అక్కినేని మూడో తరం వారసుడు అఖిల్ వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న విషయం తెలిసిందే. ఓ పెద్ద హిట్ కొట్టాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో తన తదుపరి చిత్రాల ఎంపికలో ఎలాంటి పొరపాట్లు చేయకుండా ఆచి తుచి అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే కంటెంట్ ప్రాధాన్యతకు ఎక్కువగా ఇంపార్టెంట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. గతంలో అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా సూపర్ హిట్ గా నిలవగా, ఈ మూవీ కన్నా మరింత పెద్ద విజయం దక్కించుకోవాలని ఏజెంట్ కోసం బాగా కృషి చేస్తున్నాడు అఖిల్. ఈ సినిమా కోసం అఖిల్ తన మేకోవర్ మొత్తాన్ని మార్చేశారు.
అఖిల్ తాజా చిత్రానికి ఎక్సపెక్టేషన్స్ తగ్గ స్దాయిలో ప్రమోషన్స్ లేవనేది అభిమానుల నుండి టాక్ వినిపిస్తుంది. ఈ క్రమంలో ‘ఏజెంట్’ విడుదల తేదీని ఓ ప్రోమో ద్వారా వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 28న విడుదల చేయనున్నట్టు పేర్కొన్నారు. తాజాగా విడుదలైన టీజర్ లో అఖిల్ లుక్ దారుణంగా ఉందని, పూర్తి రక్తంతో నింపిన లుక్ తో అసలు ఆకట్టుకోలేదని చెబుతున్నారు. మరికొంతమంది రీసెంట్ గా షారూఖ్ ఖాన్, అట్లీ చిత్రం ఫస్ట్ లుక్ టీజర్ ని గుర్తు చేసిందని అంటున్నారు.
ఏజెంట్ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్టు చెప్పారు. ఈ చిత్రంలో సాక్షి వైద్య హీరోయిన్‌గా నటించగా, మమ్ముట్టి ఓ కీలక పాత్రను పోషించారు. ఈ మూవీ టీం తదుపరి షెడ్యూల్ కోసం ఈ నెల 15న మస్కట్‌కు బయలుదేరనుంది. 15 రోజులపాటు సాగే ఈ షెడ్యూల్‌లో యాక్షన్ పార్టును చిత్రీకరించనున్నారట. వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథనందిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్‌గా, అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.