంత ఇచ్చాడు” అని సమాధానం ఇచ్చాడు.. గబ్బర్ సింగ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా పవన్ మార్కెట్ ప్రకారం పూర్తి రెమ్యూనరేషన్ చెల్లించలేదని, ఈ కారణంతోనే పవన్ బండ్ల గణేష్ తో మూవీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదనే ప్రచారం తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో బండ్ల గణేష్ పై సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ ఎక్కువయ్యాయి.. ఓ నెటిజన్ బండ్ల గణేష్ కి మద్దతుగా ట్వీట్ వేశారు.
నువ్వు ఆయన్ని దైవంలా భావిస్తావు. ప్రేమిస్తావు. ఆయనేమో ఒక పబ్లిక్ షోలో నీ పరువు తీసేశాడంటూ ట్వీట్ చేయగా, దానికి బండ్ల గణేష్ ”నా విశ్వరూపం చూపిస్తా…” అని ఫైర్ ఎమోజీలు పోస్ట్ చేశారు. పవన్ చేసిన అవమానానికి ప్రతీకారం తీర్చుకుంట్లా అన్నట్లు ఆయన కామెంట్ చేయడంతో పవన్ అభిమానులు రెచ్చిపోతూ బండ్ల గణేష్‌ని ఏకి పారేస్తున్నారు. కొన్నాళ్లుగా పవన్ కళ్యాణ్ బండ్ల గణేష్‌ని దూరం పెట్టినట్టు తెలుస్తుంది. భీమ్లా నాయక్ ఆడియో ఫంక్షన్ కి బండ్ల గణేష్‌కి ఆహ్వానం అందని కారణంగా త్రివిక్రమ్ పై దారుణమైన కామెంట్స్ చేశారు. ఈ సమయం నుండే పవన్ .. బండ్లని దూరం పెట్టి నట్టు తెలుస్తుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…