Silk Smitha : భారతీయ సినిమా పరిశ్రమలోని గొప్ప నర్తకీమణుల్లో సిల్క్ స్మిత ఒకరు అనే విషయం తెలిసిందే. అప్పట్లో తెలుగు, తమిళ సినిమాల్లో లెక్కలేనన్ని సినిమాలు చేసిన తెలుగమ్మాయి అశేష ప్రేక్షకాదరణ పొందింది. జ్యోతిలక్ష్మి, జయమాలిని తర్వాత అంతటి పేరు తెచ్చుకున్న ఈమె ఓ తరం కుర్రకారుని ఉర్రూతలూగించింది. కైపెక్కించే మాటలు, మత్తెక్కించే చూపులతో ఓ వర్గం ప్రేక్షకులకు ఆరాధ్య దేవత అయిపోయారు సిల్క్. కెరీర్‌లో ఎంతో ఎత్తుకు వెళ్లి.. పేరు ప్రఖ్యాతలు సంపాదించి.. చివరికి బలవన్మరణానికి పాల్పడిన స్మిత ఈ లోకాన్ని వీడి 27 ఏళ్లు పూర్తయినా ఇప్పటికీ ఆమెను ప్రేక్షకులు గుర్తుచేసుకుంటూనే ఉంటారు.
1980లో డాన్సర్ గా ఆమె ఓ తరం ప్రేక్షకులను ఉర్రూతలూగించిన సిల్క్ తన అందచందాలతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. బడా హీరోలతో కలిసి వెండితెరపై మెరిసి సంచలనాలు సృష్టించింది. ఈరోజు సిల్క్ స్మిత జయంతి కావడం విశేషం. 1960 డిసెంబర్ 2న ఆమె జన్మించారు. నేడు ఆమె 63వ జయంతి. దీంతో సోషల్ మీడియాలో అభిమానులు ఆమె గుర్తు చేసుకుంటున్నారు. ఈవిడ జీవితంపై బాలీవుడ్‌లో డర్టీ పిక్చర్ అనే చిత్రం రూపొందగా, ఈ సినిమా ఎంత ప్రజాదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ రోజు ఆమె జయంతి సందర్భంగా ‘సిల్క్ స్మిత: ది అన్‌టోల్డ్ స్టోరీ’ సినిమాను ప్రకటించారు. అంతేకాదు, ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు.
ఈ బయోపిక్‌లో సిల్క్ స్మిత పాత్రను చంద్రికా రవి పోషిస్తుంబడగా, ఆమె భారత సంతతికి చెందిన ఆస్ట్రేలియన్ మోడల్, నటి . ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన చంద్రికా రవి.. ఈ ఏడాది బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ సినిమాలో కనిపించారు. ‘మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే’ పాటలో బాలయ్యతో ఆడిపాడారు.ఫస్ట్ లుక్ పోస్టర్‌లో చంద్రికా రవి చాలా బాగున్నారు. సిల్క్ స్మితకు ఆమెకు పోలిక లేకపోయినా.. స్మితను రీ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. ఒ ఈ సినిమాకు జయరాం దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్‌బీ విజయ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలకానున్న ఈ సినిమా వచ్చే ఏడాది థియేటర్లలోకి వస్తుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…