Animal Telugu Collections : బాలీవుడ్‌లో తెరకెక్కే ఎన్నో సినిమాలకు సైతం దేశ వ్యాప్తంగా హైప్ లభిస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ మధ్య కాలంలో చాలా చిత్రాలు టాలీవుడ్‌పైన కూడా ప్రభావాన్ని చూపించగా, తెలుగు డైరెక్టర్ తెరకెక్కించిన ‘యానిమల్’ కూడా గత వారంలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చి అతి పెద్ద విజయం సాధించింది. రణ్‌బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా తీసిన యానిమల్ సినిమాను టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భూషన్ కుమార్, క్రిషన్ కుమార్, మురాద్, ప్రణయ్ రెడ్డి వంగాలు నిర్మించారు. దీనికి ప్రీతమ్, విశాల్ మిశ్రా, హర్షవర్దన్ రామేశ్వర్ మ్యూజిక్ ఇచ్చారు. ఇందులో రష్మిక హీరోయిన్‌గా.. అనిల్ కపూర్, బాబీ డియోల్, శక్తి కపూర్ కీలక పాత్రల్లో కనిపించారు.
డిసెంబర్ 1న విడుదలైన యానిమల్ చిత్రం మూడు రోజుల క్రితం విడుదలై మొదటి రోజు కన్నామిగతా రెండు రోజులు ఎక్కువ వసూళ్లను రాబట్టుకొని సెన్సేషన్ సృష్టించింది.నిర్మాతల లెక్కల ప్రకారం యానిమల్ మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 356కోట్ల వసూళ్లను రాబట్టుకుంది.ఇందులో దేశ వ్యాప్తంగా 200కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. ఓవరాల్‌గా తెలుగు వెర్షన్ 25 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉన్నట్లు చెబుతోన్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో యానిమల్ చిత్రం మూడు రోజుల్లో 35 కోట్లకుపైగా గ్రాస్‌ను, 19 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాను దాదాపు 14 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో తెలుగులో నిర్మాత దిల్‌రాజు రిలీజ్ చేయగా, ఆయనకు. మూడు రోజుల్లో ఐదు కోట్ల వరకు లాభాలు వచ్చాయి.
యానిమల్ చిత్రం ఇదే జోరు కొనసాగిస్తే ఈ మూవీ ఫుల్ రన్ లో 1000కోట్ల క్లబ్ లో చేరడం పెద్ద కష్టమేమి కాకపోవచ్చు. తండ్రి కొడుకుల కథ తో తెరకెక్కిన ఈసినిమాలో రష్మిక మందన్న కథానాయకిగా నటించగా అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రల్లో కనిపించారు.అర్జున్ రెడ్డి తో మేకింగ్ విషయంలో తనదైన ముద్ర వేసిన సందీప్ రెడ్డి ఈయానిమల్ ను మరింత బోల్డ్ గా తీసి సెన్సేషన్ సృష్టించాడు. అర్జున్ రెడ్డిని మించిన బోల్డ్ సీన్స్ ఇందులో ఉండగా, ఈ సినిమా యూత్‌కి మంచి కిక్ ఇచ్చింది. కాని ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…