Anasuya : అందాల ముద్దుగుమ్మ అనసూయ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. జబర్ధస్త్ షోతో ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్న అనసూయ ఆ తర్వాత సినిమాలు, టీవీ షోలతో తెగ క్రేజ్ దక్కించుకుంది. ఈ మధ్య ప్రేక్షకులకు షాకిస్తూ షోల నుంచి బయటకు వచ్చేసింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం సినిమాలపై కాన్సట్రేషన్ చేస్తున్న అను.. ఫ్యామిలీ లైఫ్ కూడా సంతోషంగానే గడుపుతుంది.అనసూయ 2010లో సుశాంక్ భరద్వాజ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. అనసూయ ఫ్యామిలీతో ఎంతలా టైమ్ స్పెండ్ చేస్తారో తెలిసిందే. భర్త, పిల్లలను చాలా జాగ్రత్తగానూ చూసుకుంటూ అలానే ఇటు కేరీర్ పైనా శ్రద్ధ వహిస్తున్నారు.
ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే అనసూయ.. ఈ రోజు వాలెంటైన్స్ డే సందర్భంగా ఒక ఆసక్తికరమైన పోస్టును పంచుకున్నారు. వర్కౌట్ దుస్తుల్లో భర్తతో కలిసి అద్దం ముందు క్యూట్ గా సెల్ఫీ ఇచ్చిన పోజుకి సంబంధించిన ఫొటోను షేర్ చేస్తూ తన భర్తతో జీవితం అద్భుతంగా ఉందని తెలిపారు. ‘మీతో జీవితం ఒక క్రేజీ రోలర్ కోస్టర్ రైడ్ లా ఉంది సుశాంక్ భరద్వాజ్’ అంటూ భర్తకు తెలియజేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. అనసూయ పోస్ట్‌కి అభిమానుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది.

ప్రస్తుతం అనసూయ నటిగా ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. క్షణం, రంగస్థలం, పుష్ప చిత్రం ద్వారా తన పెర్ఫామెన్స్ తో అదరగొట్టిన ఈ అమ్మడు వరుసగా అవకాశాలు అందుకుంటున్నారు. రీసెంట్ గా ‘మైఖేల్’లో నటించారు. ప్రస్తుతం ‘పుష్ఫ : ది రూల్’, ‘రంగమార్తండ’లో నటించారు. అయితే సినిమాల షూటింగ్స్‌కు టైమ్ అడ్జస్ట్ చేయలేకే జబర్దస్త్ మానేసానని అనసూయ ముందు చెప్పింది. కానీ ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో వేరే రీజన్ చెప్పింది.తన ఇద్దరు పిల్లలు పెద్దవాళ్లు అవుతున్నారని, వాళ్లతో టైమ్ స్పెండ్ చేయలేకే జబర్దస్త్ మానేశానని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా వారు పెద్దయ్యాక ఈ షోలో నాపై సెటైర్లు వేస్తూ మాట్లాడిన మాటలు వింటే నొచ్చుకుంటారనే ఉద్దేశంతో బయటకు వచ్చేశానని అను తన సోషల్ మీడియా ద్వారా వివరించింది.