Animal Movie OTT : గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా యానిమల్ మూవీ గురించి తెగ చర్చ నడుస్తుంది. ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్, రష్మిక ప్రధాన పాత్రలు పోషించగా ఈ చిత్రాన్ని సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించారు. మూవీకి సంబంధించి జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించారు. డిసెంబర్ 1న తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది ఈ చిత్రం. పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న ఈ సినిమాకి సంబంధించిన ఆసక్తికర విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ సినిమా ఓటీటీ పార్టనర్ గా ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ ఫిక్స్ అయింది.
నెట్‌ఫ్లిక్స్‌లో యానిమల్ మూవీ కొన్ని నెలల తర్వాత స్ట్రీమింగ్ కానుండగా థియేటర్ వర్షన్ కాకుండా ఓటీటీలో డిఫరెంట్ వర్షన్ రిలీజ్ కానుంది. సినిమా రిలీజ్ అయిన ఎనిమిది వారాల తర్వాత ఈ మూవీ ఓటీటీలోకి రానుందని సమాచారం .జనవరి 26 నుంచి నెట్ ఫ్లిక్స్ వేదికగా తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ సినిమా థియేటర్ వర్షన్ కాకుండా ఓటీటీలో మరింత రన్ టైం తో రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. అలాగే యానిమల్ హిందీ రైట్స్ ను సోనీ సంస్థ సొంతం చేసుకుందని తెలుస్తోంది.
యానిమల్ మూవీ తెలుగు రాష్ట్రాల్లో 14 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ నమోదు చేసుకుంది. తెలంగాణ ఏపీ రాష్ట్రాల్లో15 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో శుక్రవారం ఈ యాక్షన్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. యానిమల్ పై ఉన్న హైప్ కారణంగా ఈ మూవీ ఈజీగానే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. తొలిరోజు తెలుగులో మానిమల్ ఐదు కోట్ల వరకు వసూళ్లు రాబట్టనుందని ట్రెడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ మూవీ తెలుగు వెర్షన్ థియేట్రికల్ హక్కులను దిల్‌రాజు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…