వినోదం

Allu Arjun : ప‌నిమనిషి కోసం బన్నీ చేసిన ప‌ని ఏంటో తెలిస్తే స‌లాం చేయ‌డం ఖాయం..!

Allu Arjun : స్టైలిష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్‌గా మారిన అల్లు అర్జున్ త‌న‌దైన శైలిలో సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు.పుష్ప నుండి ఐకాన్ స్టార్‌గా పిల‌వ‌బ‌డుతున్న బ‌న్నీ అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ ద‌క్కించుకుంటున్నాడు. ప్ర‌స్తుతం బ‌న్నీ పుష్ప 2 చిత్ర షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ వ‌చ్చే ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం అశేష ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. పుష్ప సినిమా దెబ్బకి నార్త్ ఇండియాలో కూడా బన్నీ ఫాలోయింగ్ అమాంతం పెరిగింది. తాజాగా బన్నీ తన లేడీ ఫ్యాన్ కోసం ఓ సెల్ఫీ వీడియో తీశాడు. ఇందులో తన ఫ్యాన్‌తో ఫన్నీగా మాట్లాడాడు బన్నీ. తన ఇంట్లో పని చేసే పని మనిషికి సోషల్ మీడియాలో ఫాలోవర్స్ పెరిగేలా బ‌న్నీ సాయం చేయ‌గా, ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్ అవుతుంది.

తాను పెద్ద స్టార్ ని అని మ‌ర‌చిపోయిన అల్లు అర్జున్ గర్వం ఏమాత్రం లేకుండా ఓ అమ్మాయి కోసం బన్నీ వీడియో చేశారు. నీకు ఎంత మంది ఫాలోవర్స్ కావాలి.. ఇప్పుడు ఎంత మంది ఉన్నారు ? అని అల్లు అర్జున్ ఆమెని అడగడంతో ఆమె 13వేల మంది ఉన్నారు. 20 లేదా 30 వేలు వస్తే చాలు అని బన్నీకి తెలిపింది. ఒకే 30 ఫిక్స్ అంటూ బన్నీ సెల్ఫీ వీడియో తీయ‌గా, ఈ వీడియోని బ‌న్నీ పని మ‌నిషి తన ఇంస్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. క్షణాల్లో వైరల్ గా మారిపోయింది. బ‌న్నీ చేసిన ప‌నికి ప్ర‌తి ఒక్క‌రు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

Allu Arjun

మరోవైపు తెలంగాణ ఎన్నికల పోలింగ్‌లో తన ఓటు హక్కు వినియోగించుకొని అందరి దృష్టిని ఆక‌ర్షించాడు అల్లు అర్జున్. ఉదయాన్నే బీఎస్‌ఎన్‌ఎల్‌ సెంటర్‌ పోలింగ్‌ బూత్‌లో తన ఓటు వేశాడు బన్నీ. అల్లు అర్జున్‌ను చూడగానే అక్కడ ఉన్న ఓటర్లంతా ఆప్యాయంగా పలకరించ‌గా వారితోను స‌ర‌దాగా గ‌డిపాడు బ‌న్నీ. అందరినీ నవ్వుతూ విష్ చేసి తన ఓటు వేసి సైలెంట్‌గా వెళ్లిపోయాడు .ఇక ప్ర‌స్తుతం పుష్ప‌2 చిత్ర షూటింగ్‌తో బిజీగా ఉన్న అల్లు అర్జున్ పుష్ప చిత్రానికి నేష‌న‌ల్ అవార్డ్ అందుకున్న విష‌యం తెలిసిందే. పుష్ప‌2కి గాను ఆయ‌న ఆస్కార్ ద‌క్కించుకుంటాడ‌ని చెబుతున్నారు.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM