Amani : తెలుగు సినీ ప్రేక్షకులకి పరిచయం అక్కర్లేని పేరు ఆమని. ఎంతో మంది స్టార్ హీరోలతో, ఎన్నో వైవిధ్యమైన సినిమాలతో అలరించిన ఆమని ఇప్పుడు సీరియల్స్‌లో కూడా నటిస్తుంది. ఆమని ఫ్యామిలీ నుంచి ఒకరు హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఆమని మేనకోడలు హ్రితక శ్రీనివాస్ హీరోయిన్‌గా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అల్లంత దూరాన సినిమాతో హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన హ్రితిక ఇప్పుడు సౌండ్ పార్టీ మూవీతో రానుంది. సంజయ్ శేరి దర్శకత్వంలో బిగ్ బాస్ విన్నర్ వీజే సన్నీ, హ్రితిక శ్రీనివాస్ హీరోహీరోయిన్స్‌గా తెరకెక్కిన మూవీ సౌండ్ పార్టీ. శివన్నారాయణ, అలీ, సప్తగిరి, థర్టీ ఇయర్స్ పృథ్వి, ‘మిర్చి’ ప్రియ తదితరులు ఇతక కీలక పాత్రలు పోషించారు.
ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్ పతాకంపై రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్‌కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో అంచనాలు పెరిగాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ.. నవంబర్ 24వ తేదీన గ్రాండ్‌గా థియేటర్లలో సందడి మొదలు పెట్టనుంది. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా హీరోయిన్ హ్రితిక శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. తెలుగులో కంటే తమిళంలో క్యాస్టింగ్ కౌచ్ ఎక్కువగా ఉండేదని.. తను ఫేస్ చేశానని చెప్పారు ఆమని. కలర్ తక్కువగా ఉండటం తో తనను చాలా సినిమాలకు తీసుకుంటామని ముందు చెప్పి.. ఆ తరువాత రిజెక్ట్ చేసేవారని.. దాంతో చాలా సార్లు బాధపడ్డానన్నారు.
రంగు చూసి తనకు టాలెంట్ ఉందో లేదో అనే అనుమానంతో మళ్లీ పిలుస్తామని చెప్పి పంపించేసేవారని ఆ విషయం తనను ఎంతగానో బాధించేదని ఆమని గుర్తు చేసుకున్నారు. సీనియర్ నటి ఆమని మా అత్త కావడంతో తనకు సినిమాలపై ఆసక్తి పెరిగిందని తెలిపింది హ్రితిక. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కొన్ని సినిమాల్లో యాక్ట్ చేశానని.. హీరోయిన్‌గా తెలుగులో తనకు ఇది రెండో సినిమా అని చెప్పింది. అల్లంత దూరాన మూవీ తరువాత సౌండ్ పార్టీలో నటించానని తెలిపింది. “డైరెక్టర్ సంజయ్ స్టోరీ ఎక్సైటింగ్‌గా అనిపించింది.
ఇది పూర్తిగా ఫన్ ఎంటర్టైనర్ జోనర్. మూవీలో కామెడీ తోపాటు కంటెంట్ కూడా ఉందని పేర్కొంది, అయితే అప్పట్లో ఆమని చాలా వేధింపులకి గురయ్యేదట. టూ పీసెస్ బికినీ వేసుకోవాలి అనేవారట. స్ట్రెచ్ మార్కులు ఏమైనా ఉన్నాయా? ఒకసారి బట్టలు విప్పి చూపిస్తారా? అని అడిగి ఇబ్బంది పెట్టేవారట. ఏదైనా సినిమా ఒప్పుకుని అడ్వాన్స్ కూడా తీసుకున్న రెండు రోజుల తర్వాత మేనేజర్ వచ్చి డైరెక్టర్ గారో.. ఫైనాన్సరో మిమ్మల్ని ఓసారి బీచ్ దగ్గరకు రమ్మంటున్నారని పిలిచేవాడని.. ఒంటరిగా రమ్మని అడగటంతో విషయం అర్ధమై పోయేదని ఆమని అన్నారు. ఆమని. సినిమా అనే కాదు.. ఏ రంగంలో అయినా ఇలాంటి పరిస్థితులు ఉంటాయని మంచి, చెడు ఎంపిక చేసుకోవడం అనేది మన చేతుల్లో ఉంటుందని ఆమని చెప్పుకొచ్చారు.