Akhanda Movie : నందమూరి బాలకృష్ణ సినిమా అంటే మాస్ ప్రేక్షకులలో ఎంత జోష్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ఆయన అఖండ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సింహా, లెజెండ్ సినిమాల తర్వాత నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ మూవీ హ్యాట్రిక్ మూవీ కావడంతో అఖండ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నేడు (డిసెంబర్2) న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదలైంది. అర్థరాత్రి నుంచే థియేటర్ల వద్ద అభిమానుల సందడి నెలకొంది.
మనదేశంలోనే కాదు విదేశాలలోనూ అఖండ హంగామా జోరుగా ఉంది. సినిమాలో ఇంట్రడక్షన్, ఇంటర్వెల్, క్లైమాక్స్ సీన్స్, అలాగే థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయాయని సోషల్ మీడియా టాక్. బాలయ్య అభిమానులు అఖండ సినిమా చూస్తూ తెగ రచ్చ చేస్తున్నారట. థియేటర్లో చేసిన రచ్చకు పోలీసులు షాక్ ఇచ్చారట. అయితే అది ఇండియాలో కాదు ఆస్ట్రేలియాలో.
ఆస్ట్రేలియాలోని ఓ థియేటర్లో బాలయ్య అభిమానులు చేసిన రచ్చకు థియేటర్ యజమానులు మూవీ ఆపేసి మరీ మైకులో వార్నింగ్ ఇచ్చారట. అయినా బాలయ్య అభిమానులు ఏ మాత్రం తగ్గకపోవడంతో పోలీసులు రంగంలోకి దిగారట. పోలీసులు షో ఆపేసి మరీ వార్నింగ్ ఇచ్చి వెళ్లారట.
బాలయ్య సినిమాకు ఆ మాత్రం హంగామా చేయరా.. అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. కాగా, విదేశాల్లో సైతం అభిమానులకు అఖండ ఫీవర్ పట్టుకుంది. బాలయ్య అభిమానులను ఉద్దేశించి సినీ మార్క్ థియేటర్‌లో అలర్ట్ పెట్టారు. థియేటర్ సౌండ్‌ని నిర్దిష్ట డెసిబుల్స్‌కు పరిమితం చేసిందని, ఏది ఏమైనప్పటికీ సౌండ్ పెరగదని నోటీసు అంటించారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…